Charging Alert : పబ్లిక్ ప్లేసెస్ లో ఛార్జింగ్ పెడుతున్నారా ? జాగ్రత్త !
మీరు ప్రయాణానికి బయల్దేరుతుంటే ఇకపై మీ మొబైల్ ఫుల్లుగా ఛార్జింగ్ పెట్టుకోండి. మధ్యలో అయిపోతుంది అనుకుంటే... తప్పనిసరిగా మీ వెంట పవర్ బ్యాంక్ (Power bank) తీసుకెళ్ళండి. పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ లో మొబైల్ చార్జ్ చేస్తే అంతే... మీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
చాలామంది ప్రయాణం చేసేటప్పుడు… తమ మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతే ఎయిర్ పోర్ట్, రైల్వేస్టేషన్ (Railway Station) లేదంటే బస్టాండ్స్ లో ఏర్పాటు చేసిన మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ల (Mobile charging stations) లో (Public Mobile Charging Stations) చార్జ్ చేస్తుంటారు. కానీ ఇవి డేంజర్ అంటోంది కేంద్ర హోంశాఖ.
మీరు ప్రయాణానికి బయల్దేరుతుంటే ఇకపై మీ మొబైల్ ఫుల్లుగా ఛార్జింగ్ పెట్టుకోండి. మధ్యలో అయిపోతుంది అనుకుంటే… తప్పనిసరిగా మీ వెంట పవర్ బ్యాంక్ (Power bank) తీసుకెళ్ళండి. పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ లో మొబైల్ చార్జ్ చేస్తే అంతే… మీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉపయోగించే పిన్స్ ద్వారా ఫోన్లలోకి మాల్ వేర్ చొప్పించి… డేటా చోరీ చేసే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ (MOH) హెచ్చరించింది. జ్యూస్ జాకింగ్ అని పిలిచే ఈ తరహా నేరాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్టు అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.
ఒకవేళ జ్యూస్ జాకింగ్ జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలి. లేదంటే www.cybercrime.gov.in వెబ్ సైట్ లో కంప్లయింట్ చేయొచ్చు. ఛార్జింగ్ పాయింట్స్ పిన్స్ ద్వారా జ్యూస్ జాకింగ్ చేసి మన ఫోన్లలో డేటాను చోరీ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మన డేటా వాళ్ళ చేతుల్లోకి వెళితే ప్రైవేట్ మెస్సేజ్ లు, ఫోటోలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కొందరు. మరికొందరు బ్యాకింగ్, UPI యాప్స్ ద్వారా డబ్బులను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారు.
జ్యూస్ జాకింగ్ (Juice Jacking) జరక్కుండా ఉండాలంటే…
మీరు పబ్లిక్ మొబైల్ ఛార్జర్ల దగ్గర కాకుండా సాధారణ విద్యుత్ పాయింట్స్ ద్వారా మీ మొబైల్స్ ఛార్జ్ చేసుకోవాలి. పవర్ బ్యాంక్స్, లేదా ఇతర ఛార్జింగ్ సాధనాలు మీ దగ్గర పెట్టుకోవడం బెటర్. మొబైల్ కి స్క్రీన్ లాక్ మస్ట్ గా వేయాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే… ఇలాంటి పబ్లిక్ ప్లేసుల్లో మొబైల్ ఛార్జ్ చేసుకోవాలంటే… మీ స్మార్ట్ ఫోన్ ను ఆఫ్ చేసి తర్వాత ఛార్జింగ్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.