YSRCP MLA’S: అమ్మో.. ఫోన్ కాల్ వచ్చిందా..? వైసీపీ ఎమ్మెల్యేలకు తాడేపల్లి టెన్షన్

వైసీపీలో ఈసారి 80 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తోంది. దాంతో ఎవరికి తాడేపల్లి ఆఫీసు నుంచి కాల్ వస్తుందో.. వాళ్ళకు టిక్కెట్ ఇవ్వనట్టే అన్న పుకార్లు నడుస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 06:25 PMLast Updated on: Dec 22, 2023 | 6:25 PM

Ysrcp Mlas In Tension About Seats In Next Election

YSRCP MLA’Sఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు తాడేపల్లి టెన్షన్ పట్టుకుంది. అక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటే.. ఇక తమ పని అయిపోయినట్టే అని టెన్షన్ పడుతున్నారు. వైసీపీలో ఈసారి 80 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తోంది. దాంతో ఎవరికి తాడేపల్లి ఆఫీసు నుంచి కాల్ వస్తుందో.. వాళ్ళకు టిక్కెట్ ఇవ్వనట్టే అన్న పుకార్లు నడుస్తున్నాయి. కాల్ రాని వాళ్ళకు టిక్కెట్ కన్ఫామ్ అని అనుకుంటున్నారు. ఈసారి ఏపీలోని 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమాగా చెబుతున్న వైసీపీ అధినేత జగన్.. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులు మొదలుపెట్టారు.

NARA LOKESH: మా నాన్నే సీఎం.. తెగేసి చెప్పిన లోకేష్.. షాక్‌లో జనసేన.. ఆగ్రహంతో కాపులు

ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలను మారుస్తూ.. వాళ్ళ స్థానాల్లో ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమించారు. ఇంకా 60 నుంచి 80 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తారని అంటున్నారు. తాను సొంతంగా తయారు చేయించుకున్న సర్వేలతో పాటు ఐప్యాక్ సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలను ముందేసుకొని అభ్యర్థులను మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి మార్పులతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి పార్టీకి, పదవికి రిజైన్ చేశారు. ఇలా చెప్పాపెట్టకుండా ఎమ్మెల్యేలను మారిస్తే వాళ్ళంతా రెబల్స్‌గా మారతారనీ, లేదంటే వేరే పార్టీలోకి జంప్ అవుతారని జగన్ భావించారు. అందుకే మార్చాలనుకునే ఎమ్మెల్యేలకు తాడేపల్లి ఆఫీసు నుంచి ఫోక్ కాల్ వెళ్తోంది. అక్కడ ఓ ఎమ్మెల్యే కనిపించారంటే చాలు.. నెక్ట్స్ అతనికి టిక్కెట్ లేదనే నిర్ణయానికి వస్తున్నారు వైసీపీ లీడర్లు. ఇలా పిలిపించుకున్న ఎమ్మెల్యేలకు జగన్, ఇతర సీనియర్ నేతలు సర్దిచెబుతున్నారు. మళ్ళీ అధికారంలోకి రాగానే ఏదో ఒక పదవి ఇస్తామని బుజ్జగిస్తున్నారు.

కాల్స్ రాలేదంటే వాళ్ళకి మళ్ళీ టిక్కెట్లు వస్తున్నట్టే. ఓ వైసీపీ ఎమ్మెల్యే తాడేపల్లి వెళ్ళొచ్చాడని ఆ నియోజకవర్గంలో టాక్ వస్తే చాలు.. ఇక వాళ్ళని కేడర్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. నియోజకవర్గంలో పనుల కోసమో, బిల్లుల క్లియరెన్స్‌ కోసమో తాడేపల్లి వెళ్ళొచ్చానని ఆ ఎమ్మెల్యే సర్ది చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదు. దాంతో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ ఫోన్ కాల్ వస్తుందా.. రాదా అన్న టెన్షన్‌లోనే ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలంతా. ఎమ్మెల్యే టెన్షన్‌గా ఏ ఫోన్ కాల్ మాట్లాడినా.. ఒకవేళ పర్సనల్‌గా మాట్లాడుతున్నా.. అది తాడేపల్లి నుంచి వచ్చిందే అన్న ప్రచారం సాగుతోంది. కేడర్ కూడా ఈసారికి తమ ఎమ్మెల్యేకి టిక్కెట్ వస్తుందో రాదో అని అనుమానంతో వాళ్ళని కలవడమే మానేస్తున్నారు. ఈ టెన్షన్‌తో.. తమ నియోజకవర్గాల్లో పనులపైనా శ్రద్ధ పెట్టడం మానేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇంకా ఎన్నిరోజుల పాటు ఈ ఫోన్ కాల్స్ నడుస్తోయో తెలియక పగలూ, రాత్రీ టెన్షన్‌లో గడుపుతున్నారు.