YSRCP LIST: ఫోర్త్ లిస్ట్ టెన్షన్.. ఏ నిమిషానికి ఏమి జరుగునో !
నాలుగో జాబితా ఎప్పుడు అన్న ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పండక్కి ముందే క్లారిటీ ఇచ్చేస్తారా.. లేదంటే పండగ వెళ్లాక జాబితా బయటకు వస్తుందా అన్నదానిపై లీడర్లలో టెన్షన్ కనిపిస్తోంది. కొన్నిసీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటి లెక్కల కోసం వాటినీ ఆపాల్సి వచ్చిందంటున్నారు.
YSRCP LIST: వైసీపీలో థర్డ్ లిస్ట్ రిలీజ్ అయినా ఇంకా సీట్ల పంచాయితీ కొలిక్కిరాలేదు. మూడు జాబితాల్లో 59మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను వైసీపీ హైకమాండ్ మార్చింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా.. మరికొన్నింటిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో నాలుగో జాబితా ఎప్పుడు అన్న ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పండక్కి ముందే క్లారిటీ ఇచ్చేస్తారా.. లేదంటే పండగ వెళ్లాక జాబితా బయటకు వస్తుందా అన్నదానిపై లీడర్లలో టెన్షన్ కనిపిస్తోంది. కొన్నిసీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటి లెక్కల కోసం వాటినీ ఆపాల్సి వచ్చిందంటున్నారు.
Ayodhya Ram Mandir : అయోధ్యపై కాంగ్రెస్ లో విభేదాలు.. ఎన్నికల్లో ఓట్లు పోతాయని భయం
నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులును గుంటూరుకు మార్చాలని పార్టీ హైకమాండ్ భావించింది. ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఎంపీ మాత్రం గుంటూరు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఓ దశలో లావు పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగింది. పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు కూడా లావునే కొనసాగించాలని పార్టీ హైకమాండ్‌ను కోరారు. దీంతో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని రేపుతోంది. లావును కొనసాగిస్తే గుంటూరు నుంచి ఎవరిని బరిలోకి దింపుతారన్నది చూడాలి. ఒంగోలులో ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలోకి దిగడంపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఆయనకు పార్టీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా మళ్లీ సందిగ్ధత కొనసాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిని ఒంగోలు నుంచి వైసీపీ బరిలోకి దించుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాగుంటకు సీటు కోసం మాజీ మంత్రి బాలినేని గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంటున్నారు. బాలినేని ఒంగోలు అసెంబ్లీ నుంచే బరిలో ఉంటానని చెబుతున్నా.. దానిపైనా క్లారిటీ రాలేదు.
ఆయన గిద్దలూరు వెళతారన్న ప్రచారం కూడా పార్టీలో సాగుతోంది. అనకాపల్లి, అమలాపురం, నర్సాపురం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాజమండ్రి, కాకినాడ ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా నియమించారు. మరి వీరి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి ఉంది. విజయనగరం ఎంపీగా మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను పేరు దాదాపు ఖరారైందంటున్నారు. అయితే ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను ఎక్కడ సర్దుబాటు చేయాలన్నదానిపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే బెల్లాను పిలిచి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్. బొత్స భార్య బొత్స ఝాన్సీ ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు.