మనోహర్, పరుచూరి డైలాగ్స్ ఆపు: బొత్సా సెటైర్ లు

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు అంశంలో పరుచూరి బ్రదర్స్ లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2024 | 05:44 PMLast Updated on: Dec 09, 2024 | 5:44 PM

Ysrcp Mlc Botsa Satyanarayana Made Key Comments At A Media Conference Held In Visakhapatnam

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు అంశంలో పరుచూరి బ్రదర్స్ లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. పరుచూరి బ్రదర్స్ సినిమాల్లో డైలాగులు రాస్తుంటారని, వాళ్ల డైలాగులకు రెండు వైపులా పదును ఉంటుందని, ఇటైనా మాట్లాడొచ్చు, అటైనా మాట్లాడొచ్చన్నారు.

కానీ, ఇది ప్రభుత్వం అని, పరుచూరి బ్రదర్స్ లా డైలాగులు చెబుతానంటే కుదరదని బొత్స సెటైర్ లు వేసారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వాస్తవాలు మాట్లాడడం అలవర్చుకోవాలని సూచించారు. ఒక్కో ప్రాంతంలో వాతావరణం, కాలం, వర్షపాతం ఇలా పలు అంశాలను అనుసరించి ఒక్కోసారి పంట ఎక్కువ పండుతుంది, ఒక్కోసారి తక్కువ పండుతుంది. ఎక్కువ పండినప్పుడు వచ్చి… తక్కువ పండిన దాంతో లెక్కబెట్టుకుని ఆ ప్రకారమే ముందకుపోతామంటే ఎలా కుదురుతుంది అని ఆయన నిలదీశారు.