Jr NTR-YSRCP: ఎన్టీఆర్‌ను ఆయుధంగా మార్చుకుంటున్న వైసీపీ.. కొడాలి నాని మాటలకు అర్థం అదేనా..

టీడీపీ తరఫున నానికి టికెట్ ఇప్పించింది కూడా జూనియర్ ఎన్టీఆరే అనే టాక్ ఉంది. నిజానికి నాని చాలాసార్లు ఇదే మాట చెప్పారు కూడా! ఐతే ఇప్పుడు సడెన్‌గా ఎన్టీఆర్‌ పేరును ఉపయోగిస్తూ.. టీడీపీని ఓడించాలంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు కారణం అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 03:26 PMLast Updated on: Mar 06, 2024 | 3:26 PM

Ysrcp Using Jr Ntr Name In Their Politics Criticising Nara Lokesh And Tdp

Jr NTR-YSRCP: ఎన్నికల వేళ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. టీడీపీ, జనసేన కూటమిగా వస్తుండడంతో.. ఢీకొట్టేందుకు వైసీపీ రకరకాల వ్యూహాలు ఫాలో అవుతోంది. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమాగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరును ఆయుధంగా మార్చుకుంటోంది. తారక్‌ను రాజకీయ రచ్చలోకి దింపుతోంది. నందమూరి కుటుంబం, ఎన్టీఆర్‌కు మధ్య దూరాన్ని.. వైసీపీ.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

Chinmayi Sripada: భారత్‌లోనే ఇలా? మరో వివాదంలో సింగర్ చిన్మయి

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. నందమూరి కుటుంబం నుంచి దాదాపు అందరు వెళ్లి జైల్లో ఆయనను కలిశారు. ఐతే ఎన్టీఆర్‌ మాత్రం కనీసం సోషల్‌ మీడియాలో కూడా రియాక్ట్ కాలేదు. ఇక ఆ తర్వాత డోంట్‌ కేర్ బ్రదర్ అంటూ బాలయ్య మాటలు కూడా.. ఎన్టీఆర్‌, నందమూరి కుటుంబానికి.. ఎన్టీఆర్‌కు, టీడీపీకి మధ్య దూరం పెరిగిందని చెప్పకనే చెప్పాయ్. ఐతే ఇలాంటి పరిణామాల మధ్య తారక్‌ పేరును వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువస్తున్నారు వైసీపీ నేతలు. ఈసారి ఎన్నికల్లో లోకేష్, చంద్రబాబును గెలిపిస్తే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను పార్టీలోంచి తోసేస్తారని.. పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేసేందుకు.. ఎన్టీఆర్ మీద కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారంటూ.. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయ్. నిజానికి కొడాలి నాని, ఎన్టీఆర్‌ మధ్య.. రాజకీయాలను మించిన అనుబంధం ఉంది. ఒకప్పుడు టీడీపీ తరఫున నానికి టికెట్ ఇప్పించింది కూడా జూనియర్ ఎన్టీఆరే అనే టాక్ ఉంది. నిజానికి నాని చాలాసార్లు ఇదే మాట చెప్పారు కూడా!

ఐతే ఇప్పుడు సడెన్‌గా ఎన్టీఆర్‌ పేరును ఉపయోగిస్తూ.. టీడీపీని ఓడించాలంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు కారణం అవుతోంది. నందమూరి కుటుంబంలో, అభిమానుల్లో చీలిక తీసుకురావడానికే.. నాని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. తన సినిమాలు తాను చేసుకుంటూ.. తనలోకంలో తాను ఉన్నాడు ఎన్టీఆర్. ఐతే రియాక్ట్ కావడం లేదు కదా అని.. ఇలా అతని పేరు వాడుకోవడం ఏంటి అంటూ.. నాని మీద ఫైర్ అవుతున్నారు మరికొందరు. తన పేరును రాజకీయాల్లో వాడుకుంటున్నారని ఆ మధ్య మోహన్‌బాబు వార్నింగ్ ఇచ్చినట్లు.. తారక్‌ కూడా ఓ గట్టి హెచ్చరిక ఇస్తే తప్ప.. ఇలాంటి రచ్చ ఆగుతుంది అంటూ.. మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా ఎన్టీఆర్‌ పేరు తీసుకొస్తూ.. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్.