ANI News: మేసే మీడియా – కూసే మీడియాను చెడగొట్టడం అంటే ఇదేనా..!

మీడియా అంటే దేశంలోని నాలుగు ఎస్టేట్స్ లో ఒకటి. దీనిని రాజ్యాంగం అధికారికంగా ఆమోదించకపోయినా రాజ్యాంగాని అన్యాయం జరిగితే తన గొంతుకను వినిపిస్తుంది. అలాంటి మీడియా నేడు లేనిది ఉన్నట్లు ఒక తప్పుడు ఏజెన్సీ పేరుతో అవాస్తవాలను ప్రచురిస్తే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. తాజాగా ఈయూ డిస్ ఇన్ఫోబ్యాబ్ చేసిన సర్వేలో అదే జరిగింది. ప్రముఖ పేరొందిన వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ (ANI) ప్రచురించేవి అన్నీ అవాస్తవాలని తేల్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2023 | 04:54 PMLast Updated on: Feb 25, 2023 | 5:49 PM

Ani News Publishing Fake News Items

భారతదేశంలో పేరొందిన న్యూస్ సంస్థలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రముఖ న్యూస్ ఏజెన్సీల నుంచి సమాచారాన్ని రాబడతాయి. అందులో PTI ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇలా న్యూస్ ఏజన్సీల ముసుగులో ప్రముఖ వార్తా దినపత్రికలకు, పాఠకులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ మోసం చేసింది ఒక సంస్థ. ఆసంస్థ పేరు ఏఎన్ఐ (ANI). ఈ సంస్థ డిశంబర్ 9, 1971లో ఏషియా ఫిల్మ్ ల్యాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నెలకొల్పబడింది. క్రమక్రమంగా 1990లో ఏఎన్ఐ (ANI)గా మార్పు చెందింది. ఈ సంస్థలో 2002 వరకూ రైటర్స్ కు 49శాతం వాటా ఉండేది. ఆవాటను ఎఫ్ డీ ఐ (FDI) నిబంధనల ప్రకారం దశలవారీగా కుదించుకుంటూ వచ్చింది. అలాగే 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వార్తలు ప్రసారం చేస్తూ దేశం మొత్తాన్ని మభ్యపెట్టింది. దేశంలో మరే వార్తాపత్రికలు, మీడియా ఛానెళ్లు లేనట్టు బీజేపీ ఈ న్యూస్ మాధ్యమానికే ఇంటర్వూలు ఇస్తూ వచ్చాయి. దీనికోసం పలు ఫేక్ ఆర్టికల్స్ రాసిందిందని మీడియా పరిశోధనా సంస్థలు క్యారవాన్, న్యూస్ లండ్రీ చాలాసార్లు ఏఎన్ఐ కథనాలపై ఆరోపణలు చేశాయి.

జాతీయ మీడియా ఏజెన్సీ చేసిన నిర్వాకం:
భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐని ప్రేమ్ ప్రకాశ్ స్థాపించారు. దీని పరిధి దక్షిణాసియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని జాతీయ మీడియాలతో ఏజెన్సీ కింద ఒప్పదం చేసుకొని నడుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీని అంబరానికి ఎత్తేందుకే ఏఎన్ఐ (ANI) తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందని యూరోపియన్ నాన్ ప్రాఫిట్ గ్రూప్ ఈయూ డిస్ ఇన్ఫో ల్యాబ్ తెలిపింది. ఇంటెలిజెన్స్ సంస్థలు, ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు ఎవరూ లేకపోయినప్పటికీ వీరు చెప్పినట్లుగా అభిప్రాయాలను ప్రచురిస్తూ వచ్చింది. వీరు చెప్పిన వనరులు అస్సలు లేవని “బ్యాడ్ సోర్సెస్: హౌ ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ (ANI) కోటెడ్ సోర్సెస్ దట్ డునాట్ ఎగ్జిస్ట్” పేరుతో ఓ సంచలనాత్మకమైన కథనాన్ని ముద్రించింది. ఇదిలా ఉంటే.. ఏఎన్ఐ (ANI)లో ముద్రించిన వార్తలను ప్రముఖ జాతీయ పత్రికలన్నీ అచ్చం అలాగే ప్రచురించాయి. దీనికి సరైన ఆధారాలు ఉన్నాయి అంటూ తెలిపింది. అవి పెగాసస్, టీమ్ జార్జ్, స్పైవేర్ వంటి మహానేరాల చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చిన సంస్ధ ఈ ఆపరేషన్లో యూరోపియన్ నాన్ ప్రాఫిట్ గ్రూప్ ఈయూ డిస్ ఇన్ఫో ల్యాబ్ కి సహకారం అందించడం ఒక ఎత్తైతే.. ఫ్రాన్స్ కి చెందిన ఫర్ బిడెన్ స్టోరీస్ అనే సర్వే సంస్థ ఈ ఆపరేషన్ లో నిలబడటం మరో ఆసక్తికరమైన అంశం. వీటి సర్వే సారాంశాన్ని ఇలా చెప్పుకొచ్చింది. “ప్రముఖ జాతీయ పత్రికలన్నీంటినీ సంప్రదించి మీరు ఏఎన్ఐ చెప్పిన వాటిని అలాగే ముద్రిస్తున్నారని పలుసార్లు సంప్రదించినా ఒక్క జాతీయ మీడియా సంస్ధల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.” ఇదే దీనికి మరింత బలం చేకూరేలా చేసింది.

