Auroville City: నగదుతో పనిలేని నగరం.. మన దేశంలోనే..!
నేటి సమాజంలో చాలా మందికి డబ్బు జబ్బు చేసింది. గుండె కూడా ప్రతి సెకను డబ్బు డబ్బు అనే కొట్టుకుంటుంది. దీనికి కారణం సగటు జీవి తన మనుగడ సాగించడం. ఉదయం లేచిన మొదలు పళ్లు కడిగే పేస్ట్ మొదలు రాత్రి నిద్రపోయేటప్పుడు కప్పుకునే రగ్గు వరకూ ప్రతి ఒక్కటీ డబ్బుతో ముడిపడి ఉంది. ఇది వాస్తవం. కానీ డబ్బులు, కలం, మతం, దైవం లాంటివి ఏవీ అవసరం లేని నగరం ఒకటి ఉంది. అది కూడా మన భారతదేశంలోనే. దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కదూ. అయితే పూర్తివివరాలు చదివి తెలుసుకోండి.
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ఖండంలో చూసినా డబ్బే ప్రదానంగా కనిపిస్తుంది. ఆ తరువాత కులమతాలకు విలువ ఇస్తారు. తమ కులం వాడైనా పేదవాడు, బిక్షగాడైతే ఎవరూ పట్టించుకోరు. అలా తయారైంది సమాజం. ఇక ప్రభుత్వాలు, పాలకులు కూడా ఒకే సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ఇలా చెప్పడం కన్నా ప్రజలు తమ సామాజిక వర్గం వారికే ఓట్లు వేసి అధికారం కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పాలి. ఇదంతా మన దేశంలో కాదు యావత్ లోకంలో జరిగే క్రియా విధానం. వీటన్నింటికీ చరమగీతం పాడుతూ భారతదేశంలో ఓ నగరం వెలుగులోకి వచ్చింది.
ఇది తమిళనాడులోని చెన్నైకి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది. దీనిని అరోవిల్ అని పిలుస్తారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఉంది. దీనికి సిటీ ఆఫ్ డాన్, సన్ ఆఫ్ డాన్ అనే పేర్లు ఉన్నాయి. ఈ నగరాన్ని స్థాపించేందుకు ముఖ్య ఉద్దేశ్యం సమాజంలో వివక్ష, అసమానతలు, అంటరానితనం, అస్పృశ్యత, వెనుకబాటు తనం వంటివి రూపుమాపాలని ఇలా ఏర్పాటు చేశారు. ఈ పైన తెలిపిన వాటిలో ప్రతి ఒక్కటి డబ్బుతో ముడి పడి ఉంటుంది. అదే డబ్బులే లేకుంటే కులం, మతం, ప్రాంతం, వర్ణం మధ్య తేడా తెలియదు. అందరూ ఒక్కటే పేదలు, ఆర్థికంగా వెనుకబడినవారిగా గుర్తింపు పొందుతారు. అందుకే ఈ వింత కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నారు.
ఈ నగరంలో దాదాపు 50 దేశాలకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. ఈనగర జనాభా 24 వేలకు పైగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకరికి సేవకునిగా మాత్రమే జీవించాల్సి ఉంటుంది. ఈ నగరాన్ని అక్కడి స్థానికులు యూనివర్సల్ సిటీ అని పిలుస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ నివసించవచ్చు అని దీని అర్థం. ఈ నగరానికి చారిత్రాత్మకంగా ఒక పెద్ద కథ ఉంది. 1914లో పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆధ్యాత్మిక కార్యక్రమానికి జపాన్ దేశానికి చెందిన ఒక మహిళ విచ్చేశారు. ఈమె పేరు మిర్రా ఆల్పాస్సా. ఈమె మొదటి ప్రపంచ యుద్దం సమయంలో జపాన్ కి తిరిగు పయనం అయ్యారు. మళ్ళీ 1920లో తిరిగి వచ్చి1924లో శ్రీ అరబిందో ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూట్ లో చేరి ప్రజాసేవ చేస్తూ ఉండిపోయారు. అలా కొన్ని సంవత్సరాల తరువాత 1968 లో దీనిని నెలకోల్పారని అక్కడి శాశనాల సారాంశం. ఈమె గుర్తుగా ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించారు. దానికి మాతృ మందిరం అని పేరు పెట్టి యోగా, ధ్యానం వంటి కార్యకలాపాలు నిత్యం చేస్తూ ఉంటారు.
T.V.SRIKAR