Kohinoor Diamond: ఎవరి చేతికి వెళ్తే వారికి మరణమే.. కోహీనూర్‌ వజ్రం చరిత్ర మొత్తం రక్తమే..

రాజసానికి, దర్పాణికి ప్రతీకగా నిలిచిన కోహినూర్‌ వజ్రం.. చరిత్ర సమస్తం రణరంగ రక్తసిక్తమే ! ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు కనిపించవు. ఐతే చెడు జరిగిన సందర్భాలే చరిత్రలో ఎక్కువగా ఉన్నాయ్. కోహినూర్‌ వజ్రాన్ని ఇంగ్లండ్‌కు నౌకలో తీసుకెళ్తుండగా.. ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 30, 2023 | 06:55 PMLast Updated on: Apr 30, 2023 | 6:55 PM

A Story About Kohinoor Diamond

కోహినూర్‌ వజ్రం ఉన్న బ్రిటీష్‌ అధికారి, మరికొందరు సిబ్బంది క్షేమంగా ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. కోహినూర్‌ ఇంగ్లండ్‌ గడ్డపైకి వచ్చిన రోజునే.. రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. ఆమె తలపై బలమైన గాయం అయింది. అప్పటి ప్రధాని రాబర్ట్‌ పీల్‌ ప్రమాదవశాత్తు గుర్రం మీది నుంచి కింద పడి మరణించారు. కోహినూర్ వజ్రం విషయంలో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయ్. దీన్ని స్త్రీలు ధరిస్తే మహా శక్తిమంతులవుతారని.. పురుషులు ధరిస్తే మాత్రం అరిష్టం తప్పదని అంటారు.

కోహినూర్ చరిత్రలో ప్రతీ పేజీకి రక్తం మరకలే కనిపిస్తాయ్. తెలంగాణకు చెందిన గోల్కొండ రాజ్యంలో దొరికిన కోహినూర్‌ వజ్రం.. ఆ తర్వాత చాలామంది చేతులు మారింది. ఖిల్జీలు, తుగ్లక్‌లు, లోథీలు, మొఘల్‌, మరాఠా, పర్షియన్లు, దుర్రానీలు, ఆప్ఖన్‌ కనాటే, సిక్కులు.. ఇలా ఇందరి చేతులు మారి చివరికి బ్రిటీష్‌వాళ్లకు దక్కింది. షాజహాన్‌ దగ్గరకు 1656లో ఈ డైమండ్ చేరింది. ఆ తర్వాత ఆయన్ని కుమారులే బంధించి జైల్లో పెట్టారు.

ఆ తర్వాత ఆ ఇద్దరు కుమారుడు సింహాసనం ఎక్కగా.. పర్షియన్‌ రాజులు దండయాత్ర చేసి ఓడించారు. ఆ సమయంలో రక్తం ఏరులై పారింది. ఆతర్వాత ఆ వజ్రం పర్షియన్ రాజు నాదర్‌ షా దగ్గరకు చేరింది. ఆయన బతికుండగానే ఆయన కుమారుడి రెండు కళ్లను పీకి.. వాటిని పళ్లెంలో పెట్టి శత్రువులు నాదర్‌ షాకు పంపించారు. ఆ తర్వాత నాదర్‌ షా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కోహినూర్‌ వజ్రం చేతులుమారి అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌కు చేరుకుంది. మొఘల్ చక్రవర్తి అహ్మద్‌ షా దగ్గరకు 1750వ దశకంలో కోహినూర్‌ వజ్రం చేరింది. కొంతకాలానికే క్యాన్సర్‌ వచ్చింది. ఆ సమయంలో ఈ వజ్రాన్ని ఓ గోడ సందులో దాచారని ప్రచారం.

అది ఓ అఫ్ఘాన్‌ అంగరక్షకుడి ద్వారా కాబూల్‌కు చేరింది. అక్కడ ఓ హారం ద్వారా కోహినూర్‌ వజ్రం.. పంజాబ్‌ రాజు మహారాజ రంజిత్‌ సింగ్‌ దగ్గరకు 1839లో చేరింది. కొన్నిరోజులకే ఆయన హత్యకు గురయ్యారు. ఆ తర్వాత పదేళ్లకు బ్రిటీషర్లు పంజాబ్‌పై దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఇంగ్లండ్‌ తీసుకెళ్లారు. 1937లో పట్టాభిషేకం మొదలుకొని ఇప్పటివరకు కోహినూర్‌ పొదిగిన కిరీటాన్ని క్వీన్ ఎలిజబెత్‌ ధరించనే లేదు. అందుకే ఆమె చాలాకాలం బతికారనే వాదన ఉంది. ఇప్పుడు కింగ్‌ చార్లెస్‌కు పట్టాభిషేకం జరిగింది. ఆయన రెండో భార్య కెమిల్లాకు వజ్రపు కిరీటాన్ని దక్కనుంది. మరి ఏం జరగబోతోందన్నది ఆసక్తకిరంగా మారింది.