ఆ ఊర్లో దెయ్యం తిరుగుతోందా! గ్రామస్థులకు కనిపించిన ఆకారం ఏంటి ?

తూర్పుగోదావరి జిల్లాలో కాండ్రకోట గ్రామంలో దెయ్యం తిరుగుతోంది. రాత్రి సమయంలో అక్కడక్కడా కనిపిస్తున్న ఓ వింత ఆకారం అక్కడి గ్రామస్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ ఊర్లో ఇప్పుడు ఎవరిని పలకరించినా అంతా ఆ శక్తి గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా ఆ ఆకారాన్ని చూశారా.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది అంటూ మాట్లాడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 11:36 AMLast Updated on: Feb 19, 2024 | 11:36 AM

A Ghost Is Roaming In That Town What Shape Did The Villagers See

తూర్పుగోదావరి జిల్లాలో కాండ్రకోట గ్రామంలో దెయ్యం తిరుగుతోంది. రాత్రి సమయంలో అక్కడక్కడా కనిపిస్తున్న ఓ వింత ఆకారం అక్కడి గ్రామస్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆ ఊర్లో ఇప్పుడు ఎవరిని పలకరించినా అంతా ఆ శక్తి గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా ఆ ఆకారాన్ని చూశారా.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న హైటెక్‌ కాలంలో దెయ్యాలు భూతాలు ఏంటి అని మాట్లాడేవాళ్లు కూడా.. ఆ గ్రామంలో ఇప్పుడు గడప దాటాలంటే భయంతో వణికిపోతున్నారు. అసలు నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నాయా. అక్కడి ప్రజలకు కనిపిస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటి?

కాండ్రకోట గ్రామంలో ఓ వ్యక్తి నడుస్తూ వస్తున్నాడు. ఇంతలో ఓ వింత ఆకారం ఆ మనిషిని ఫాలో చేసింది. అనుమానంతో ఆ వ్యక్తి వెనక్కి తిరగ్గానే.. ఆ ఆకారం పక్కనే ఉన్న చెట్టు ఎక్కి పొలాల్లో దూకి పారిపోయింది. ఈ సీన్‌ చూసిన ఆ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో గ్రామంలోకి పారిపోయాడు. ఇది ఆ ఒక్క వ్యక్తికి ఎదురైన అనుభవం కాదు. చాలా రోజుల నుంచి అదే ఆకారం ఆ గ్రామంలో చాలా మందికి కనిపించిందని చెప్తున్నారు కాండ్రకోట గ్రామస్థలు. అసలేం జరుగుతోందని పండితులను అడిగితే.. ఊర్లో ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని.. గ్రామంలో ఉన్న యువతులు, చిన్నపిల్లను మింగేయాలని చూస్తోంది వాళ్లు చెప్పారంటూ గ్రామస్థులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఊర్లో చాటింపు కూడా వేయించారు.

దీంతో గ్రామంలో యువతులు ఉండాలంటేనే భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామం విడిచి బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో కాస్త చీకటి పడిందంటే చాలు ఆ గ్రామం నిర్మానుష్యంగా మారిపోతోంది. అయితే ఇదే వాదనను ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మాత్రం తప్పుబడుతున్నారు. ఇలా ఊర్లో ఎవరూ లేకుండా చేసి గుప్తనిధులు వేటకు పాల్పడేందుకు కొందరు వ్యక్తులు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని చెప్తున్నారు. ఇంటర్నెట్‌లో ఉన్న దెయ్యాల వీడియోలను కాండ్రకోట వీడియోలుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా అలాంటి ఆకారం ఇన్నిరోజులుగా గ్రామంలో తిరిగితే ఎవరిపైనా ఎందుకు దాడి చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ వాదనలేవీ ఆ గ్రామస్థుల మెదడులోకి ఎక్కడంలేదు.

ఇప్పుడు వాళ్లు నమ్మేదల్లా ఒక్కటే. గ్రామంలో ఓ శక్తి తిరుగుతోంది. అది దెయ్యమా తెలియదు, ఎదైనా మృగమా తెలియదు. కానీ మేకలాంటి ఓ ఆకారం.. ఒంటరిగా దొరికితే యువతు ప్రాణం తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే భయంతో బతుకుతున్నారు కాండ్రకోట గ్రామస్థులు. నిజం కంటే భయం చాలా గొప్పది కదా.. ఆ భయం పోయేవరకూ ఈ గ్రామంలో పరిస్థితి మారేలా కనిపించడంలేదు.