Maldivian : అసలేంటి పంచాయితీ.. మాల్దీవ్‌ను బాయ్ కాట్ చేయాల్సిందేనా..?
కొంతకాలంగా వీక్ అవుతూ వస్తున్న భారత్, మాల్దీవుల బంధం.. ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లడం.. అక్కడ ఆయన వ్యాఖ్యలపై.. మాల్దీవుల మంత్రి కౌంటర్ వేశారు. దీంతో కొత్త వివాదం మొదలైంది. అది కాస్త చినికిచినికి గాలివానలా తయారవుతోంది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ నెటిజన్లు మారాయి. ఈ మధ్య ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక రంగాన్ని కొత్త జోష్ నింపేలా నాలుగు మాటాలు మాట్లాడారు. ముఖ్యంగా స్నార్కెలింగ్.. అంటే సముద్ర అడుగు భాగంలో ఈత కొట్టే సాహనం గురించి ప్రత్యేకంగ ప్రస్తావించారు.
కొంతకాలంగా వీక్ అవుతూ వస్తున్న భారత్, మాల్దీవుల బంధం.. ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లడం.. అక్కడ ఆయన వ్యాఖ్యలపై.. మాల్దీవుల మంత్రి కౌంటర్ వేశారు. దీంతో కొత్త వివాదం మొదలైంది. అది కాస్త చినికిచినికి గాలివానలా తయారవుతోంది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ నెటిజన్లు మారాయి. ఈ మధ్య ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక రంగాన్ని కొత్త జోష్ నింపేలా నాలుగు మాటాలు మాట్లాడారు. ముఖ్యంగా స్నార్కెలింగ్.. అంటే సముద్ర అడుగు భాగంలో ఈత కొట్టే సాహనం గురించి ప్రత్యేకంగ ప్రస్తావించారు. బీచ్‌లు అంటే ఇష్టపడేవాళ్లు ముందు లక్ష్యద్వీప్‌కు రావాలని పిలుపునిచ్చారు. ఐతే ఇది కాస్త.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్ష్యద్వీప్‌కు రండి అంటూ మోదీ అన్నారనేలా సోషల్ మీడియాలో ఎక్స్‌ప్లోర్ అయింది.
ఈ రచ్చ జరుగుతుండగానే.. ఇండియా మీద, ప్రధాని మోదీ మీద.. మాల్దీవుల మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీచ్ టూరిజంలో మాల్దీవుల నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురవుతోందని.. అది తట్టుకోలేకే.. మాల్దీవులను ఇండియా అటాక్ చేస్తోందంటూ.. ఘాటుగా మాటలు వదిలేశారు. ఐతే ఇది సరిపోదు అన్నట్లు.. మాల్దీవులకు చెందిన మరో మంత్రి.. మోదీపై వ్యక్తిగతంగా దాడి చేశారు. మోదీ ఒక క్లోన్, ఇజ్రాయెల్ చేతుల్లో కీలుబొమ్మ.. లైఫ్ జాకెట్ వేసుకుని డైవ్ చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు మాల్దీవుల యూత్ ఎంపవర్ మెంట్ డిప్యూటీ మినిస్టర్షియూనా. ఆమె వ్యాఖ్యలపై మనోళ్లు భగ్గుమన్నారు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీనిపై నిరసనలు కూడా కనిపించాయ్. దీంతో ఆమె ఆ ట్వీట్ డిలీట్ చేశారు. దీంతో అసలే అటు ఇటుగా ఉన్న మాల్దీవులు, భారత్ బంధానికి.. ఇప్పుడు మరింత బ్రేక్‌లు పడినట్లు అయింది. నిజానికి కొన్నేళ్ల ముందు వరకు భారత్, మాల్దీవుల మధ్య మంచి సంబంధాలే ఉండేవి.
మాల్దీవుల ప్రధాన మిత్రదేశంగా భారత్ ఉండేది. అక్కడ ఇండియా ఫస్ట్ అన్నట్టు పాలసీలు ఉండేవి. ఐతే 2023 నవంబర్‌లో మహమ్మద్ముయిజ్జు.. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయ్. ముందు నుంచి ఆయన భారత్‌కు వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు. మాల్దీవుల.. ఇండియా ఫస్ట్ పాలసీని మారుస్తానని.. తమ దేశంలోని 75ఇండియన్మిలిటరీ సిబ్బందిని వెనక్కి పంపించేస్తానని ఎన్నికల హామీల్లో తెలిపాడు. అధికారంలోకి వచ్చాక కూడా దూకుడు తగ్గించడం లేదు. ప్రధాని లక్ష్యద్వీప్ గురించి మాట్లాడితే.. తమకు తము ఆపాదించుకొని.. ఇప్పుడు మోదీని, భారత్‌ను టార్గెట్ చేయడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. బ్యాన్ మాల్దీవ్స్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.