2024 Telangana Holidays: 2024లో తెలంగాణలో సెలవులు ఇవే !

2024 సంవత్సరంలో తెలంగాణలో సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఇందులో జనవరి 1నాడు కూడా సెలవు ఉంది.  అయితే దానికి బదులు ఫిబ్రవరి 10 రెండో శనివారం (Second Saturday) నాడు పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2023 | 04:43 PMLast Updated on: Dec 12, 2023 | 5:13 PM

2024 Telangana Holidays

2024 Telangana Holidays: 2024 కొత్త ఏడాదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హాలిడేస్ లిస్టును ప్ర‌క‌టించింది. ఈ ఏడాదిలో సాధార‌ణ సెల‌వులు 27 ఉన్నాయి. ఆప్షనల్ హాలిడేస్ 25 ఉంటాయి. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఈ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

జనవరి 1  కొత్త సంవత్సరం

జనవరి 14 భోగి

జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సెల‌వు

జనవరి 26 రిపబ్లిక్ డే

మార్చి 8న మ‌హా శివ‌రాత్రి

మార్చి 25న హోలీ

మార్చి 29 గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 9న ఉగాది

ఏప్రిల్ 11న ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)

ఏప్రిల్ 12న రంజాన్ తెల్లవారి సెలవు

ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 17న శ్రీరామ‌న‌వమి

జూన్ 17న బ‌క్రీద్

జులై 17న మొహర్రం

జులై 29న బోనాలు ప్రారంభం

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి

సెప్టెంబ‌ర్ 7న వినాయక చ‌వితి

అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి/బతుకమ్మ మొదటి రోజు

అక్టోబ‌ర్ 12న ద‌స‌రా

అక్టోబర్ 13న విజయదశమి తెల్లవారి సెలవు

అక్టోబ‌ర్ 31న దీపావ‌ళి

నవంబర్ 15న కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి

డిసెంబర్ 25 క్రిస్మస్

డిసెంబర్ 26న క్రిస్మస్ తెల్లవారి సెలవు/ బాక్సింగ్ డే

ఈ సెల‌వులను ప్రకటించారు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటినాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది.

 

ఆప్షనల్ హాలీడేస్ 2024 :
జనవరి 16 (కనుమ),

జనవరి 25 (హజ్రత్ అలీ బర్త్ డే),

ఫిబ్రవరి 8 (షబ్ ఈ మిరాజ్),

ఫిబ్రవరి 14 (శ్రీ పంచమి),

ఫిబ్రవరి 26 (షబ్ ఈ బరత్),

మార్చి 31 (షహదత్ హజత్ అలీ),

ఏప్రిల్ 7 (షబ్ ఈ ఖదర్),

ఏప్రిల్ 14 (తమిళ్ న్యూ ఇయర్స్ డే),

ఏప్రిల్ 21 (మహావీర్ జయంతి),

మే 10 (బసవ జయంతి),

మే 23 (బుద్ధ పూర్ణిమ),

జూన్ 25 (ఈద్ ఇ ఘదీర్),

జూలై 7 (రత్నయాత్ర),

జూలై 16 (మొహర్రం),

ఆగస్టు 16 (వరలక్ష్మీ వ్రతం),

ఆగస్టు 19 (శ్రావణ పూర్ణిమ) ,

అక్టోబర్ 10 (దుర్గాష్టమి),

అక్టోబర్ 11 (మహార్నవమి),

అక్టోబర్ 30 (నరక చతుర్ది),

నవంబర్ 16 (సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ జయంతి)