Ayodhya Ram Mandir, Prabhas : రాజు గారంటే రాజుగారే మరి..! అయోధ్య భోజనం ఖర్చు ప్రభాస్ దే
రాజు గారంటే (Raju Garu) మజాకా.. అతిధులకు భోజనం వడ్డించడంలో రాజు గారి తర్వాతే. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. అందులో నేను కూడా తీసిపోను అంటున్నాడు నటుడు ప్రభాస్(Actor Prabhas). ఈనెల 22న అయోధ్యలో జరిగే రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భోజనాల ఖర్చు మొత్తం ప్రభాస్ భరిస్తున్నాడు.
రాజు గారంటే (Raju Garu) మజాకా.. అతిధులకు భోజనం వడ్డించడంలో రాజు గారి తర్వాతే. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. అందులో నేను కూడా తీసిపోను అంటున్నాడు నటుడు ప్రభాస్(Actor Prabhas). ఈనెల 22న అయోధ్యలో జరిగే రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భోజనాల ఖర్చు మొత్తం ప్రభాస్ భరిస్తున్నాడు. ఆ రోజు వేడుకలకు హాజరయ్యే 7 వేల మందికి పైగా అతిథులు, సామాన్య భక్తుల భోజనాలకు దాదాపు 50 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు ప్రభాస్. అతిథ్యం, అన్నదానం గురించి ఎక్కడ ప్రస్తావనకు వచ్చినా.. ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. ఆ సంగతి నాకు వదిలేయండి అంటూ ఉంటాడు. తోటి నటీనటులు నుంచి సెట్ బాయ్స్ దాకా చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే. తన ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపడు. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్.. ఆతిథ్యం, భోజనాల విషయంలోనూ పెదనాన్నను ఫాలో అవుతున్నాడు.
కోట్ల మంది ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir), రాముడి ప్రాణప్రతిష్ట (Rama’s Pranapratistha) కార్యక్రమాలు జనవరి 22న ఘనంగా జరగబోతున్నాయి. ఆ రోజు రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశం నలు మూలల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా కోట్ల మంది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నారు. వాళ్ళందరకీ ఉచితంగా భోజనాల ఖర్చును ప్రభాస్ భరిస్తున్నాడు. ఆ ఒక్క రోజు అన్నదానం కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ భోజనాల కోసం అయోధ్యలోని దాదాపు 300 ప్రదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
షూటింగ్స్ జరిగే టైమ్ లో కూడా ప్రభాస్ ఒక్కడే భోజనం చేసే అలవాటు లేదు. ఆయన భోజనం చేస్తున్నాడు అంటే.. ఆ రోజు 2 నుంచి 3 లక్షల రూపాయల దాకా ఖర్చ గ్యారంటీ.. షూటింగ్ లోకేషన్ లో ఉన్న ఫ్రెండ్స్, సిబ్బందికి అందరికీ రెబల్ స్టార్ ఆర్డర్ ఇస్తాడు. ప్రభాస్ భోజనంలో ఎన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయో.. మిగతా సిబ్బంది ప్లేట్స్ లోనూ అంతే ఉండాల్సిందే. రెబల్ స్టార్ కృష్ణం రాజు చనిపోయిన తర్వాత.. పెద కర్మ రోజు కూడా 70 వేల మందికి భోజనాలు పెట్టించాడు ప్రభాస్. ఇప్పుడు అయోధ్యలోనూ 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి.. అన్నదానం చేస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ప్రభాస్.