APPLE IPHONE : మీ ఐఫోన్ పోయిందా ? నో ప్రాబ్లెమ్ ….మీ డేటాకి ఢోకాలేదు !
యాపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నా... మీ మొబైల్ నుంచి ఏ డేటా కూడా చోరీ చేయలేరు దొంగలు. ఆపిల్ సంస్థ...కొత్త అప్‌డేట్ ను తీసుకొస్తోంది. దాంతో మీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ పేరుతో వస్తున్న ఈ అప్ డేట్ తో మీ డేటాను పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది.

యాపిల్ ఐఫోన్ (Apple IPhone) పోగొట్టుకున్నా… మీ మొబైల్ నుంచి ఏ డేటా కూడా చోరీ చేయలేరు దొంగలు. ఆపిల్ సంస్థ…కొత్త అప్‌డేట్ ను తీసుకొస్తోంది. దాంతో మీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ (Stolen Device Protection) పేరుతో వస్తున్న ఈ అప్ డేట్ తో మీ డేటాను పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది.
మీ ఐఫోన్ చోరీ చేసిన దొంగలు… దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్‌లాక్ చేయలేరు. మీ డివైజ్ పాస్‌కోడ్‌ను (Device Pass code) దొంగలు తెలుసుకున్నా సరే… ఐఫోన్ డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు ఆపిల్ ఈ కొత్త అప్ డేట్ తీసుకొస్తోంది. కంపెనీ iOS 17.3 ప్రివ్యూను రిలీజ్ చేసింది. ఇందులో స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేది బ్రాండ్-న్యూ సేఫ్‌గార్డ్ గా ఉంది. స్టోర్ చేసిన పాస్‌వర్డ్‌లు, ఆపిల్ ఐడీ సెట్టింగ్‌లు, పేమెంట్ డిటైల్స్ లాంటి వాటిని కాపాడటానికి అవకాశముంది.
ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ (Face ID or Touch ID ) లేకుండా మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను దొంగలు యాక్సస్ చేసే అవకాశం లేదంటోంది యాపిల్ సంస్థ. పాస్‌కోడ్ వాడినంత మాత్రాన అన్ లాక్ అవ్వదు. యూజర్ డివైజ్ పాస్‌కోడ్ తెలుసుకుని దొంగలు ఐఫోన్లలోని పర్సనల్ డేటాను దుర్వినియోగం చేసిన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. కానీ ఈ కొత్త అప్‌డేట్ ఐఫోన్ లోని డేటాను యాక్సెస్ చేయాలంటే ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ కావాల్సిందే.
ఐఫోన్ లో ఈ కొత్త అప్ డేట్ ఎప్పుడు వస్తుందంటే… 2024 మొదట్లోనే iOS 17.3ని అందరికీ అందుబాటులో తెస్తామంటోంది యాపిల్ (Apple company) కంపెనీ. స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ అనేది అదనపు భద్రతా చర్యే అంటోంది కంపెనీ. దొంగ డివైజ్ దొంగిలించే ముందు వారి పాస్‌కోడ్ ఎంటర్ చేసినా… యూజర్ కు అలర్ట్ వెళ్తుందని తెలిపింది.