ఫర్నీచర్ తీసుకుపోండి: జగన్ సంచలనం
ఆఫీస్‌లోని ప్రభుత్వ ఫర్నీచర్‌పై, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు మరోసారి వైసీపీ లేఖ రాసింది. సాధారణ పరిపాలన శాఖకు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి లేఖ రాసారు. నాటి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న ఫర్నీచర్‌పై వైయస్సార్‌సీపీ లేఖ రాసారు.

Guntur: YSR Congress chief YS Jaganmohan Reddy addresses during a party programme in Guntur of Andhra Pradesh on July 9, 2017. (Photo: IANS)
ఆఫీస్‌లోని ప్రభుత్వ ఫర్నీచర్‌పై, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు మరోసారి వైసీపీ లేఖ రాసింది. సాధారణ పరిపాలన శాఖకు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి లేఖ రాసారు. నాటి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న ఫర్నీచర్‌పై వైయస్సార్‌సీపీ లేఖ రాసారు. జీఏడీ డిప్యూటీ సెక్రటరీకి రాసిన లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు అప్పిరెడ్డి. ఫర్నీచర్ వెంటనే తీసుకుపోవాలని జీఏడీని కోరిన లేళ్ల అప్పిరెడ్డి… ఈ విషయంపై ఇప్పటికే 4సార్లు లేఖ రాసినట్లు, తేదీలతో సహా వెల్లడించారు. ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.
కేవలం నిందలు మోపడానికే, దీనిపై స్పందించడం లేదా అని లేఖలో ప్రశ్నించారు. ఫర్నీచర్‌ను తీసుకుపోవడం వీలు కాకపోతే, ఎక్కడికి పంపాలో చెప్పాలన్న వైయస్సార్‌సీపీ… ఒకవేళ ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే, వాటి ఖరీదు చెబితే చెల్లిస్తామని పేర్కొంది. నాటి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చినందువల్ల, ఈ ఫర్నీచర్ వల్ల ఆఫీస్‌లో స్థలాభావం నెలకొందని ఆ లేఖలో వివరించారు. ఏ విషయమూ వెంటనే చెప్పాలని లేఖలో కోరారు అప్పిరెడ్డి.