APPSC Group 2: ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

APPSC Group 2: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వైఎస్ జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
REVANTH REDDY: రేవంత్‌కు చిరు, పవన్ విషెస్.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు..
అనంతరం ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా కొత్త సిలబస్, కొత్త పద్ధతిని ఫాలో అవ్వనుంది ఏపీపీఎస్సీ. గ్రూప్-2 పోస్టుల కోసం డిగ్రీ అర్హతగా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ సంప్రదించాలి. ఇక.. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్టార్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్లు, పంచాయతీ రాజ్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు, చేనేత శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులున్నాయి.
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో రాష్ట్ర సచివాలయంలో సీనియర్ ఆడిటర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాలున్నాయి.