ఇదిగో పచ్చళ్లక్కాయ్‌… రేటు అడిగితే.. ఇంతలా హర్ట్‌ చేయాలా !

ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన యాపారం.. మూడు కాయలు ఆరు పచ్చళ్లలా సాగుతున్న బిజినెస్‌.. ఈ ఒక్క ఆడియోతో మటాష్‌ ! కారాలు కలిపిన చేయికి కోపం వచ్చిందో.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 10:07 AMLast Updated on: Apr 07, 2025 | 10:07 AM

Alekhya Chitti Pickles Viral In Social Media

ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన యాపారం.. మూడు కాయలు ఆరు పచ్చళ్లలా సాగుతున్న బిజినెస్‌.. ఈ ఒక్క ఆడియోతో మటాష్‌ ! కారాలు కలిపిన చేయికి కోపం వచ్చిందో.. ఘాటెక్కవై పోయి ఘాటుగా మాట్లాడిందో కానీ.. చక్కగా సాగుతున్న వ్యాపారాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు. రేటు ఎక్కువగా ఉందంటే.. ఇంతలా రియాక్ట్ కావాలా.. అమ్మను, అక్కను, పెళ్లాన్ని తీసుకురావాలా.. నచ్చకపోతే రిజెక్ట్ అనే ఆప్షన్ ఉంటది.. బ్లాక్ అనే బటన్ ఉంటది కదా అక్కాయ్‌. ఇంత ఓవరాక్షన్ అవసరమా ! పచ్చళ్లే, పరిస్థితులో.. కలలు కనొచ్చు కథలు వద్దు అంటూ… అలేఖ్య చిట్టిని ఆడుకుంటున్నారు జనాలు. ఆర్డర్ ఇద్దామనుకున్న వ్యక్తికి రేటు ఎక్కువ అనిపించింది.. కుదరదు అంటే ఓ మాట అయిపోయేది కదా.. వాడి కెరీర్‌ గురించి.. పెళ్లానికి, గాళ్‌ఫ్రెండ్‌కు కొనిచ్చే బంగారం గురించి నీకెందుకు చెప్పు ! ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలతో అతి చేస్తున్నారు.. లేదు కాసేపు పర్లేదు ప్రమోషనే అనుకుందాం..

అక్కడితో ఆగాల్సింది కదా ! మీ పచ్చళ్ల లేకపోతే ముద్ద దిగనట్లు.. పచ్చళ్ల కోసం ఎవరైనా దిగి రావాల్సిందే అన్నట్లు.. ఆ మాటలు ఎందుకు చెప్పు ! ఇక అసలు విషయంలోకి వస్తే.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఈ పచ్చళ్ల బిజినెస్‌ స్టార్ట్ చేశారు. ఏదో వీడియోలు చూసి.. ఇన్‌స్టాగ్రామ్‌ కరువు బ్యాచ్‌ను అట్రాక్ట్ చేశారు.. బిజినెస్‌ పెంచుకున్నారు. ఏం చేశారు.. ఎలా చేశారు అన్న సంగతి తర్వాత.. బాగానే రన్ అవుతుంది కదా.. ఇంకెందుకు ఇలాంటి అతి ఓవరాక్షన్ మాటలంటూ సోషల్‌ మీడియాలో జనాలు ఫైర్ అవుతున్నారు. అబ్బాయ్‌ని తిట్టింది అనుకుంటే.. అమ్మాయిలతోనూ ఇంతే ర్యూడ్‌గా బిహేవ్‌ చేశారు. ఆ పచ్చళ్లు కొనగలిగితేనే బతుకు అర్థం అన్నట్లు.. భవిష్యత్ ఉన్నట్లు.. ఓవరాక్షన్ మాటలతో.. బజారునపడ్డారు. కట్ చేస్తే వెబ్‌సైట్ బ్లాక్‌.. వాట్సాప్‌ బ్లాక్‌ ! ఇదే అలేఖ్య చిట్టి గురించి ఎవడో బూతు కామెంట్‌ చేసినప్పుడు.. వాళ్లిచ్చిన ఆన్సర్ చూసి.. సోషల్‌ మీడియా అంతా ప్రశంసలు గుప్పించింది. ఇలా ఉండాలి.. కాదు కాదు ఇలానే ధైర్యంగా ఉండాలంటూ.

అలేఖ్య సిస్టర్స్‌ను వెనకేసుకొచ్చింది. అలాంటిది.. ఇప్పుడు రేటు ఎక్కువయిందంటే.. ఇంత ఎక్కువ చేయడం అవసరమా ! వ్యాపారం ఏదైనా సరే.. కస్టమర్లు దేవుళ్లు ! ఈ మాట ఆ పచ్చడి రత్నమే చెప్పింది కూడా ! అలాంటి కస్టమర్‌ బతుకును తక్కువ చేస్తూ.. ఇదేం బతుకురా అన్నట్లు ప్రశ్నిస్తూ.. అన్నేసి మాటలు.. ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ! ఇంతా చేసి.. వాళ్లిచ్చిన వివరణ కరెక్ట్‌గా ఉందా అంటే.. మరింత చిరాకు తెప్పిస్తోంది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఏమైనా బంగారంలాంటి పచ్చళ్లు.. బూడిదలో పోసినట్లు అయిపోయింది. ఇప్పుడు యాపారానికి బ్రేక్ ఇచ్చినా.. రేపు మరో పేరుతో రావొచ్చు.. అప్పుడైనా జాగ్రత్తగా ఉండండి అక్కాయ్‌లు ! కొన్నా.. కొనకపోయినా.. కస్టమర్ కస్టమరే ! మీరు కాస్త మర్యాద నేర్చుకోండి.. వాడికి కాస్త మర్యాద ఇవ్వండి.. ఏం చెప్తాం ఇంతకన్నా అంటూ అలేఖ్య చిట్టికి సజెషన్స్ ఇస్తున్నారు మరికొందరు.