Amazon: అమెజాన్ అడవిలో 40 రోజులు బతికిన చిన్నారులు.. థ్రిల్లర్ సినిమాను మించిన రియర్ స్టోరీ..
అంత భయంకరమైన అడవిలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 రోజులు ప్రాణాలు కాపాడుకున్నారు నలుగురు చిన్నారులు. ఆ నలుగురిలో 11 నెలల పసికందు కూడా ఉంది. తీస్తే వీళ్ల కథ ఓ సస్పెన్స్ త్రిల్లర్ సినిమా అవుతోంది.
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన అడవి ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది అమెజాన్ ఫారెస్ట్. క్రూర మృగాలు, విష సర్పాలు, ప్రాణాలు తీసే పురుగులు, అనకొండా పాములు. వీటన్నిటికీ అమెజాన్ ఫారెస్ట్ నిలయం. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అనే మాటకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. సింపుల్‌గా చెప్పాలంటే అమెజాన్ ఫారెస్ట్‌లో తప్పిపోతే ఆశలు వదులుకోవాల్సింది. అంత భయంకరమైన అడవిలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 రోజులు ప్రాణాలు కాపాడుకున్నారు నలుగురు చిన్నారులు. ఆ నలుగురిలో 11 నెలల పసికందు కూడా ఉంది. తీస్తే వీళ్ల కథ ఓ సస్పెన్స్ త్రిల్లర్ సినిమా అవుతోంది.
కొలంబియాకు చెందిన వీళ్ల ఫ్యామిలీ.. ప్రైవేట్ జెట్‌లో టూర్‌కి వెళ్లారు. అమెజాన్ ఫారెస్ట్ దాటుతుండగా ఆ జెట్ ప్రమాదానికి గురైంది. కాసేపట్లోనే రాడార్ సిగ్నల్ కూడా కోల్పోయింది. దీంతో వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది. 150 మంది సైనికులు అడవిలో వాళ్ల కోసం వెతకడం ప్రారంభించారు. ప్రమాదానికి గురైన జెట్‌ను గుర్తించారు. పైలెట్, పిల్లల తల్లి మృతదేహాలను గుర్తించారు. కానీ పిల్లలు మాత్రం కనిపించలేదు. వెంటనే ఆపరేషన్ హోప్ పేరుతో టీం ఫాం చేసి గాలింపు మొదలుపెట్టారు.
18 రోజుల తరువాత ఓ ప్రాంతంలో చిన్న గుడారాన్ని గుర్తించారు. అక్కడ పాల సీస, చిన్న పిల్లలు జుట్టుకు పెట్టుకునే రిబ్బన్, సగం తిని వదిలేసిన ఫ్రూట్స్ గుర్తించారు. దీంతో పిల్లలు ప్రాణాలతోనే ఉన్నారని గ్రహించి గాంలిపు ముమ్మరం చేశారు. అడవిలో అక్కడక్కడా ఫుడ్ బాక్సులు వేశారు. చివరికి 40 రోజుల తరువాత నిన్న పిల్లలను ఓ ప్రాంతంలో ప్రాణాలతో గుర్తించారు. శిక్షణ తీసుకున్న సైనికులే అతి కష్టంగా బతికే ఈ అడవిలో 15 ఏళ్లు కూడా నిండని చిన్నారులు 11 నెలల పసిపాపతో 40 రోజులు బతకడం నిజంగా ఓ అద్భుతం. పిల్లలతో ఉన్న ఫొటోను కొలంబియా ఆర్మీ ట్విటర్‌లో షేర్ చేసింది. 40 రోజుల తరువాత పిల్లలు ప్రాణాలతో లభించడంపై కొలంబియా ప్రెసిడెంట్ హర్ష వ్యక్తం చేశారు.