America Study: అమెరికా వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే..!

అమెరికాలో చదివితే గొప్పగా రాణించగలమన్న నమ్మకం ఇప్పుడు చాలా మందిలో పెరిగిపోయింది. దశాబ్దకాలంగా ప్రతిఒక్కరూ అగ్రరాజ్యానికి పయనమౌతూ వస్తున్నారు. కరోనా సమయంలో దీనికి కొంత బ్రేక్ పడింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో క్రమక్రమంగా వలస వెళ్లే సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా USA చేసిన ప్రకటనతో దీనకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చదువుకోవాలనుకుంటున్న వారికైతే సువర్ణావకాశంగా చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2023 | 01:33 PMLast Updated on: Feb 25, 2023 | 1:40 PM

America Study Visa Details

అమెరికా వెళ్లాలనే ఆలోచన అందరికీ ఉండవచ్చు. కానీ కొందరికే సాధ్యం అవుతుంది. అందులో విద్యార్థుల బీటెక్, ఎంటెక్, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగానే విదేశాలకు వెళ్లాలని నిశ్చయించుకుంటారు. అయితే వీసా కోసం చాలా తిప్పటు పడుతూ ఉంటారు. కొందరికైతే ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ తెలియక సతమతమౌతూ ఉంటారు. మరికొందరు ప్రైవేట్ ఏజెంట్లను నమ్మి మోసపోయిన దాఖలాలు కుప్పులు తెప్పలుగా కనిపిస్తాయి. వీటన్నింటికీ సమాధానమిస్తూ అసలు వీసా అంటే ఏమిటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఇందులో రకాలేంటి.. వీసా కోసం ఇంటర్వూలో రిజెక్ట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రైనింగ్ కోసం కూడా విదేశాలకు వెళ్లొచ్చా అనే అంశాలపై వివరణాత్మక కథనం మీకోసం.

 

వీసా దరఖాస్తు ఎలా చేసుకోవాలి:
చదువుకోవాలనే ఆశకంటే ముందు అక్కడి మెరుగైన స్కూల్స్ వివరాలను సేకరించగలగాలి. తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అనే (SEVP-Student and Exchange Visitor Program) సర్టిఫైడ్ స్కూల్‌లో అప్లై చేసుకోవాలి. దీనితర్వాత స్క్రీన్ మీద కనపడే స్కూల్‌ సెర్చ్‌ టూల్‌ను ఉపయోగించి మనం ఏ రకమైన వీసాకు దరఖాస్తు చేసుకుంటున్నామో దానికి సంబంధించిన ఆప్షన్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే F-1, M-1 విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోవడానికి SEVPలో గుర్తింపుపోందిన స్కూల్స్‌, పేరొందిన ప్రోగ్రామ్‌లను ఎంపిక చేసుకోవాలి. అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి Education USA వెబ్‌సైట్‌లో సర్చ్ చేయవచ్చు. అప్పుడు దీనికి సంబంధించిన సంపూర్ణ అవగాహన మనకు తెలుస్తుంది. వీసా ఇంటర్వూలో ఎదురయ్యే ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

I-20 అంటే తెలుసా..
స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) సెర్టిఫైడ్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ లభించిన తర్వాత సంబంధిత స్కూల్‌ నుంచి అధికారి ఫారమ్ I-20 పంపుతారు. దాన్ని సెర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎలిజిబిలిటీ ఫర్‌ నాన్‌ ఇమిగ్రెంట్‌ స్టూడెంట్స్‌గా పిలుస్తారు. ఈ అప్లికేషన్ ఫారమ్ I-20 అనేది స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS) డేటాబేస్‌లోని విద్యార్థి సమాచారానికి సంబంధించిన రికార్డ్. అడ్మిషన్‌ పొందిన ప్రతి స్కూల్‌ ఫారమ్ I-20ని మెయిల్ చేస్తుంది. అప్పుడే మనం దేనికోసం అమెరికాకు వచ్చామనే విషయం అక్కడి వారికి తెలుస్తుంది. దీనిగురించి మనకు పూర్తిగా అవగాహన రావాలంటే స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. SEVIS అనేది యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్న సమయంలో నాన్‌ఇమిగ్రెంట్‌ స్టూడెంట్స్‌ అంటే అక్కడి స్థానికేతరులుగా గుర్తించేందుకు అందజేసే ఒకరకమైన గుర్తింపు పత్రం వంటింది. ఇందులో ఎక్స్ఛేంజ్ విజిటర్స్‌ సమాచారాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించే వెబ్ బేస్డ్ సిస్టమ్.

