India New Train “Rapid X” : భారత్ లో మరో నూతన రైలు.. వందే భారత్ తరహాలో.. “నమో భారత్”
భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో మరో హై స్పీడ్ ప్రాంతీయ రైలు ను పట్టాలెక్కేందుకు రంగం సిద్ధం చేసింది. దేశ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు భారతదేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. రాజధాని ప్రాంతంలో శుక్రవారం ప్రారంభించనున్నారు. ఏంటి ఆ రైలు.. దాని ప్రత్యేకతలు ఏంటి.. ఇందులో ఉండే సౌకర్యాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Another new train will be available for the passengers of India. Rapid X is a high-speed local metro-style train It is named as Namo Bharat
భారతదేశ.. ఎన్నో యుద్ధాలు ఓటు పోటులను తట్టుకున్న ప్రపంలో ఏకైక దేశం.. భారత్. నేటికీ స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకోని వజ్రోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరుపుకుంది. ఇంకా ఎన్నేళ్లు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం గా చెబుతుంటాం.. తరాలు మారినా దేశం తల రాత మాత్రం మారడంలేదు. అభివృద్ధి చెందిన దేశంలో దీటుగా ఇప్పుడు వారి టెక్నాలజీని ఉపయోగించి దేశం అభివృద్ధిలో ముందడుగు పడుతున్నాయి అని చెప్పవచ్చు. దానికి ఉదాహరణే ఈ వ్యవస్థ..
భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో మరో హై స్పీడ్ ప్రాంతీయ రైలు ను పట్టాలెక్కేందుకు రంగం సిద్ధం చేసింది. దేశ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు భారతదేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. రాజధాని ప్రాంతంలో శుక్రవారం ప్రారంభించనున్నారు. ఏంటి ఆ రైలు.. దాని ప్రత్యేకతలు ఏంటి.. ఇందులో ఉండే సౌకర్యాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు అంటే ఏమిటి..?
ర్యాపిడ్ ఎక్స్.. అసలు పేరు ప్రాంతీయ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS). ఇది సెమీ-హై-స్పీడ్ ప్రాంతీయ రైలు వ్యవస్థ. ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో పనిచేస్తుంది.ఢిల్లీలోని ఇతర NCR నగరాలతో కలుపుతూ ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ర్యాపిడ్ ఎక్స్.. సెమీ-హై స్పీడ్ రైలు టెస్ట్ రన్ సమయంలో ఢిల్లీ NCR లోని సాహిబాబాద్ మరియు దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఈ స్ట్రెచ్‌లో ఐదు స్టేషన్లు ఉన్నాయి. సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధర్, దుహై, దుహై డిపో. కారిడార్‌లో ఈ రైళ్లు పరుగులు పెట్టనుంది. ఈ రైళ్లను నగరంలో ఉన్న వివిధ మెట్రో లైన్లు, విమానాశ్రయాలు, బస్టాండ్ స్టేషన్లు లతో ఏకీకృతం చేశారు.
ర్యాపిడ్ ఎక్స్.. రైళ్లలో ఉండే సౌకర్యాలు.. ఏంటి
- ఈ రైలు కోసం, భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్లాబ్ ట్రాక్ ఆస్ట్రియా వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.
- ర్యాపిడ్ ఎక్స్.. రైళ్లు 2025లో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో ప్రారంభమవుతాయి.
- ఈ రైళ్లు వేగం 160 kmph వేగంతో 82 కిలోమీటర్లు ప్రయాణించడానికి 55 నిమిషాలు పడుతుంది.
- రైళ్ల వేగాన్ని పర్యవేక్షించడానికి స్పీడ్ గన్‌లను కూడా అమర్చారు.
- ప్రతి రైళ్లు కూడా 10 నిమిషాల నుంచి 15 నిమిషాల గ్యాప్‌లో స్టేషన్ లో రైలు ఉంటుంది.
- ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
- ఈ రైళ్లులో ఒకే సారి 1700 మంది ప్రయాణం చేయొచ్చు. 1,061 మంది ప్రయాణికులు నిలబడేందుకు ప్రయాణం చేయవచ్చు.
- ప్రతి ర్యాపిడ్ ఎక్స్.. రైలులో ఒక ప్రత్యేక వ్యాపార కోచ్ ఉంటుంది.
- ఇంటర్ సిటీ ప్రయాణం కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎంచుకోవడానికి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారిని ప్రోత్సహించడానికి ఇది చేర్చబడింది.
- కోచ్‌లు పూర్తిగా ఎయిర్ కండిషన్ ఉండేలా చేయబడి ఉంటాయి.
- ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు, Wi-Fi కనెక్షన్‌లు మొదలైనవి ఉన్నాయి.
- ప్రతి రైలులో 2-2 లేఅవుట్‌లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం ఉంటుంది.
- ప్రతి ర్యాపిడ్ ఎక్స్.. రైలులో మహిళల కోసం ప్రత్యేక కోచ్ ఏర్పాటు చేశారు.
- రైళ్లు తేలికైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఏరోడైనమిక్ ముక్కుతో నిర్మించబడ్డాయి.
- ఈ రైళ్లను హైదరాబాద్‌లోని ఆల్‌స్టోమ్ ఇంజనీరింగ్ సెంటర్ రూపొందించింది.
- సావ్లీలోని బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ విటిని తయారు చేసింది.
- తక్కువ ఖర్చులతో సుదీర్ఘ జీవిత కాలం ఉండేలా ఈ ట్రాక్‌లు రూపోందించారు.
- ప్రతి స్టేషన్‌లో కోచ్‌ల గురించి తెలియజేసే బోర్డులు ఉంటాయి.
- పబ్లిక్ అనౌన్స్‌మెంట్, డిస్‌ప్లే సిస్టమ్, డైనమిక్ రూట్ మ్యాప్ డిస్‌ప్లేలు,
- వీల్‌చైర్‌ల కోసం నిర్దేశించిన ప్రాంతాలు, అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేసే ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ కూడా ఈ ట్రైన్ లో ఉంది.
- ఈ కొత్త ర్యాపిడ్ ఎక్స్ రైలుకు ‘నమో భారత్ గా పేరు పెట్టినట్లు సమాచారం.
ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్ టికెట్ ధరలు.. ఎంత.. ?
స్టాండర్డ్ కోచ్‌లో పూర్తిగా 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి. స్టాండర్డ్ కోచ్ లో కనీసం రూ.20 గరిష్టం రూ. 50గా నిర్ణయించారు. ప్రీమియం కోచ్ లో కనీసం రూ.40 రూ. 100 వరకు ధరలు ఉంటాయి.
ర్యాపిడ్ ఎక్స్.. రైళ్ల ప్రాజెక్టు ఖర్చు ఎంతో తెలుసా..?
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.30,200 కోట్ల పైమాటే ఉన్నట్లు సమాచారం. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ వంటి అనేక సంస్థలు ఫైనాన్సింగ్ చేశాయి. RRTS ప్రాజెక్ట్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా ఈ ర్యాపిడ్ రైళ్లు తిప్పనున్నారు.
S.SURESH