24 గంటల్లో 16 సూర్యోదయాలు..! 9 నెలల అంతరిక్ష జర్నీ.. సునీతా విలియమ్స్ మాటల్లో..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి దాదాపు 9 నెలల తరువాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తిరిగి వచ్చారు. భూమి 400 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ISSలో వాళ్లు గడిపిన జీవితం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ అంతరిక్ష కేంద్రం ప్రతి 24 గంటలకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి దాదాపు 9 నెలల తరువాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తిరిగి వచ్చారు. భూమి 400 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ISSలో వాళ్లు గడిపిన జీవితం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ అంతరిక్ష కేంద్రం ప్రతి 24 గంటలకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఇలా ప్రయాణించే సమయంలో ISSలో ఉండే ఆస్ట్రోనాట్స్ 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను చూస్తారు. ఆ కేంద్రంలో ఉన్న వారు ప్రతి 45 నిమిషాలకు ఒక సూర్యోదయాన్ని, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తుంటారు. భూమిని ఒక ప్రత్యేక కోణంలో చూస్తూ జీవించడం ద్వారా.. దాని గురించి మరింత తెలుసుకునేందుకు అవసరమైనంత సమయం దొరుకుతుందని సునీతా విలియమ్స్ చెప్పారు.
“కాస్త భిన్నంగా ఆలోచించేందుకు మీకు అవకాశం దొరుకుతుంది. మనకున్న ఒకే ఒక్క గ్రహం ఇది. దీన్ని బాగా చూసుకోవాల్సి ఉందని తన ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నారు సునీతా విలియమ్స్. ఇక భూమి మీద ఉన్న మనుషుల కంటే స్పేస్‌లో ఉన్న వాళ్లకు ఫిట్‌నెస్ చాలా అవసరం. జీరో గ్రావిటీలో వాళ్లు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే అక్కడ కూడా డైలీ ఎక్సర్‌సైజ్‌లు చేసేవారట. బుచ్ విల్మోర్ తన రోజువారి కార్యక్రమాలను 4.30కు మొదలుపెడితే, సునీతా విలియమ్స్ 6.30కు తన రోజును ప్రారంభించేవారట. స్పేస్ స్టేషన్‌లో దీర్ఘకాలంపాటు ఉండాల్సి వచ్చినప్పుడు, ఎముకలు బలహీనపడే పరిస్థితిని తట్టుకునేందుకు ప్రతిరోజు రెండు గంటలు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. తాము రోజూ రెండు గంటలు లేదా అంతకు మించిన ఎక్సర్‌సైజులు చేసినట్లు ఈ ఇద్దరు చెప్పారు.
కండరాలకు ఉపయోగపడే అన్నిరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్‌సైజ్ డివైస్.. ARED..ఉపయోగపడుతుంది. స్పేస్ స్టేషన్‌లోని సిబ్బంది ట్రెడ్‌మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్‌ను కూడా వాడతారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ ఆస్ట్రోనాట్స్ అక్కడి నుంచే ఓట్లు వేశారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతో పాటు.. వారితో ఉన్న మరో ఇద్దరు అమెరికన్లు డాన్ పెటిట్, నిక్ హేగ్‌లు గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని పొందారు. ఓటు వేసే అవకాశం కల్పించేందుకు హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ ఎన్‌క్రిప్టెడ్ ఈమెయిల్స్ ద్వారా బ్యాలెట్ పేపర్లను అంతరిక్ష కేంద్రానికి పంపింది. వ్యోమగాములు వాటిని నింపి శాటిలైట్ ద్వారా పంపించారు. అక్కడి నుంచి అవి న్యూ మెక్సికోలోని గ్రౌండ్ టెర్మినల్‌కు వచ్చాయి. ఆ బ్యాలెట్ న్యూ మెక్సికో నుంచి జాన్సన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌కు, అక్కడ నుంచి కౌంటీ క్లర్క్‌కు చేరింది. ఓటుకున్న సమగ్రతను కాపాడేందుకు ఆ డేటాను రహస్యంగా ఉంచారు. అందులో ఉన్న వివరాలు కౌంటీ క్లర్క్‌కు, అప్లికేషన్ పంపించిన ఆస్ట్రోనాట్‌కు మాత్రమే తెలుస్తాయి.