సీత దేవి మెడలో తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఆలూరు నిజయోకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గంలోని చిప్పగిరిలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఆయన.

కర్నూలు జిల్లా ఆలూరు నిజయోకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గంలోని చిప్పగిరిలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఆయన… సీతమ్మకు స్వయంగా తాళి కట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సీతమ్మకు తాళి కట్టిన ఎమ్మెల్యేపై హిందూ సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు.
సీతారాముల కళ్యాణం సందర్భంగా తాళిని తాకి ఇవ్వమని ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళిని అందజేశారు. తాళిని అందుకున్న ఎమ్మెల్యే సీతమ్మ మెడలో కట్టేశారు. తాళి కడుతున్న ఎమ్మెల్యేని పండితులు అడ్డుకోకుండా అక్షింతలు వేశారు. మరోవైపు జరిగిన దానికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు. పండితులు కట్టమంటేనే సీతమ్మ మెడలో తాళి కట్టానని తెలిపారు. దేవుళ్లపై తనకు ఎంతో భక్తి, విశ్వాసం ఉన్నాయని చెప్పారు. గత 15 ఏళ్లుగా అయ్యప్ప మాల కూడా వేస్తున్నానని తెలిపారు.