ఈ గుర్తులు, శబ్ధాలు లివియథన్ వేనా? ఈ మాన్‌స్టర్ బయటికి వస్తే ప్రళయమే
లివియథన్.. దాదాపు వారం నుంచి ప్రపంచాన్ని భయపెడుతున్న పేరు ఇది. అట్లాంటిక్ ఓషియన్‌లో ఉన్న ఈ అత్యంత భారీ మాన్‌స్టర్ బయటికి వస్తే ఇక భూమి మిగలదు.

లివియథన్.. దాదాపు వారం నుంచి ప్రపంచాన్ని భయపెడుతున్న పేరు ఇది. అట్లాంటిక్ ఓషియన్‌లో ఉన్న ఈ అత్యంత భారీ మాన్‌స్టర్ బయటికి వస్తే ఇక భూమి మిగలదు. జస్ట్ తన తోకతో ఈ లివియథన్ సునామీ తీసుకురాగలదు. అంత భారీ మరిమాణంలో ఉంది ఈ మాన్‌స్టర్. కేవలం దీని తల మాత్రమే మెక్సికో అంత పెద్దగా ఉంటుంది. ఇలాంటి భారీ జీవి ఇప్పుడు భూమి మీదకు రావడానికి రెడీ అవుతోందట. అయితే ఇందులో నిజమెంత.. ఇలాంటి డ్రాగన్ నిజంగా ఉందా ? ఒకవేళ ఇది బయటికి వస్తే నిజంగా భూమి అంతం అవుతుందా ?.
ప్రపంచం మొత్తాన్ని టెన్షన్ పెడుతున్న ఈ లివియథన్‌ను తెలుగులో మకరం అని చెప్తున్నారు. ఈ మాన్‌స్టర్ గురించి ఇప్పటికే చాలా బుక్స్‌లో రాశారు. ముఖ్యంగా బైబిల్‌లో ఈ లివియథన్ గురించి చాలా క్లియర్‌గా ఉంది. దేవుడు ఈ భూమిని తయారు చేసినప్పుడు రెండు భారీ మాన్‌స్టర్లను క్రియేట్ చేశాడు. కానీ తరువాత వాటి వళ్ల జరిగే డేంజర్‌ను తెలుసుకుని వాటిలో ఒకదాన్ని చంపేశాడు. మిగిలిన మాన్‌స్టర్ మహా సముద్రం అడుగు భాగానికి వెళ్లి జీవిస్తోంది. యూదుల పురాణాల ప్రకారం అదే ఈ మాన్‌స్టర్ అని చాలా మంది నమ్ముతున్నారు. ఈ మాన్‌స్టర్ గురించి చాలా మంది చాలా రకాల కథలు చెప్తున్నారు. ఈ కథలు కాసేపు పక్కన పెట్టి.. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుదాం. ఎప్పుడూ లేనిది ఈ మాన్‌స్టర్ టాపిక్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే. అంటార్కిటికా ఓషియన్‌లో రీసెంట్‌గా నీటిమట్టం పెరిగింది.
అలా పైకి వచ్చిన ప్రాంతంలోనే శాటిలైట్ మ్యాప్‌లో ఓ షేప్ కనిపిస్తోంది. దక్షిణ అమెరికా అంటార్కిటికా మధ్యలో కనిపిస్తున్న ఈ షేప్.. ఓ భారీ పాము తలలా కనిపిస్తోంది. అంతే ఇంతకాలం నీళ్లలోపల బతికిన లివియథన్ మాన్‌స్టర్ ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వస్తోంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. రీసెంట్‌గా మెక్సికోలోని సూరన్ బీచ్‌లో డూమ్స్‌డే ఫిష్ కనిపించింది. ఇది చాలా అరుదైన ఫిష్. అసలు భూమి మీదకు రాదు. సముద్రంలో దాదాపు 1000 కిలో మీటర్ల లోతులో జీవిస్తాయి ఈ చేపలు. ఈ చేపలు భూకంపాలను ప్రళయాలను ముందే గుర్తిస్తాయి. భూకంపం వచ్చే ముందే ఏర్పడే ఒత్తిడిని ఇవి తట్టుకోలేవు. అందుకే బయటికి వచ్చేస్తాయి. జపాన్‌లో భూకంపం వచ్చే నెల రోజుల ముందు జపాన్‌లోని బీచ్‌లో 20 ఓర్ ఫిష్‌లు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి.
