వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేసారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూటమీ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందని వైసిపి పని అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చీమకుర్తి శ్రీకాంత్... జగన్, భారతి బినామీ అంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేశారని సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ పై వైసిపి పాలనలో ఏసిబి దాడులు చేసింది. ఆయన ఆస్తులపై దాడి చేసిందన్నారు. అప్పుడు ధర్మ సింగ్ పారిపోయాడని తర్వాత అరెస్టు అయి రిమాండ్ లో ఉంటూ ధర్మ సింగ్ సిఎం చంద్రబాబు కు లేఖ రాశాడని వివరించారు. కస్టడిలో ఉండి ఎలా లెటర్ రాశాడో అర్థం కావట్లేదన్నారు. జగన్ పెరిగి పోతున్నాడన్న భయం పెరిగిపోయిందని లోకేష్... ధర్మ సింగ్ పేరుతో డ్రామా ఆడిస్తున్నారని విమర్శించారు. ధర్మ సింగ్, చీమకుర్తి శ్రీకాంత్ కు వైసిపికి ఎటువంటి సంబంధం లేదన్నారు అంబటి. [embed]https://www.youtube.com/watch?v=YGxEr7jeNnM[/embed]