యూరోపియన్ నాన్ ప్రాఫిట్ గ్రూప్ ఈయూ డిస్ ఇన్ఫో ల్యాబ్ వెలువరించిన ఆధారాలు ఇవే:

ఏఎన్ఐ(ANI) 2021 మే నుంచి 2023 జనవరి వరకూ 200పైగా వార్తలను, ప్రత్యేకంగా సొంత కథనాలను ప్రచురించిందట. ఈ విషయాన్ని స్వయంగా కెనడాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ నేషనల్ ఫోరమ్ ఫర్ రైట్స్ అండ్ సెక్యూరిటీ (IFFRAS) తెలిపిందని డిస్ ఇన్ఫో ల్యాబ్ వివరించింది. IFFRAS సంస్థను 2014లోనే రద్దు చేసినప్పటికీ శ్రీవాస్తవ గ్రూప్ IFFRAS వెబ్ సైట్ ను నడుపుతుందని తెలిపింది.

ఐపి అడ్రస్ ఆధారంగా దీని లొకేషన్ ను గుర్తించారు. దీనిని బట్టి అర్థమైందేమంటే ANI అనే న్యూస్ ఏజెన్సీ IFFRASను పావుగా వాడుకుంటుంది. ఇలా అందుబాటులో లేని కల్పత సోర్స్ పేరుతో తప్పుడు వార్తలను, సొంత వార్తలను ప్రచురించింది. ఈ ఒక్క ఏజెన్సీని నమ్ముకొని ఉన్న వార్తాపత్రికలన్నీ అందులో ఏమి ప్రచురిస్తే అదే అంశాలను ముద్రిస్తూ వచ్చాయి అని తెలిపింది.

ఇందులో పాకిస్తాన్ ఆర్మీ, చైనా విదేశాంగ విధానం విషయంలో ఏఎన్ఐ(ANI)కి తరచూ ఏదో ఒక కీలకమైన సమాచారం ఇచ్చింది పాలసీ రీసెర్చ్ గ్రూప్. ఈ పాలసీ రీసెర్చ్ గ్రూప్ POREG కి చెందిన జేమ్స్ డగ్లస్ క్రిక్ టన్, మగడ్ లిపాన్, వ్యాలెంటిన్ పోపెక్ వంటి జర్నలిస్ట్ ల పేర్లను వాడుకొని ఈ కథనాలను ప్రచురించింది. అసలు ఈ జర్నలిస్ట్లు ప్రాచుర్యంలోనే లేరని డిస్ ఇన్ఫో ల్యాబ్ తేటతెల్లం చేసింది.

ఏఎన్ఐ (ANI) పేర్కొన్న సెంటర్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఫారెన్ ఎఫైర్స్ (CPAFA) ఇంటలిజెన్స్ ఉన్నప్పటికీ వారు ఇవ్వని విశ్లేషణలు ఇచ్చినట్లు రాసి ప్రచారం చేసింది.

