YS SHARMILA: చంద్రబాబు లబ్ధికోసమే షర్మిల వ్యాఖ్యలు.. షర్మిలపై వైసీపీ నేతల ఫైర్..
పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పేముందు చూసి మాట్లాడాలి. రమ్మనండి.. ఛాలెంజ్ చేస్తున్నాం. మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు.
YS SHARMILA: వైఎస్ జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు నేతలు షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు లబ్ధి కోసమే షర్మిల పని చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ”రాష్ట్ర అభివృద్ది గురించి షర్మిలకు ఏ తెలుసు ..? ఆమె ఈ రోజే పక్క రాష్ట్రం నుంచి వచ్చారు. షర్మిళ కాదు.. ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయలేరు.
Ayodhya Ramaiah : దేశవ్యాప్తంగా అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన కానుకలు..
పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పేముందు చూసి మాట్లాడాలి. రమ్మనండి.. ఛాలెంజ్ చేస్తున్నాం. మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం. రోడ్లు, భవనాలు, రాజధానులు మాత్రమే అభివృద్ది కాదు. పెదవారు సంక్షేమాలతో అభివృద్ధి చెందుతున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేసి, ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఆమె మాట్లాడితే ఎలా..? వైఎస్సార్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిని, జగన్‌ను ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిపై చార్జ్‌షీటు వేసింది. జగన్‌ను 16 నెలల జైలులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిపై చార్జ్‌షీట్ వేస్తే 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామ చేసారు. వాళ్ళకు ఏం సమాధానం చేపుతావు. ఇన్ని ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి విమర్శలు చేస్తావా..? ఇది ఎంత వరకు కరెక్టో షర్మిల సమీక్షించుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యామే తప్ప మేము ఎక్కడా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదు. చంద్రబాబు దోచినట్లు రాష్ట్రాన్ని దోచేయ్యలేదు” అని విమర్శించారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. ”ఈరోజు మీరు మాట్లాడిన మాటల వల్ల మిమ్మల్ని చరిత్ర కూడా క్షమించదు. రాజశేఖర్ రెడ్డి చిరకాల శత్రువు అయిన చంద్రబాబు కోసం పనిచేయడం సబబేనా..? చంద్రబాబు కుట్రల్లో షర్మిల భాగస్వామ్యం అయ్యారు. అధికారాలు వస్తాయి. పోతాయి. చరిత్రలో తప్పులు చేస్తే మచ్చలుగా మిగిలిపోతాయి. ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీల్చి ఎవరికీ లబ్ధి చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారా.. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి టిడిపి కోసం పనిచేస్తున్నారా..? మీరు చేసే పొరపాటు వల్ల మాయని మచ్చగా మిగిలిపోతారు అని రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి గుండె కూడా బాధపడతా ఉన్నాం” అన్నారు.