Diabetes: బాబోయ్..! దేశంలో ఎంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు! మైండ్ పోయే విషయాలు బయటపెట్టిన ఐసీఎంఆర్
ప్రస్తుతం మన దేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల మార్కును దాటింది. 2019లో 7 కోట్లుగా ఉన్న ఆ సంఖ్య కేవలం నాలుగేళ్లులో 44 శాతం పెరిగింది. గోవా (26.4శాతం), పుదుచ్చేరి (26.3శాతం), కేరళ (25.5శాతం) మొదటి మూడు స్థానల్లో ఉన్నాయి. జాతీయ సగటు 11.4 శాతంగా ఉంది.
Diabetes: దేశంలో షుగర్ పేషెంట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా.. అంతా మధుమేహం బారిన పడుతున్నారు. తాజాగా ఐసీఎంఆర్ విడుదల చేసిన హెల్త్ రిపోర్టులో ఫ్యూజులౌటయ్యే విషయాలు బయటపడ్డాయి.
మార్నింగ్ లేస్తారు. పరుగుపరుగున రయ్ రయ్ మంటూ ఆఫీస్‌కు దూసుకుపోతారు. సాయంత్రం అలిసిపోయి ఇంటికి వస్తారు. తినేసి పడుకుంటారు. ఇప్పటికాలంలో ఓ సగటు ప్రైవేట్ ఉద్యోగి చేస్తున్నదిదే..! మనసు అలిసిపోవడమే కానీ.. శరీరం కదిలే పరిస్థితి లేదు. మధ్యమధ్యలో తినే ఫాస్ట్‌ఫుడ్ ఐటెమ్స్‌తో మన ఆరోగ్యం మనకు తెలియకుండానే పాడవుతుంది. ఇటు ఉద్యోగుల సంగతి అటు ఉంచితే.. చిన్నతనం నుంచి ఫిజికల్ గేమ్స్‌కి దూరంగా ఉంటున్న పిల్లలు పెరిగి, టీనేజ్ దాటిన తర్వాత అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. యుక్తవయసులోనే షుగర్ పేషెంట్లగా మారుతున్నారు. అటు మిడిల్ ఏజ్ వయసున్న వారి సంగతి అందరికి తెలిసిందే. ఎవరిని కదిలించినా షుగర్ ఉందన్న విషయం అర్థమవుతుంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య డయాబెటిస్. దేశంలో మధుమేహం విస్తృతిపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) చేసిన ఓ అధ్యయనం తాజాగా యూకేకు చెందిన మెడికల్ జర్నల్ లాన్‌సెట్‌లో ప్రచురితమైంది. ఈ జర్నల్‌లోని విషయాలు మరింత ఆందోళన పెంచే విధంగా ఉన్నాయి.
ప్రస్తుతం మన దేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల మార్కును దాటింది. 2019లో 7 కోట్లుగా ఉన్న ఆ సంఖ్య కేవలం నాలుగేళ్లులో 44 శాతం పెరిగింది. గోవా (26.4శాతం), పుదుచ్చేరి (26.3శాతం), కేరళ (25.5శాతం) మొదటి మూడు స్థానల్లో ఉన్నాయి. జాతీయ సగటు 11.4 శాతంగా ఉంది. అంటే ప్రతి 100మందిలో 11మందికి షుగర్ ఉన్నట్టు లెక్క. నిజానికి అధికారులు, అధ్యయనాలకు తెలియని సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులు చేయించుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. రానున్న రోజుల్లో యూపీ, ఎంపీ, బిహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మధుమేహం కేసులు ఓ విస్ఫోటనంలా వ్యాపిస్తాయని అధ్యయనం హెచ్చరించింది. ఈ జాబితాలో తెలంగాణ 17వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచాయి. తెలంగాణలో 9.9 శాతం, ఏపీలో 9.5 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో డయాబెటిస్ బాధితుల సంఖ్య స్టెబిలైజ్ అవుతుండగా, ఇతర రాష్ట్రాల్లో మాత్రం డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది.
ఎలాంటి వ్యాధికైనా చికిత్స తీసుకుంటే తగ్గే ఛాన్సులు ఉంటాయి కానీ షుగర్ అలా కాదు. అది ఒక మొండి వ్యాధి. కంట్రోల్‌లో పెట్టుకోవడమే కానీ క్యూర్ అయ్యే అవకాశమే లేని వ్యాధి. అందుకే షుగర్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు వేసుకోవడంకంటే.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నదానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తే మంచిది. ముఖ్యంగా పిల్లలు, యువతకు చిన్నతనం నుంచే షుగర్‌పై అవగాహన ఉంటే బెటర్. గుడ్ లైఫ్ స్టైల్, మంచి ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా డయాబెటిస్‌ను నివారించవచ్చు. ఇక ఫిజికల్ ఎక్సర్‌సైజ్ మస్ట్. ప్రతి రోజూ వ్యాయమం తప్పకుండా చేయాలి. పెద్దయ్యాక.. షుగర్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్‌లో పెట్టడానికి చెమట చిందించే కంటే ముందునుంచే ఫిజికల్ ఎక్సర్‌సైజ్ క్రమం తప్పకుండా చేస్తే షుగర్‌తో పాటు అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోగలం.