YV Subbareddy: షర్మిల కాంగ్రెస్‌లో చేరినా మాకు ఇబ్బందేం లేదు: వైవీ సుబ్బారెడ్డి
షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నాకు ఎలాంటి సమాచారం లేదు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది లేదు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారు.
YV Subbareddy: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తమకేం ఇబ్బంది లేదని, జగన్ చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వ్యాఖ్యానించారు వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరే అంశంపై మంగళవారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ”నేను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదు. నెల రోజుల తరువాత విజయమ్మను కలిసేందుకు హైదరబాద్ వెళ్ళా. కుటుంబ సభ్యులను కూడా కలవకుడదా..?
విజయమ్మతో భేటీలో కుటుంబ విషయాలే చర్చిస్తున్నాం. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నాకు ఎలాంటి సమాచారం లేదు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది లేదు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరినా మాకు ఇబ్బంది లేదు. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలే వైసీపీని గెలిపిస్తాయి. వచ్చే ఎన్నికల్లో కొంత మందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు వున్నాయి. దాడి వీరభద్రరావుకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అయన రాజీనామా చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. పలువురు ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీలు మారుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే షర్మిల వెంట వెళ్లాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నిర్ణయించుకున్నారు.
ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజం. జగన్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలే జగన్‌ను మరోసారి ఆశీర్వదించి సీఎంను చేస్తారు. సీఎం చేసే అభివృద్ది కార్యక్రమాలే మాకు విజయాన్ని అందిస్తాయి. చాలా స్థానాల్లో వైసీపీ నష్టపోకుండా ఉండేందుకే అభ్యర్థులను మారుస్తున్నాం. వాస్తవ పరిస్థితులు, వేర్వేరు కారణాలతో సీట్లు మారుస్తున్నాం” అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.