Jeans Danger : జీన్స్ వేసుకుంటున్నారా ? పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నట్టే !!
జీన్ పాయింట్స్ (Jean Points) వేసుకోవడం అంటే చాలా మంది యూత్ (Youth) కి ఇష్టం. యూత్ స్టయిల్ (Youth Style) కి ఇదో సింబల్ గా భావిస్తున్నారు.

Are you wearing jeans? Tte is damaging the environment!!
జీన్ పాయింట్స్ (Jean Points) వేసుకోవడం అంటే చాలా మంది యూత్ (Youth) కి ఇష్టం. యూత్ స్టయిల్ (Youth Style) కి ఇదో సింబల్ గా భావిస్తున్నారు. కానీ జీన్స్ (Jean) తో పర్యావరణానికి ఊహించని విధంగా ముప్పు కలుగుతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
యూత్ లో మారుతున్న ట్రెండ్స్ కి తగ్గట్టుగా జీన్స్ ను వెరైటీ స్టయిల్స్ (Variety Styles) లో ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీలు. కానీ వీటితో కార్బన్ డయాక్సైడ్ భారీ స్థాయిలో వెలువడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. చైనాలోని (China) గాంగ్లింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (Gangling University of Technology) పరిశోధకులు జీన్స్ వల్ల కలిగే పర్యావరణ (environmental) కాలుష్యంపై పరిశోధనలు చేశారు. ఒక్క జత జీన్స్ వేసుకోవడం వల్ల రెండున్నర కిలోల కార్బన్ డయాక్సైడ్ (carbon dioxide) ఉత్పత్తి అవుతుందని తేలింది. అంటే.. పెట్రోల్ కారులో ఒకసారి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించటంతో సమానమని తెలిపారు.
సంప్రదాయ జీన్స్ తో పోలిస్తే ఫాస్ట్ ఫ్యాషన్ జీన్స్ (ట్రెండ్ కి తగ్గట్టు తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసే జీన్స్) జీన్స్ సగటున 7 సార్లు మాత్రమే ధరిస్తున్నారు. దాంతో అదనంగా 11 రెట్లు కాలుష్యం పెరుగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. జీన్స్ నుంచి 95-99 శాతం ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతోంది. జీన్స్ వల్ల వెలువడే కార్బన్ డయాక్సైడ్ లో 48 శాతం ఉతకడం, ఆర బెట్టడం, ఇస్త్రీ చేయడం వల్లే కలుగుతోందరని అంటున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న జీన్స్ వాడకాన్ని యూత్ ఇప్పటికైనా తగ్గించాలని కోరుతున్నారు శాస్త్రవేత్తలు.