Terrorist Attack : పాకిస్తాన్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి..

పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన మియాన్వాలీ ట్రైనింగ్ ఎయిర్ బేస్ లో శనివారం తెల్లవారు జామున ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తూ వారిపై కాల్పులు జరుపుతూ ఈ ఉగ్రదాడిని తిప్పికొట్టింది. ఇక ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మట్టపెట్టినట్లు పాక్ వైమానిక దళం పీఏఎఫ్ తెలిపింది. ఈ ఉగ్రదాడిలో పాక్ కు చెందిన వైమానిక దళానికి చెందిన మూడు విమానాలు కూడా ధ్వంసం అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2023 | 03:56 PMLast Updated on: Nov 04, 2023 | 3:58 PM

A Terrorist Attack Took Place At The Mianwali Training Air Base Of The Pakistan Air Force In The Early Hours Of Saturday Morning

( Pakistan) ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ను అడిగితే చెప్పింది పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అని. ప్రపంచానికి భారత దేశం మందులు ( ఔషాదాలు ) పంపిస్తే భారత్ దాయాది దేశం ( పాకిస్తాన్లో ) మాత్రం ఉగ్రవాదులను పంపిస్తుంది అని ఓ సమేత ఉంది. అంటే పాక్ లో ఉగ్రవాదులను ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది అని కూడా అంటుంటారు. కొన్నిసార్లు ఉగ్రవాదుల నుంచి ఆ పాక్ ప్రభుత్వాలే చిక్కుల్లో చేరుకుంటాయి. తెలుగులో ఓ సామేత ఉంది.. “ఎవడు తీసిన గోయిలో వాడే పడుతాడు” అని ఇప్పుడు సేమ్ ఇదే మాదీరి పాకిస్తాన్ కు ఎదురైంది. ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి పాకిస్తాన్ కు మధ్య భీకర దాడులు రోజు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు.

పాకిస్తాన్ వైమానిక (Terrorist Attack) దళానికి చెందిన మియాన్వాలీ (Mianwali )ట్రైనింగ్ ఎయిర్ బేస్ ( Training Air Base) లో శనివారం తెల్లవారు జామున ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తూ వారిపై కాల్పులు జరుపుతూ ఈ ఉగ్రదాడిని తిప్పికొట్టింది. ఇక ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మట్టపెట్టినట్లు పాక్ వైమానిక దళం పీఏఎఫ్ తెలిపింది. ఈ ఉగ్రదాడిలో పాక్ కు చెందిన వైమానిక దళానికి చెందిన మూడు విమానాలు కూడా ధ్వంసం అయ్యాయి.

Telangana elections : నామినేషన్ల కు మంచి ముహూర్తం ఎప్పుడు ? ఈ నెల 9న ఎక్కువమంది నామినేషన్లు !

పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని మియాన్వాలి లో ఉగ్రదాడిలో పాక్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలో నిలిపిన మూడు విమానాలు ధ్వంసమయ్యాయని, ఒక ఫ్యూయల్ బ్రౌజర్ కూడా ధ్వంసం అయిందని.. సైనిక సిబ్బంది, పైలట్లు మృతి చెందినట్లు పాక్ సైన్యం తెలిపింది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా క్లియర్ చేసేందుకు సమగ్ర జాయింట్ క్లియరెన్స్, కూంబింగ్ ఆపరేషన్ తుది దశలో ఉందని పాక్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) వెల్లడింది.

ఐదుగురు పాక్ ఆర్మీ సాయుధుల బృందం తెల్లవారుజామున ట్రైనింగ్ ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడింది. ఈ ఘటనపై తక్షణమే పాక్ ఆర్మీ స్పందించి ఉగ్రవాదులు కాల్పులపై జరిపింది. ముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టింది. మరో ముగ్గురు ఉగ్రవాదులను కార్నర్ చేసింది. ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించడానికి ముందే దాడిని భగ్నం చేశామని పీఏఎఫ్ తెలిపింది.

BJP-JANASENA: బీజేపీలో జనసేన చిచ్చుపెట్టిందా..? ఆ 31 స్థానాలు పెండింగ్‌లో ఎందుకు..?

ఇది వరకు గదర్ జిల్లా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో కనీసం 17 మంది పాకిస్థాన్ సైనికులను ఉగ్రవాదులు టార్గెట్ చేసి దాడి చేసి చంపేసారు. తరువాత శనివారం దాడి జరిగిందని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఇక ఈ దాడికి తామే చేశామని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ) ప్రకటించింది. పీఏఎఫ్ వైమానిక స్థావరం మియాన్వాలీలోని శిక్షణ, యుద్ధ విమానాలను ఫిదాయీన్ ధ్వంసం చేశాడని టీజేపీ అధికార ప్రతినిధి ముల్లా ఖాసిం తెలిపింది. ఈ వరుస దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారులు స్పందిస్తూ.. పాక్ లో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

SURESH