భూమ్మీద ఇక మగజాతి ఉండదా ? వణుకు పుట్టిస్తున్న జపాన్ పరిశోధన
కొన్నేళ్లలో మగజాతి అంతం కాబోతోందా ? భవిష్యత్తులో ఈ భూమి మీద మగవాడు అనేవాడు ఉండడా ? వినడానికి విడ్డూరంగా ఉన్నా..
కొన్నేళ్లలో మగజాతి అంతం కాబోతోందా ? భవిష్యత్తులో ఈ భూమి మీద మగవాడు అనేవాడు ఉండడా ? వినడానికి విడ్డూరంగా ఉన్నా.. జపాన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధన ఇలాంటి భయాలను పుట్టిస్తోంది. తల్లి కడుపులోని బిడ్డ లింగాన్ని నిర్ధారించడంలో పురుషుల విర్యకణాల్లోని వై-క్రోమోజోమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, గడిచిన కొంతకాలంగా ఈ జన్యువుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోందని, రానున్న కాలంలో ఇవి కనుమరుగైనా ఆశ్చర్యపోనమసరం లేదని జపాన్లోని హొక్కయిడో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఇదే జరిగితే భవిష్యత్తులో పురుషులు ఉండే అవకాశాలు చాలా తక్కువ అని పరిశోధకులు అంచనాకు వచ్చారు. అయితే, వైద్యశాస్త్రంలో అమల్లోకి వచ్చిన వినూత్న పద్ధతులు, ఆవిష్కరణల ద్వారా కొత్త జన్యువుల సృష్టితో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం అంత పెద్ద కష్టమేమీ కాదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివరాలను ప్రాసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్స్ ప్రకటించింది. మనుషులు సహా క్షీరదాల వంటి పాలిచ్చే ఆడ జంతువుల్లో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్స్ ఉంటాయి. మగవాటిలో ఒక ఎక్స్-క్రోమోజోమ్‌తో పాటు ఒక వై-క్రోమోజోమ్ కూడా ఉంటుంది. ఇది గర్భంలోని శిశువు లింగాన్ని నిర్దాదిస్తుంది. అయితే, పురుషుల్లోని ఎక్స్-క్రోమోజోమ్‌లో 200 వరకూ వివిధ రకాల జన్యువులు ఉండగా, వై క్రోమోజోమ్లో మాత్రం వాటి సంఖ్య 1900 నుంచి 55% పడిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. గడిచిన 160 మిలియన్ సంవత్సరాల్లో ఈ మేరకు జన్యువుల క్షీణత తగ్గినట్టు తెలిపారు. ఇది కొనసాగితే రానున్న 110 లక్షల ఏండ్లలో వై క్రోమోజోమ్లోని మిగిలిన 56 జన్యువులు కనిపించకుండా పోవచ్చని, గర్భంలోని ప్రతి శిశువు ఆడ శిశువుగానే పుట్టొచ్చని అభిప్రాయపడ్డారు పరిశోధకులు. తూర్పు ఐరోపాలో కనిపించే మోల్‌వోల్స్ అనే ఎలుక జాతికిలో ఈ మార్పును ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. ఈ ఎలుకల్లో మగ జన్యువులు, జపాన్లో కనిపించే మగ స్పైన్ ఎలుకల్లో ఇప్పటికే ‘వై’ క్రోమోజోమ్స్ అంతరించిపోయాయని చెప్తున్నారు. మనుషుల్లో కూడా ఇదే జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.