Dogs Aadhaar cards ఢిల్లీలో కుక్కలకు ఆధార్ కార్డులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కుక్కలకూ ఆధార్ కార్డ్‌లు (Aadhaar Card) ఇస్తున్నారు. ఇప్పటికే 100 కుక్కలకు ఈ కార్డ్‌లు జారీ చేశారు అధికారులు. కుక్కలేంటి ఆధార్ కార్డ్‌లేంటి అనిపిస్తుంది కదా.

Aadhaar cards for dogs in Delhi.. You will be shocked if you know why
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కుక్కలకూ ఆధార్ కార్డ్‌లు (Aadhaar Card) ఇస్తున్నారు. ఇప్పటికే 100 కుక్కలకు ఈ కార్డ్‌లు జారీ చేశారు అధికారులు. కుక్కలేంటి ఆధార్ కార్డ్‌లేంటి అనిపిస్తుంది కదా. దీని వెనక ఓ పెద్ద కథ ఉంది. ఈ మధ్య వీధి కుక్కలు రోడ్లపై వచ్చి పోయే వాళ్లపై దాడులు చేస్తున్నాయి. ఈ బాధ భరించలేక చాలా మంది వాటిపై దాడి చేస్తున్నారు. కొందరైతే వాటిని చంపేస్తున్నారు కూడా. ఈ ముప్పు నుంచి తప్పించేందుకు పావ్‌ఫ్రెండ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఐడియా ఇచ్చింది. వీధి కుక్కలకు క్యూ ఆర్ కోడ్‌తో ఉండే ఆధార్ కార్డ్‌లు మెడలో వేసింది.
ఆ కార్డ్‌ల ద్వారా అవి ఎక్కడికి వెళ్లినా ట్రేస్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ అవి కనిపించకుండా పోయినా ఎక్కడున్నాయో కనిపెట్టొచ్చు. ఇప్పటి వరకూ ఇలా 100 వీధి కుక్కలకు ఆధార్ కార్డ్‌లు జారీ చేసింది ఈ ఎన్జీవో. ఢిల్లీ టర్మినల్ ఎయిర్‌పోర్ట్, ఇండియా గేట్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఈ కార్డ్‌లు మెడలో వేశారు. ఈ కుక్కల మెడలో ఉండే ఆధార్ కార్డ్‌లపై క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఇందులో మైక్రోచిప్స్ ఉంటాయి. ఈ ట్యాగ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌పై ఎవరైనా స్కాన్ చేస్తే ఆ కుక్క ఏ వీధికి చెందిందో తెలుస్తుంది. ఎప్పుడైనా అవి ప్రమాదంలో ఉన్నప్పుడో, గాయపడ్డప్పుడో, తప్పి పోయినప్పుడో ఈ కోడ్‌ని స్కాన్ చేసి ఆ ఏరియా అధికారులకు సమాచారం అందించొచ్చు. ఇక పెంపుడు కుక్కలు తప్పిపోయినా వాటినీ ట్రాక్ చేసేందుకు ఈ ఆధార్ కార్డ్‌లు పనికొస్తాయని చెబుతున్నారు ఎన్జీవో సభ్యులు.