కొడుకు ఆరోగ్యం కోసం 4బిర్యానీలు.. కన్నీళ్లు పెట్టించే ఓ తండ్రి కథ..
అన్నిచోట్ల తానుండలేక అమ్మను సృష్టించిన దేవుడు.. తానూ ఉండాలన్న కోరిక చంపుకోలేక నాన్నలా పుట్టాడు అంటారు. తల్లిని మించిన యోధురాలు లేదు అని మాట్లాడుకునే ప్రపంచానికి.. తండ్రి ప్రేమ ఎప్పుడూ చులకనే
అన్నిచోట్ల తానుండలేక అమ్మను సృష్టించిన దేవుడు.. తానూ ఉండాలన్న కోరిక చంపుకోలేక నాన్నలా పుట్టాడు అంటారు. తల్లిని మించిన యోధురాలు లేదు అని మాట్లాడుకునే ప్రపంచానికి.. తండ్రి ప్రేమ ఎప్పుడూ చులకనే ! కొడుకులు, కూతుళ్లపై ప్రేమను చూపించడంలో.. నిజంగా నాన్నెందుకు వెనకపడుతుంటాడు ఎప్పుడూ ! ఐతే బిడ్డల కోసం ఎప్పుడూ కష్టపడే నాన్న.. ఓ గుర్తింపు లేని పాత్రగానే మిగిలిపోతాడు. ఎవరు గుర్తించినా.. గుర్తించకపోయినా.. కష్టం కాంపౌండ్ వాల్ దాటకుండా కాపాడుకుంటాడు.
పైకి ఎంతో గంభీరంగా కనిపించిన.. తల్లిలా అమితమైన ప్రేమను ఒలక బోయకపోయినా… తండ్రి ఎప్పుడు తన పిల్లల కోసం పిల్లల కంటికి కనిపించని ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు. పిల్లలకు కష్టం వచ్చింది అంటే చాలు ఆ కష్టాన్ని తీర్చేందుకు తండ్రి ఎలాంటి త్యాగం చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటాడు. ఎంత కష్టమైనా భరించడానికి రెడీగా ఉంటాడు. అలాంటి సంఘటనే జరిగింది తమిళనాడులో. కొడుకు కోసం ఏకంగా ఆరు బిర్యానీలను తిన్నాడుో తండ్రి. అదేంటి కొడుకు కోసం ఎన్నో త్యాగాలను చేసిన తండ్రుల గురించి విన్నాం. ఇలా బిర్యాని తినడమేంటని అనుకుంటున్నారా.. అసలు విషయం తెలిస్తే.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు మీరు.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. ఓ తండ్రి తన కొడుకు కోసం బిర్యాని ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఆరు బిర్యానీలు తిన్నవారికి.. లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ఓ రెస్టారెంట్ పోటీ నిర్వహించింది. అయితే ఆటిజం సమస్యతో బాధపడుతున్న తన కుమారుడి చికిత్స ఖర్చులకోసం… ఆ డబ్బులు పనికి వస్తాయని అనుకున్నాడా తండ్రి. ఒకవైపు కొడుకు ఆరోగ్యం బాగాలేదనే దుఃఖాన్ని దిగమింగుకొని.. ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఒకవైపు కన్నీటిని తుడుచుకుంటూనే మరోవైపు బిర్యానీ తిన్నాడు.
కడుపులో పట్టకపోయినా ఒకవైపు పొట్టలో నుంచి నొప్పి వస్తున్నా… కొడుకు కోసం ఇక బిర్యానీలు తిన్నాడు. మొత్తంగా 4 బిర్యానీలు తిన్నాడు. ఆరు చికెన్ బిర్యానీలు తిని ఉంటే.. లక్ష రూపాయల బహుమతి వచ్చేది. ఐతే అతను నాలుగు బిర్యానీలు మాత్రమే తిన్నాడు. దీంతో 50వేలు గెలుచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి ప్రేమ ఏంటి అంటే.. చూపించడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉంటుందా అంటూ నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ బిడ్డ కోసం తండ్రి పడుతున్న కష్టం.. ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. తలా ఇంత సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.