Top story: పుతిన్‌లోని గూఢచారిని నిద్రలేపిన జెలెన్స్‌కీ

వ్లాదిమిర్ పుతిన్.. రష్యా అధినేతగా కంటే ముందు దేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని ఒక గూఢచారి.ఎనిమీ ఎంతటివాడైనా ఈయన స్కెచ్ వేస్తే తప్పించుకోవడం ఇంపాజిబుల్. అది సీక్రెట్ ఏజెంట్‌గా పుతిన్ హీస్టరీనే చెబుతుంది. పరాయి దేశాల్లో దాక్కొన్న తన శత్రువులను అంతం చేయడంలో పుతిన్‌ రూటే సెపరేట్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 04:25 PMLast Updated on: Dec 20, 2024 | 4:25 PM

Zelensky Awakens The Spy In Putin

వ్లాదిమిర్ పుతిన్.. రష్యా అధినేతగా కంటే ముందు దేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని ఒక గూఢచారి.ఎనిమీ ఎంతటివాడైనా ఈయన స్కెచ్ వేస్తే తప్పించుకోవడం ఇంపాజిబుల్. అది సీక్రెట్ ఏజెంట్‌గా పుతిన్ హీస్టరీనే చెబుతుంది. పరాయి దేశాల్లో దాక్కొన్న తన శత్రువులను అంతం చేయడంలో పుతిన్‌ రూటే సెపరేట్. కానీ, ఫస్ట్ టైమ్ పుతిన్‌కే ఊహించని ఝలక్ తగిలింది. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, ఆ దేశ ఆర్మీ న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అధిపతిని పక్కాగా స్కెచ్ వేసి అంతం చేసింది ఉక్రెయిన్. ఈ సీక్రెట్ మిషనే పుతిన్‌లోని గూఢచారిని మళ్లీ నిద్రలేపింది. ఫలితంగా ఉక్రెయిన్‌లో పెను విధ్వంసం మొదలైంది. కానీ, జెలెన్‌స్కీ ఇప్పుడే ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎందుకు చేసినట్టు? మాస్కో న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అధిపతిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉక్రెయిన్ చేసిన ఈ పనికి పుతిన్ ఎందుకంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

2022 ఫిబ్రవరి 24.. ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడిన రోజు. దానికి కొద్ది రోజుల ముందు రష్యా నుంచి వచ్చిన ఓ కీలక ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఉక్రెయిన్‌లో అమెరికా బయోవెపన్స్‌కు సంబంధించిన ల్యాబ్ నిర్మిస్తుంది అన్నది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన చేసింది రష్యా ఆర్మీలోనే అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరు. పేరు ఇగోర్‌ కిరిల్లోవ్‌..! రష్యా ఆర్మీ న్యూక్లియర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌. అన్నింటికీమించి పుతిన్‌కు అత్యంత నమ్మకస్థుడు. కీవ్‌లో అమెరికా జీవాయుధాల ప్రయోగశాలను నిర్మిస్తుందన్న ప్రకటనతో ఇగోర్ పశ్చిమ దేశాలకు ప్రధాన శత్రువు అయ్యాడు. ఇది జరిగి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తవుతోంది. కట్‌చేస్తే… ఇప్పుడు ఉక్రెయిన్ ఇగోర్ కిరిల్లోవ్‌పై అవే ఆరోప ణలు చేసింది. తమ దేశంపై రసాయన ఆయుధాలు ప్రయోగించేలా ఆదేశించారంది. ఈ ఆరోపణల్లో కీవ్ ఎక్కడా ఇగోర్ పేరు ప్రస్తావించలేదు. కానీ, అది జరిగిన 24 గంటల్లోనే ఇగోర్ కిరిల్లోవ్ బాంబు దాడిలో మరణించారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చిన బాంబు పేలడంతో ఇగోర్‌తో పాటు ఆయన సహచరుడూ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడే ఉక్రెయిన్ కుట్ర బయటపడింది.

