kids using smartphone: చిన్న పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. మానసిక జబ్బులు గ్యారెంటీ..!
చిన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ వాడితే.. యంగ్ ఏజ్లీఓకి వచ్చేసరికి మానసిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతే వీలైనంత లేటుగా పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
kids using smartphone: చిన్న వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లలో మతిమరుపుతోపాటు అనేక రకాల మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. చిన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ వాడితే.. యంగ్ ఏజ్లీఓకి వచ్చేసరికి మానసిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతే వీలైనంత లేటుగా పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చెందిన సపియన్ ల్యాబ్స్ అనఏ సంస్థ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ పేరుతో ఒక అధ్యయనం జరిపింది. 18 నుంచి 24 ఏళ్ల వయసున్న 28 వేల మందిపై, 41 దేశాల్లో అధ్యయనం జరిపి తాజా వివరాలు వెల్లడించింది. అమెరికా, యూరప్, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనం ప్రకారం.. చిన్న వయసులో స్మార్ట్‌ఫోన్ వాడటం మొదలుపెట్టిన వారిలో యంగ్ ఏజ్‌లోకి వచ్చేసరికి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో అబ్బాయిలకంటే.. అమ్మాయిలే ఎక్కువ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.
ఆరేళ్ల నుంచి స్మార్ట్‌ఫోన్ వాడటం మొదలుపెట్టిన మగవాళ్లలో 42 శాతం, 18 ఏళ్ల వయసులో మొదలుపెట్టిన వాళ్లలో 36 శాతం మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లను స్మార్ట్‌ఫోన్ వాడుతున్న అమ్మాయిలో 74 వాతంచ, యంగ్ ఏజ్‌లోకి వచ్చిన తర్వాత 4 శాతం వివిధ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. చిన్న వయసులో స్మార్ట్‌ఫోన్ వాడటం వల్లే ఎక్కువ మానసిక సమస్యలొస్తున్నాయి. అదే లేటుగా మొదలుపెట్టిన వారిలో సమస్యలు తక్కువగా ఉంటున్నాయి. లేటుగా స్మార్ట్‌ఫోన్ వాడటం మొదలుపెట్టడం వల్ల అమ్మాయిలు, అబ్బాయిల్లో సోషల్ అవేర్‌నెస్, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం వంటివి పెరుగుతున్నాయి. అలాగే నెగెటివ్ ఆలోచనలు, ఆత్మహత్య ఆలోచనలు వంటివి తగ్గుతున్నాయి.
స్మార్ట్‌ఫోన్ వాడకం మానసిక రుగ్మతలతోపాటు, శారీరక రుగ్మతలకు కూడా కారణమవుతోంది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న పదేళ్లలోపు వారిలో 12.5 శాతం మంది నోటిఫికేషన్లు చూసుకోవడానికి రాత్రిపూట సమయాన్ని వినియోగిస్తున్నారు. మొబైల్ వాడకం కోసం వారానికి సగటున ఒక రాత్రి నిద్రను పోగొట్టుకుంటున్నారు. యంగ్ ఏజ్‌లో సోషల్ మీడియాలో రోజుకు మూడు గంటలు గడుపుతున్నారు. ఇలాంటివాళ్లు డిప్రషన్, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పదమూడు నుంచి పదిహేడేళ్ల లోపు వాళ్లు దాదాపు 95 శాతం మంది ఫోన్స్ వాడుతున్నారు. వీళ్లు కూడా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే పిల్లల్ని స్మార్ట్‌ఫోన్ వాడాకానికి వీలైనంత దూరంగా ఉంచాలి అని నిపుణులు సూచిస్తున్నారు.