ఆ తరువాత ఫిలిప్పీన్స్‌లో భూకంపం వచ్చే రెండు వారాల ముందు కూడా ఈ ఓర్‌ఫిష్‌లు అక్కడి బీచ్‌లో కనిపించాయి. యమఘటా అనే దేశంలో 2019లో భూకంపం రావడానికి జస్ట్ వారంలో రోజుల ముందు ఈ ఓర్‌ఫిష్‌లు కనిపించాయి. అదే చేపలు ఇప్పుడు మెక్సికోలో కనిపించడంతో.. ఖచ్చితంగా ఏదో ప్రళయం రాబోతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. వీటికి తగ్గట్టుగానే సముద్రం అంతర్భాగంలో బతికే చాలా జీవులు వింతగా బయటికి వస్తున్నాయి. సముద్రంలో దాదాపు 2 వేల కిలో మీటర్ల లోతులో కనిపించే యాంగ్యులర్ ఫిష్ కూడా సముద్రం నుంచి బయటికి వచ్చింది. ఒడిస్సాలో వేల సంఖ్యలో తాబేళ్లు ఒడ్డుకు వచ్చేశాయి. ఆస్ట్రేలియాలో వందల సంఖ్యలో తిమింగళాలు బయటికి వచ్చాయి. ఇవన్నీ నీటి లోపల లివియథాన్ కదలికలకు భయపడే బయటికి వచ్చాయి అంటున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తున్న షేప్ గురించే ఇప్పుడు అంతా భయపడుతున్నారు. అంతా అనుకున్నట్టు ఇది లివియథన్ కాదు. నిజానికి ఇది కొన్ని అగ్నిపర్వతాల కలయిక.. ఇక్కడ కొన్ని పరిశోధన కేంద్రాలు కూడా ఉన్నాయి. కానీ వాటి కింద మాన్‌స్టర్ ఉంది కాబట్టే అక్కడి ప్రాంతం అలా ఉంది.. అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి అనేది చాలా మంది నమ్మకం. ఇదే ప్రాంతంలో కొంత కాలం క్రితం శాస్త్రవేత్తలు కొన్ని వింత శబ్ధాలను గుర్తించారు.
ఈ రెండు సౌండ్స్‌లో ఏంటి ఎందుకు వచ్చాయి అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. అందుకే ఇక్కడ మాన్‌స్టర్ ఉందా లేదా అనే విషయాన్ని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ ప్రపంచం దేశాలన్నీ కలిసి సముద్రంలో అన్వేశించింది కేవలం 5 శాతం మాత్రమే. అంతుచిక్కని ఎన్నో రహస్యాలు.. మనుషుల ఊహకందని ఎన్నో ప్రాణులు ఈ సముద్రంలో ఉన్నాయి. కానీ గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తున్న ఈ గుర్తులు లివియథన్‌వేనా అంటే కాదు అనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంత భారీ మాన్‌స్టర్ భూ ప్రపంచంలో ఉండే ఛాన్స్ లేదు. ఒక వేళ ఉన్నా.. బయటికి వచ్చినా.. దాన్ని చంపే టెక్నాలజీ మన దగ్గర ఉంది అనేది చాలా మంది సైంటిస్టుల నమ్మకం. కానీ బైబుల్‌లో దీన్ని వర్ణించినంత భయంకరంగా ఆ మాన్‌స్టర్ ఉంటే మాత్రం. మేబీ.. నిజంగానే దాని వల్లే ఈ భూమి అంతం అవ్వొచ్చు. మరి నిజంగా ఈ మాన్‌స్టర్ ఉందా లేదా అనే విషయానికి కాలమే సమాధానం చెప్పాలి.