Moon World Resorts : భూవిపై చంద్రుణ్ని నిర్మించనున్న దుబాయ్..
నేటికి చిన్నారులకు అమ్మవాళ్లు జాబిల్లి రావే అంటూ తల్లి పాటలు పాడుతూ అన్నం తినిపిస్తుంది. ఇక నుంచి ఎక్కడో ఉన్న జాబిల్లి వంక చూసి పాటలు పాడాల్సిన పని లేదు. పిలవాల్సిన పని అంతకన్నా లేదు.. ఎందుకు అంటారా. ఎందుకంటే ఏకంగా చందమామ నింగి నుండి నేల మీదకు దిగి వస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..? నమ్మసక్యంగా లేదు కాదు అవును.. దుబాయ్ లో మూన్ దుబాయ్ పేరిట ఓ కట్టడం నిర్మించబోతుంది దుబాయ్.
దుబాయ్ కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేశం పేరు వింటే చాలా అక్క ఉండే ఇసుక తప్ప మరేది గుర్తికు రాదు.. మరీ ఇప్పుడు దుబాయ్ అంటే ఓ స్వర్గ దామం అంటే నమ్ముతారా..? ఖచ్చితంగా నమ్మాల్సిందే.. దుబాయ్ లో ఇళ్లు నిర్మిస్తే , రోజులు గడవక ముందే ఆ ఇల్లు కూలిపోవడం ఖాయం. తమ సొంత అవసరాలకు కూడా పంటలు పండి చలేకపోయారు అక్కడి ప్రజలు. తాగడానికి నీళ్లు లేవు.. దేశంలో పంటలు పండవు.. దుబాయ్ లో ఖనిజ, వనరులు లేదు బంగారం, వజ్ర గనులు లేవు కానీ ప్రపంచంలో అత్యధిక సంపన్నుల ఉన్న దేశం.. ప్రపంచంలోనే అందమైన అభివృద్ధి చెందిన దేశం దుబాయ్.. దుబాయ్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌కు నిలయంగా ఉంది. దుబాయ్ నగరాన్ని చూస్తే ఎవరైనా మైమరచిపోతారు. సముద్ర తీరంలో ఆకర్షణీయమైన భవనాలు, సముద్రం మీద రోడ్లు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్యాటక కేంద్రం. ఇప్పుడు మరో అద్భుత కట్టడాన్ని నిర్మించబోతుంది దుబాయ్.
చందమామ మన కంటికి కనిపించే ఏకైక గ్రహం.. అందమైన గ్రహం. చంద్రుడు కి మనకు ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఎలాంటి మనం చిన్నతనంలో అన్నం తినను అని మారాం చేస్తే అమ్మ ఆ చందమామను చూపించి.. జాబిల్లి రావే కొండెక్కి రావే అని పిలుస్తు అన్నం తినిపిస్తుంది. అమ్మ ఎన్ని సార్లు పిలిచిన చందమామ మాత్రం రాలేదు.. కానీ ఇప్పుడు దుబాయ్ దేశం పిలిస్తే ఆ చందమామే భూమిపైకి వస్తుంది అంటా.. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి మరి..
నేటికి చిన్నారులకు అమ్మవాళ్లు జాబిల్లి రావే అంటూ తల్లి పాటలు పాడుతూ అన్నం తినిపిస్తుంది. ఇక నుంచి ఎక్కడో ఉన్న జాబిల్లి వంక చూసి పాటలు పాడాల్సిన పని లేదు. పిలవాల్సిన పని అంతకన్నా లేదు.. ఎందుకు అంటారా. ఎందుకంటే ఏకంగా చందమామ నింగి నుండి నేల మీదకు దిగి వస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..? నమ్మసక్యంగా లేదు కాదు అవును.. దుబాయ్ లో మూన్ దుబాయ్ పేరిట ఓ కట్టడం నిర్మించబోతుంది దుబాయ్.
జాబిల్లి పై 274 మీటర్ల జాబిలి నకలు..
ఇది కల్పన కాదు.. త్వరలోనే జరగబోయే నిజం. అలాగని నింగిలోని జాబిలిని నేలమీదకు దించబోవడం లేదు గాని, నేల మీదనే జాబిల్లిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. దుబాయ్ లోని ‘మూన్ వరల్డ్ రిసార్ట్స్’ అనే ఆకాశహర్మ్యం పైకప్పు మీద 274 మీటర్ల జాబిలి నకలును నెలకొల్పడానికి మూన్ ప్రాజెక్టు పనులను ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
దుబాయ్ దేశంలో కెనడియన్ ఆర్కిటెక్చరల్..
ఈ ప్రాజెక్టు కోసం కెనడా దేశ వ్యాపారవేత్తలు మైకేల్ హెండర్స్ న్, శాండ్రా మాథ్యూస్ 4.28 బిలియన్ పౌండ్లు (రూ.43.894) ఖర్చు చేస్తున్నారు. 10-ఎకరాలో రిసార్ట్ పైకప్పుపై నెలకొల్పే చందమామ దుబాయ్ లోని అన్ని నగరంలోని అన్ని ప్రాంతాలకూ కనిపిస్తుందని చెబుతున్నారు.
అత్యాధునిక సౌకర్యాలతో మూన్ వరల్డ్ రిసార్ట్స్..
ఇందులో 400 లగ్జరీ సూట్స్, నాలుగువేల గదులు, స్పా, వెల్ సెస్, నైట్ క్లబ్, మీటింగ్ ప్లేస్, ఈవెంట్ సెంటర్స్.. ఒకే సారి పదివేల మందికి సరిపడే బోలెడు సౌకర్యాలు ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా లూనాన్ కాలనీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రిస్టార్ట్ లోకి అడుగుపెట్టిన వారికి చంద్రుడి ఉపరితంపై నడుస్తున్న అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. వ్యోమగాములకు, అంతరిక్షంలోకి వైళ్లాలనుకునే వారికీ ఇందులో శిక్షణ ఇస్తారు.
మొన్న బుర్జ్ ఖలీఫా.. నేడు మూన్ వరల్డ్ రిసార్ట్స్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్.. బుర్జ్ ఖలీఫా నిర్మిణంతో ప్రపంచ దేశాల చూపును తన వైపునకు తిప్పుకున్న దుబాయ్.. ఇప్పుడు అచ్చంగా చంద్రుడిని తలపించేలా భారీ రిసార్ట్ నిర్మాణానికి శ్రీకారం చుడుతుంది. దీన్ని కెనెడియన్ కంపెనీ అయిన మూన్ వరల్డ్ రిసార్స్ట ఇంక్ నిర్మించబోతుంది. ఈ భారీ చంద్రుడి ఆకారాన్ని కార్బన్ ఫైబర్ కాంపోజిట్ మెటీరియల్ తో తయారు చేయనున్నారు. 735 అడుగుల ఎత్తు, 198 మీటర్ల గోళాకార వ్యాపార్థంలో, రూ.43.894 వేల కోట్లతో నిర్మించనున్నారు. ఈ “మూన్” ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని ,
ఏటా 25 లక్షల.. సందర్శకులు..
పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు అత్యంత అధునాతన టెక్నాలజీతో ఈ రిసార్ట్ ముస్తాబు అవ్వనుంది. దీనికి ఏటా 25 లక్షల మంది సందర్శకులు రావచ్చని అంచనా చేస్తున్నామని మూన్ వరల్డ్ రిసార్ట్స్ అధినేతలు చెబుతున్నారు. నింగిలో ఉండే జాబిల్లిని భూమిపై చూస్తున్న అనుభూతి కన్నా అద్భుతం ఇంకేముంటుంది.
S.SURESH