I-901 SEVIS ఫీజును చెల్లింపు వివరాలు:
ఫారమ్ I-20ని స్వీకరించిన తర్వాత, తప్పనిసరిగా I-901 SEVIS ఫీజును చెల్లించాలి. SEVIS ఫీజులు మనం తీసుకున్న కోర్స్ లేదా ప్రోగ్రామ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు F1 కోసం 350 డాలర్లు, J1 కోసం 220 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఫెడరల్ నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని F, M, J ఫారం స్వీకరించిన విద్యార్థులు U.S. స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా I-901 SEVIS ఫీజును చెల్లించాలి. I-901 SEVIS ఫీజును FMJfee.com అనే అధికారిక వెబ్ సైట్లో‎ ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఇది మొదటి పద్దతి. Western Union క్విక్ పేని ఉపయోగించి కూడా ఫీజు చెల్లించవచ్చు. ఇది రెండవ పద్దతి. వీసా దరఖాస్తు చేసినప్పుడు ఫీజు చెల్లించిన రిసిప్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. I-901 SEVIS ఫీజు చెల్లించిన బిల్లులోని SEVIS ID నంబర్ ఫారమ్ I-20లోని మీ SEVIS ID నంబర్‌తో మ్యాచ్ అయ్యిందా లేదా అనేది చూస్తారు. అలా సరిపోయినట్లయితే మన చెల్లింపులు విజయవంతంగా పూర్తైనట్లు భావించాలి.

AMERICA VISA PROCESS

AMERICA VISA PROCESS

వీసా ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా:
అమెరికాకు వెళ్లేందుకు రిజిష్టర్ అయిన షెడ్యూల్డ్ ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లో DS-160 ఆన్‌లైన్ నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాతో పాటూ అప్లికేషన్‌ బార్‌కోడ్‌ తప్పనిసరి. అలగే మనం ఎంచుకున్న పేజ్‌, ఫారమ్ 1-20, ప్రస్తుతం తీసుకున్న ఫోటో, పాస్‌పోర్ట్, దరఖాస్తు కోసం చెల్లించిన ఫీజు రిసిప్ట్ అవసరమౌతాయి. మన ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన ప్రిపరేషన్ డాక్యుమెంట్‌లు, యూఎస్‌ స్కూల్‌ లో చదువుకోవడానికి అవసరమైన ఎలిజిబిలిటీ టెస్ట్ స్కోర్‌, అమెరికాకు వెళ్లేందుకు ఒక బలమైన కారణం, యూఎస్‌లో చదువుకొనేందుకు, అక్కడి అవసరాలకు, ప్రయాణ ఖర్చులకు సంబంధించిన నగదు వివరాలు ఖచ్చితంగా వివరించవలసి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కదాంట్లో తడబడినా వీసా రెజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

OPT అంటే దాని ఉపయోగం:
ఆప్షనల్‌ ప్రాక్టికల్ ట్రైనింగ్ ని OPT అంటారు. ఇది F-1 దరఖాస్తు పొందిన స్టూడెంట్స్‌కు తాత్కాలిక ఉపాధికి సంబంధించినది. దీనికి ఎలిజిబిలిటీ కలిగిన విద్యార్థులు తమ చదువును పూర్తి చేయడానికి ముందుగా అయినా.. పూర్తి చేసిన తర్వాత సంవత్సరం వరకు OPT ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తరువాత ట్రైనింగ్ లో ఉన్న సమయం నుంచి OPTలో మిగిలి ఉన్న సమయాన్ని లెక్కగడతారు. అలా లెక్కించిన తరువాత ఎన్న రోజులు వస్తే అన్ని రోజులు అక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీని ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే తప్పనిసరిగా OPT కోసం ఫారమ్ I-20 అనే ఫారం అవసరం అవుతుంది. దీనిని ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌(EAD) కోసం USCISకి దరఖాస్తు చేసుకోవాలి. OPT గురించి మరింత తెలుసుకోవడానికి, USCIS వెబ్‌సైట్, ICE ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెబ్‌పేజీని సందర్శించవచ్చు.

 

T.V.SRIKAR