Yuvagalam: లోకేశ్ పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్ ! ఆ ఒక్కటే ఘోరంగా దెబ్బతీస్తోందా?
నడవనిస్తే పాదయాత్ర.. లేకపోతే దండయాత్ర ! అడుగు పడింది.. ఇక రాజకీయ పిడుగులే ! ఇదీ నారా లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు, మొదలుపెట్టడానికి ముందు టీడీపీ చేసిన హడావుడి ! జీవో నంబర్ వన్ గురించి ఆ మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దాదాపు 4వందల రోజులు.. 4వేల కిలోమీటర్లు.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు.. లోకేశ్ మొదలుపెట్టిన పాదయాత్ర 7వందల కిలోమీటర్ల ఫీట్ దాటింది. మరి 7వందల కిలోమీటర్లలో లోకేశ్‌కు, టీడీపీకి ఏమైనా మైలేజ్ వచ్చిందా.. యువనేత అడుగుల గురించి జనాలు మాట్లాడుకుంటున్నారా అంటే.. అలాంటిదిదేమీ లేదు అనే సమాధానమే వినిపిస్తోంది చాలామంది నుంచి !
పాదయాత్రకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ కనిపించడం లేదు. కార్యకర్తల హడావుడి తప్ప.. జనాల నుంచి పెద్దగా స్పందన లేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. లోకేశ్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదు. లోకేశ్ ఓవర్‌యాక్షన్.. పాదయాత్రను దెబ్బతీస్తోంది. పలకరించినా.. పర్సనల్ విషయాలు చెప్పినా.. లోకేశ్ నడక, నడత, మాట.. సామాన్య జనాలకు చేరువయ్యే విధంగా లేదు అన్నది మెజారిటీ జనాల అభిప్రాయం.
జగన్ పాదయాత్రతో పోలిక పెట్టే అవకాశం లేదు. ప్రధాన కారణం.. సరైన ప్రచారం లేకపోవడమే ! జగన్ ప్రతీ అడుగు సోషల్ మీడియాలో రీసౌండ్ ఇచ్చేది. లోకేశ్ విషయంలో అలా జరగడం లేదు.. అలా అని టీడీపీ సోషల్ మీడియా టీమ్ వీక్‌గా ఉందా అంటే.. అదీ కాదు ! జగన్‌ను తిట్టడం, వైసీపీని నిలదీయడం మీద పెట్టిన దృష్టి.. లోకేశ్ పాదయాత్రను ప్రమోట్ చేయడం మీద టీడీపీ సోషల్ మీడియా టీమ్ పెట్టడం లేదు. మెయిన్‌స్ట్రీమ్ సొంత మీడియా చూపించినా.. పెద్దగా జనం చూస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో లోకేశ్‌ను హీరో చేసేందుకు వాళ్లు పడుతున్న శ్రమ అంతా వృథా అవుతున్న పరిస్థితి.
ఇక ఖర్చు విషయంలో ఎవరికి వారు మెడలు తిప్పేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఒక్క రూపాయి బయటకు తీయాలంటే.. వందసార్లు ఆలోచిస్తున్నారు. పార్టీ లీడర్లు ఎవరూ ఖర్చుకు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక నేతలు ఖర్చు చేయడం లేదు కదా అని లోకేశ్ అయినా ఖర్చు పెడుతున్నారా అంటే.. అదీ లేదు ! పైగా భార్య సంపాదనతోనే నడుస్తుందనే మాట ఎలాగూ ఉంది. లోకేశ్ పిసినారితనమే.. పాదయాత్రకు ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. రాజకీయం అంటేనే ఖర్చుతో కూడుకున్నది. అలాంటిది ఏపీ రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమాయకత్వమో, అత్యాశో, పిసినారితనమో.. కారణం ఏదైనా.. యువగళానికి అనుకున్నంత బజ్ రావడం లేదు అనేది మెజారిటీ వర్గాల అభిప్రాయం.