YouTube Influencer: పాపులారిటీ తెచ్చిన తిప్పలు.. విధ్వంసం సృష్టించిన అభిమానులు
ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్, ఇన్ స్టా, ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రసిద్దికెక్కుతున్నారు. మరి కొందరు సబ్ స్క్రిప్షన్ చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని, తమని ఫాలో అయితే ది బెస్ట్ ఇన్షన్మేషన్ తెలియజేస్తామని అంటారు. కానీ విటన్నింటికి భిన్నంగా గిప్టులు ఇస్తానని చెప్పి చిక్కుల్లో పడ్డారు ఆన్లైన్ ఇన్ ప్లుయెన్సర్.
న్యూయార్క్ నగరానికి చెందిన 21 సంవత్సరాల కై సీనట్ అనే ఇన్ ప్లుయెన్సర్ ఒక ప్రకటన చేశారు. మన్ హటన్ యూనియన్ స్క్వేర్ పార్క్ వేదికగా లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాం ని ఏర్పాటు చేస్తున్నట్లు ఒక పోస్ట్ చేశారు. ఇంతటితో ఊరుకోక ఈవెంట్లో పాల్గొనే తన అభిమానులతో దగ్గరగా కలిసి మాట్లాడుతానని, వారికి ప్లే స్టేషన్ 5 గేమ్స్ కన్సోల్స్ తో పాటూ పలు రకాలా బహుమతులను అందిస్తానని రాసుకొచ్చారు. కై సీనట్ ను ఇన్ స్టా లో ఫాలో అయ్యే వారు ఈ పోస్ట్ పై స్పందించారు. దాదాపు 2వేల మందికి పైగా యువత సీనట్ ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రక్షణా సిబ్బంది అక్కడకు చేరుకొని బారికేడ్లు ఏర్పాటు చేసి వచ్చిన వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసుల చర్యలను నిరసిస్తూ సీనట్ అభిమానులు రెచ్చిపోయారు. ఎక్కడ పడితే అక్కడ అల్లర్లకు పాల్పడ్డారు. అంతే కాకుండా ఆ మార్గం గుండా ప్రయాణం చేసే వాహనాలపై దాడులు చేశారు. ఎత్తైన భవనాలపైకి ఎక్కి విధ్వంసం సృష్టించారు. పోలీసులపై ఎదురుదాడులకు పాల్పడ్డారు. ఇంతటి ఉద్రిక్తల వాతావరణానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా భద్రతా కారణాల దృష్ట్యా సీనట్ ను అక్కడి నుంచి తరలించారు. ఇతను పాపులర్ వీడియో కంటెంట్ క్రియేటర్. ట్విచ్ అనే లైవ్ స్ట్రీమింగ్ వేదికపై సుమారు 65 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాకుండా యూట్యూబ్లో రకరకాల ఆసక్తికరమైన వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.
SRIKAR