చివరికి అనుకున్నట్టే ఉక్రెయిన్ నుంచి ప్రకటన వచ్చింది. జీవ రసాయన ఆయుధాల రక్షణ దళానికి చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్‌ ఇగోర్ కిరిల్లోవ్‌‌ను హత్య చేసింది తామేనని సెక్యూరిటీ సర్వీసెస్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌ వెల్లడించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా.. ఉక్రెయిన్‌పై చేసిన సైనిక ఆపరేషన్‌లోనే ఇగోర్ నిషేధిత రసాయనాలను ఉపయోగించినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ డిసెంబర్ 16న ఆరోపణలు చేసింది. 4వేల 800 కంటే ఎక్కువ రసాయన ఆయుధాలను ఉపయోగించినట్లు పేర్కొంది. ముఖ్యంగా కే-1 అటాకింగ్ గ్రెనేడ్‌లను వాడినట్లు స్పష్టం చేసింది. ఇది జరిగిన 24 గంటల్లోనే ఇగోర్ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. క్రెమ్లిన్‌కు కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాజాన్స్కీ ప్రాస్పెక్ట్‌లో కిరిల్లోవ్ ఉంటారు. ఇది తెలుసుకున్న శత్రువులు ఆయన ఉండే అపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 300 గ్రాముల పేలుడు పదార్థాలను ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చారు. ఇగోర్ బయటకు వచ్చిన సమయంలో రిమోట్ సాయంతో పేల్చేశారు. ఈ దాడిలో కిరిల్లోవ్‌తో పాటు అతని సహాయకుడు కూడా మరణించాడు. దాదాపు మూడేళ్ల ఈ యుద్ధంలో ఉక్రెయొన్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే. అది ఇప్పుడే జెలెన్‌స్కీకి తెలిసొ స్తుంది.

పుతిన్‌ గురించి తెలిసిన ఎవ్వరూ ఆయనతో పెట్టుకోవాలని కలలో కూడా అనుకోరు. కానీ, జెలెన్‌స్కీ ఆ పని చేశారు. పైగా రష్యా రాజధాని మాస్కోలోనే ఆ దేశ రక్షణ వ్యవస్థలో కీలక వ్యక్తిని అంతం చేశారు. ఇంత చేసిన తర్వాత పుతిన్ ఎందుకు ఊరుకుంటారు? ఉక్రెయిన్‌‌పై విరుచుకుపడాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే కిరిల్లోవ్ హత్యకు ప్రతీకారంగా కీవ్‌పై విరుచుకుపడిపోయాని పుతిన్ సేనలు. పలు ప్రాంతాల్లోని ఉక్రెయిన్ దళాలను పడగొడుతూ ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ టాప్ కమాండర్ ఒలెక్సాండర్ సిర్స్కీ జెలెన్‌స్కీ ప్రభుత్వానికి నివేదించారు. పైగా ఈ దాడులకోసం ఉత్తర కొరియా సైనికులని రంగంలోకి దించినట్టు వివరించారు. ప్రధానంగా కుర్స్క్‌ ప్రాంతంలో రష్యా సేనలు తీవ్రమైన దాడులు చేస్తున్నాయనీ.. అత్యంత వేగంగా తూర్పు డొనెట్స్క్‌ ప్రాంతంలోనూ భీకర దాడులు చేస్తున్నాయని సిర్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ కమాండరే ఈ విషయాలు చెప్పారంటే కీవ్‌పై మాస్కో ఏ రేంజ్‌లో విరుచుకుపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే, పుతిన్‌తో పెట్టుకోవద్దు అనేది.

నిజానికి.. ఇప్పుడు విరుచుకుపడుతున్న కుర్క్స్ ప్రాంతం రష్యా భూభాగంలోనిదే. ఈ ప్రాంతంలోకి ఉక్రెయిన్ బలగాలు ఆగస్టులోనే చొరబడ్డాయి. కానీ, ఆ తర్వాత కుర్స్క్‌లో ఉక్రెయిన్ ఆటలు సాగలేదు. ఫలితంగా ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న కుర్స్క్‌లోని 40శాతం భూభాగం తిరిగి మాస్కో వశమైంది. ఇప్పుడు ఇగోర్‌ కిరిల్లోవ్ హత్యకు ప్రతీకారంగా యాక్షన్ మార్చడంతో కుర్స్క్ త్వరలో పూర్తిగా రష్యా ఆధీనంలోకి వస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ ఉక్కు పరిశ్రమ కోసం కోకింగ్ బొగ్గును ఉత్పత్తి చేసే కొలీరీ ప్రదేశమైన పోక్రోవ్స్క్‌తో పాటు హన్నివ్కా అనే గ్రామాన్ని సైతం తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. రష్యా దూకుడు చూస్తుంటే త్వరలోనే యుద్ధం ముగియడం ఖాయం అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పవర్‌ ఫుల్ మిస్సైళ్లను ఉక్రెయిన్‌పై సంధిస్తున్న మాస్కో.. ఆ దూకుడు మరింత పెంచబోతున్నట్టు కనిపిస్తోంది. ఒక్క ముక్కలో ఇగోర్‌ కిరిల్లోవ్ హత్య ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఎండ్ గేమ్‌గా మార్చేసింది. ఇదే వార్‌జోన్‌లో పుతిన్ మార్క్ విధ్వంసం అంటే..