NARA LOKESH: జడ్ ప్లస్ అవసరమా..? లోకేష్‌కి భద్రత ప్లస్సా.. మైనస్సా..!

లోకేష్ చుట్టూ AK47 రైఫల్స్ పట్టుకొని భద్రతా సిబ్బంది ఉంటే.. ఆయన్ని కలవడానికి బాధలు చెప్పుకోడానికి ఎవరు ముందుకు వస్తారు. సామాన్యులైతే అస్సలు సాహసం చేయరు. సామాన్య జనం మాట అటుంచితే.. కనీసం పార్టీ కార్యకర్తలు కలుసుకోవాలన్నా ఇబ్బందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 02:23 PMLast Updated on: Apr 02, 2024 | 2:24 PM

Z Plus Security Allotted To Nara Lokesh By Central Govt Is It Plus Or Minus

NARA LOKESH: టీడీపీ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆయన అడగ్గానే కేంద్రం ఆమోదించడం.. సెక్యూరిటీ కేటాయించడం స్పీడ్‌గా జరిగాయి. కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువనేతకు జడ్ ప్లస్ భద్రత అవసరమా.. ఒకప్పుడు జగన్ కాదనుకున్న.. పవన్ కల్యాణ్ ఎప్పుడూ అడగని ఈ భద్రతపై లోకేష్‌‌కు ఎందుకంత మోజు.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ యువ నేత నారా లోకేష్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడంపై ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు.

Urvashi Rautela: నా హైట్ కూడా లేరు.. పంత్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ఊర్వశి

సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రానికి – టీడీపీకి ఉన్న సన్నిహిత సంబంధాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు లోకేష్ కు ఆ స్థాయి భద్రత అవసరమా అన్న టాక్ ఏపీలో నడుస్తోంది. లోకేష్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లీడర్. ఆయన జనంలో బాగా తిరగాలి. వాళ్ళతో మమేకం అవ్వాలి. అలాంటిది లోకేష్ చుట్టూ AK47 రైఫల్స్ పట్టుకొని భద్రతా సిబ్బంది ఉంటే.. ఆయన్ని కలవడానికి బాధలు చెప్పుకోడానికి ఎవరు ముందుకు వస్తారు. సామాన్యులైతే అస్సలు సాహసం చేయరు. సామాన్య జనం మాట అటుంచితే.. కనీసం పార్టీ కార్యకర్తలు కలుసుకోవాలన్నా ఇబ్బందే. గతంలో లోకేష్‌కి ప్రైవేట్ సిబ్బంది ఉన్నా.. జనం కానీ, పార్టీ కార్యకర్తలుగానీ ఆయన్ని కలుసుకోడానికి పెద్దగా అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడలా కాదు. కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. కాంగ్రెస్‌తో విభేదించి.. వైసీపీ పార్టీ స్థాపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు.

ఆ తర్వాత వాళ్ళంతా మంచి మెజారిటీతో గెలిచారు. ఆ టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులు పెరగడంతో.. జగన్‌కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలంటూ ఓ YCP లీడర్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. కానీ జగన్ అందుకు తిరస్కరించారు. భద్రతా బలగాలు వెంట ఉంటే.. జనంలో తిరగడం కష్టమనుకున్నారు. అలాగే పవన్ కల్యాణ్ ఇప్పటికీ జనంలో తిరగడానికి ఇష్టపడతారు. ప్రైవేట్ సిబ్బంది ఉన్నప్పటికీ.. పెద్దగా అభ్యంతరం చెప్పరు. కాకపోతే బ్లేడ్ బ్యాచ్‌తో దాడులు జరుగుతున్నాయని పవన్ సెన్షేషనల్ కామెంట్ చేశారు. కానీ జగన్, పవన్ వద్దనుకున్న జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని లోకేష్ ఎందుకు ఏరి కోరి తెచ్చుకున్నారో అర్థం కావట్లేదని అంటున్నారు విశ్లేషకులు.