America New Rules: ఇకపై అమెరికాలో చదువాలనుకునే వారికి శుభవార్త..!
అమెరికాలో విద్యను అభ్యసించాలనే కోరిక చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. కానీ అక్కడి రూల్స్ చూస్తే ఒక అడుగు వెనక్కు వేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆపరిస్థితులను చెరిపేస్తూ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది అగ్రరాజ్యం అమెరికా. స్టూడెంట్ వీసా కోసం సంవత్సరం ముందుగా దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. విసా ఇంటర్వూ స్లాట్ డేట్స్ ను నాలుగు నెలల ముందు బుక్ చేసుకునేలా నిబంధనలను సవరించింది.
విద్యయా శోభతే దేశమ్ అంటారు. విద్యను పోందడం వల్ల దేశం ప్రకాశిస్తుంది అని అర్థం. అలాంటి విద్య ఒకప్పుడు పక్క ఊళ్లో ఉండేది. దీనికోసం మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లేవారు. కాలక్రమేణ అది మన నివాస ప్రాంతాల్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయింది. దీనికి కారణం రోజుకో రకంగా.. పూటకో విధంగా పుట్టుకొస్తున్న సాంకేతిక పరిస్థితులు అని చెప్పాలి. వీటితో సగటు మానవుడు పోటీ పడటానికి నూతన విద్యను అభ్యసించవలసి వస్తుంది. అందుకే ఖండాలు దాటి, స్వదేశాలు వీడి, ఈతరాకున్నా గాల్లో సప్త సముద్రాలు ఎగురుకుంటూ వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు.
సాధారణంగా స్వదేశంలో ప్రొఫెషనల్ విద్యను అభ్యసించిన వారు మాస్టర్స్ కోసం లేదా స్పెషలైజేషన్ కోసం అమెరికా వంటి అగ్రదేశాలకు వెళ్తారు. ఇలా వెళ్లాలంటే ఒకప్పుడు సవాలక్ష కఠినమైన రూల్స్ ఉండేవి. దీనివల్ల కోర్సులు ప్రారంభమైనప్పటికీ వీసారాక తీవ్ర నిరుత్సాహానికి గురైయ్యేవారు విద్యార్థులు. ఇప్పుడు అలాంటి పరిస్థితులకు చెక్ పెడుతూ కొన్ని నిబంధనలను సవరించింది యూఎస్ ఎంబసీ. ఈ కొత్త విధానం ప్రకారం అన్ని డాక్యూమెంట్లు సరిగా ఉన్నట్లయితే విద్యా సంవత్సరం ప్రారంభానికి 365 రోజుల ముందుగానే వీసా జారీ చేయనున్నట్టు వెల్లడించింది. ఇలా చేయడం వల్ల వీసా టెక్షన్ తొలిగిపోయి తమ కోర్సుల పై దృష్టి సారించేందుకు చాలా మంచి అవకాశమని అమెరికన్ కాన్సులేట్ చెబుతోంది. ఈ సరికొత్త విధానాలతో భారత్ నుంచి గతంలో కంటేకూడా ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే వీసా అపాయింట్‌మెంట్ల బ్యాక్‌లాగ్‌ను తగ్గించే పనిలో ఉన్నట్లు ప్రకటించింది. వీసా ప్రక్రియను వీలైనంత త్వరగా చేయడంతోపాటూ.. మొదటిసారి అప్లై చేసుకునే వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఏది ఏమైనా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇండియన్స్ కు బహుప్రయోజనంగా మారనుంది.
అందుకే పూర్వం నరసింహ సుభాషితంలో ఒక మాట అంటారు. నాస్తి విద్యాసమో బంధు: నాస్తి విద్యాసమో సహృత్ నాస్తి విద్యా సమం విత్తం నాస్తి విద్యా సమం సుఖం అని. దీనికి అర్థం ఏమిటంటే విద్యతో సమానమైన బంధువు, స్నేహితుడు, ధనమూ, సుఖమూ ఏవీలేవు అని భావము అందుకే విద్య కోసం ఇంతగా పరితపిస్తున్నారు.
T.V.SRIKAR