ANI News created a fake news items

ANI News created a fake news items

ఒక్కరు చేసిన తప్పు అందరిపై ప్రభావం:
ఏఎన్ఐ (ANI) జాతీయ మీడియా ఏజెన్సీని నమ్మి అవగాహనా రాహిత్యంగా ముద్రించిన వార్తాపత్రికలు, మీడియా ‎ఛానళ్లు చాలానే ఉన్నాయి. వీటి లిస్ట్ చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది. ప్రింట్, బిజినెస్ స్టాండర్డ్, న్యూస్ 18, సీఎన్ఎన్, రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే గ్రూప్, ఏబీపీ గ్రూప్, టైమ్స్ గ్రూప్, జీ గ్రూప్స్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్, ఎన్డీ టీవి, క్వింట్, స్క్రోల్, ఫస్ట్ పోస్ట్, లైవ్ మింట్, హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్, హిందూ, డెక్కన్ హెరాల్డ్, టెలిగ్రాఫ్, డీఎన్ఏ, ట్రిబ్యూన్, జాగరన్ దైనిక్ భాస్కర్, అమర్ ఉజాలా, నవ భారత్ టైమ్స్ వీటన్నింటినీ చూసుకొని ముద్రించే కొన్ని తెలుగు పత్రికలు కూడా ఇలా అవాస్తవాలను ముద్రిస్తూ వచ్చాయి. ఈ ఛానళ్లను ప్రజలు చూడకుండా తిరస్కరించినప్పుడే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయి. అప్పుడే వీరికి వార్తలను ముద్రించడం పట్ల ఒక అవగాహన, హెచ్చరిక, ఖచ్చితత్వం, బాధ్యత వస్తుంది.

మీడియా అంటే..?
ఏదో ఒకపార్టీకి కొమ్ముకాయకుండా ఏపత్రికలు లేవనే నానుడికి మరింత బలాన్ని చేకూర్చింది ఈ సంచలనమైన కథనం. పార్టీకి ఒక పత్రిక, ముఖ్యమంత్రి కి ఒక ఛానల్ ఉండటమే ఇప్పటి వరకూ చూశాం. కానీ ఇప్పుడు చూసేది చాలా హేయమైన చర్యగా చెప్పాలి. ఒక్క న్యూస్ ఏజెన్సీని చేతిలో పెట్టుకొని జాతీయ మీడియా మొత్తాన్ని చక్రం తిప్పడం అనే ఆలోచన ఊహకు వస్తేనే ప్రపంచం కాసేపు ఆగిపోతుంది. అలాంటిది ఇక్కడ ప్రపంచం ఆగిపోలేదు. అభివృద్ది ఆగిపోయింది. పేదరికం, నిరుద్యోగం, దారిద్ర్యరేఖకు దిగువగా ఉండే బ్రతుకులు మరింత రెట్టింపు అయ్యింది. ఇలా ఒకరి పక్షాన మీడియా నిలవడం వల్ల ప్రజల్లో నిజాయితీతో కూడిన మీడియా ఛానళ్లపై కూడా చెడు అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. సాధారణంగా నేషనల్ మీడియా అంటే వారు చెప్పే సర్వేలు ఖచ్చితత్వంతో కూడి ఉంటాయన్న నమ్మకం స్థిరంగా కొనసాగేది. కానీ ఇప్పుడు ఈ ఉదంతం తరువాత మొత్తం మీడియా ముఖ చిత్రమే మారిపోయింది. చిన్న మీడియా సంస్థలు ఒకరికి మద్దతు ఇస్తేనే దాని ప్రభావం కొన్ని వర్గాల మీద తప్పకుండా పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద దిగ్గజ సంస్థగా పేరొందిన సంస్థలే ఇలా అమ్మడుపోతే ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటి. దీనివల్ల బాగుపడినవారు కేవలం వేళ్లమీద లెక్కపెట్ట గలిగితే.. బుగ్గిపాలైన బ్రతుకులు కొన్ని కోట్లలో ఉంటాయి. అందుకే అక్షరం ఆయుధంతో సమానం అంటారు. ఇలాంటివి వాటిని ప్రచురిస్తేనే కొంతో గొప్పో జర్నలిజం విలువలను కాపాడిన వాళ్లం అవుతాం. జర్నలిజం చేసి మీడియా రంగాన్ని ఎంచుకోవడం వెనుక ఆంతర్యం కేవలం సేవ చేయడం మాత్రమే. ఇలా దోచుకోవడం దండుకోవడం కాదు. మనం రాసే కథనాలకు ప్రభుత్వాలు పాలకులు అధికారులు స్పందించాలి. తద్వారా నష్టపోతున్న వారికి లబ్థి చేకూరాలి. ఇలా చేయగలిగితే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిది.

 

T.V.SRIKAR