5 వేల కోట్ల ఏళ్లు క్రితం భూమ్మీద వాసుకి 45 అడుగుల సర్పం.. శివుడి మెడలో అలంకారం..
మహాదేవుడు శివుడి మెడలో ఉండే నాగసర్పం అవశేషాలు ఇండియాలోనే ఉన్నాయా. గుజరాత్‌లోని కచ్ దగ్గర దొరికిన ఆ భారీ అస్థికలు శివుడి మెడలో ఉండే పాము వాసుకువేనా.

మహాదేవుడు శివుడి మెడలో ఉండే నాగసర్పం అవశేషాలు ఇండియాలోనే ఉన్నాయా. గుజరాత్‌లోని కచ్ దగ్గర దొరికిన ఆ భారీ అస్థికలు శివుడి మెడలో ఉండే పాము వాసుకువేనా. ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్స్ ఇవే. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో పెనాండ్రో లిగ్నైట్ మైన్‌లో తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఓ భారీ ఎముక కార్మికులకు కనిపించింది. దాన్ని పక్కన పెట్టి కొంచెం దూరం తవ్వున తరువాత సేమ్ అలాంటి అస్థికే మరోటి దొరికింది. ఇలా ఒకటి రెండు కాదు.. ఏకంగా 45 ఫీట్ల దూరం వరకూ వరుసగా అస్థికలు కనిపించాయి. దీంతో ఇది చిన్న విషయం కాదని తెలుసకుని లోకల్ అథారిటీకి సమాచారం ఇచ్చారు. ఐఐటీ నుంచి వచ్చిన సునీల్ బాజ్‌పాయ్, దేబజిత్ దత్తా అనే ఇద్దరు సైంటిస్టులు ఈ పాము గురించి పరిశోధన చేసి రిపోర్ట్ ఇచ్చారు. మొదట అంతా దీన్ని లివియథాన్ అనుకున్నారు. ప్రపంచం మొత్తం భయపడుతున్న ఆ భారీ జీవి ఇండియాలో చనిపోయిందని భావించారు. కానీ హిస్టరీలో లివియథాన్‌ను వర్ణించిన తీరు ఈ పాము కనిపిస్తున్న తీరుకు చాలా ఢిపరెన్స్ ఉంది. దీంతో ఇది లివియథాన్ కాదని నిర్ధారించారు.
ఈ పాము దాదాపు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమీ మీద బతికింది. అంటే డైనోసార్స్ అంతమయ్యాక ఈ పాములే భూ ప్రపంచాన్ని ఏలాయి. అంతా అనుకుంటున్నట్టు ఇది శివుడి మెడలో ఉంటే పాము వాసుకి కాదు. శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నా ఏం గుర్తించినా దానికి సైంటిఫిక్‌గా ఓ పేరు పెట్టాలి. ఈ పాముకు కూడా అలానే పేరు పెట్టాలి అనుకున్నారు. సో.. శివుడి మెడలో ఉండే భారీ పాము వాసుకి పేరును ఈ పాముకు పెట్టి వాసుకి ఇండికస్‌గా నామకరణం చేశారు. కానీ శివుడి మెడలో ఉండే పాముకు ఇక్కడ దొరికి పాముకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పాముకు వాసుకి అని పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. ఈ పాము డిస్కవరీ 2005లో జరిగింది. అప్పటి వరకూ ఇంత భారీ సైజ్ పామును ఈ ప్రపంచం చూడలేదు. దాదాపు 50 ఫీట్ల మేర ఎముకలే దొరికాయంటే దీని సైజ్ అంతకన్నా పెద్దదే అయ్యుంటుంది. మన పురాణాల్లో భారీ పాము అంటే అది వాసుకి అనే చెప్పుకుంటారు. ఆ కారణంగానే ఈ పాముకు రిఫరెన్స్‌గా వాసుకి అని పేరు పెట్టారు గానీ ఇది శివుడి మెడలో ఉండే వాసుకి కాదు. ఇక లివియథాన్ గురించి కూడా చరిత్రలో చెప్పినంత భారీగా భయంకరంగా ఈ పాము లేదు. లివియథాన్ సముద్రం నుంచి బయటికి వస్తే ఈ ప్రపంచం అంతం అవుతుంది. అంటే దాని సైజ్ ఆ రేజ్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ దొరికిన వాసుకి ఇండికస్ సైజ్ మాత్రం అంత స్థాయిలో లేదు.
సో ఇది లివియథాన్ కూడా కాదు. సో.. ఈ వాసుకి ఇండికస్ అనేది డైనోసార్స్ అంతమయ్యాక 4.7 కోట్ల సంవత్సరాల ముందు వచ్చిన ఓ పాము జాతి మాత్రమే. ఇక ఈ పాము ఖచ్చితంగా ఇండియాలోనే చనిపోయింది అనేందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఎదుకంటే 4.7 మిలియన్ సంత్సరాల ముందు గుజరాత్ లేదు. అసలు ఇండియా షేప్ కూడా ఇప్పుటిలా ఉండేది కాదు. ఈ పాము అవశేషాలు దొరికిన ఎర్త్‌ప్లేట్ ఆఫ్రికా నుంచి ప్రయాణిస్తూ వచ్చి ఇండియాలో కలిసింది. ఆఫ్రికాలో 4 కోట్ల ఏళ్ల ముందు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇలాంటి పాములు అక్కడ బతకడం సహజమే. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా ఇక్కడ భారీ పాములు ఉన్నాయి. సో.. ఈ పాము ఇండియాలో చనిపోలేదు. చనిపోయిన తరువాత ఈ భూభాగం ఇండియాలో కలిసింది. కాబట్టి ఎలా చూసినా గుజరాత్‌లో దొరికిన ఈ వాసుకి ఇండికస్‌కు శివుడి మెడలో ఉన్న వాసుకికి నీళ్లలో సముద్రంలో ఉందని చెప్తున్న లివియథాన్‌కు ఎలాంటి సంబంధం లేదు.