AYODHYA RAM TEMPLE: అయోధ్య రాముడికి భక్తుడి కానుక.. రాములోరి మెడలో 5 వేల వజ్రాల హారం..
గుజరాత్‌లోని ఒక వజ్రాల వ్యాపారి రామయ్యపై తన రామ భక్తిని చాటుకున్నారు. రామ మందిరం ఇతివృత్తంపై శ్రీరామచంద్ర స్వామికి ఏకంగా వజ్రాల హారం చేయించారు.

AYODHYA RAM TEMPLE: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు మరికొద్ది రోజులే మిగిలి ఉంది. ఈ మహా ఘట్టానికి నెల రోజుల ముందు గుజరాత్‌లోని ఒక వజ్రాల వ్యాపారి రామయ్యపై తన రామ భక్తిని చాటుకున్నారు. రామ మందిరం ఇతివృత్తంపై ఒక హారాన్ని తయారు చేయించారు. సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి శ్రీరామచంద్ర స్వామికి ఏకంగా వజ్రాల హారం చేయించారు.
SALAAR Vs DUNKI: దిగజారుడు.. సలార్‌పై విషం కక్కుతున్న బాలీవుడ్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల కలను తీరుస్తూ నిర్మించిన రామాలయం త్వరలో ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. 2024, జనవరి 24న రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సాధువులు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. సూరత్ వ్యాపారి.. అయోధ్య రామమందిరాన్ని పోలి ఉండేలా వజ్రాల హారాన్ని తయారుచేశారు. 5 వేల అమెరికన్ డైమండ్లు, 2 కిలోల వెండితో చేసిన ఈ హారంలో మందిర నమూనాకే 3 వేల వజ్రాలు వాడారు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్ విగ్రహాలకు కూడా వజ్రాల హారాలు పొదిగారు.
DUNKI: డంకీతో మ్యాజిక్ రిపీటయ్యేనా..? షారుఖ్, హిరానీ కాంబో హిట్ కొడుతుందా..?
మొత్తం 40 మంది కళాకారులు 35 రోజుల్లో డిజైన్‌ను పూర్తి చేశారు. ఈ నెక్లెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 22న ఈ డైమండ్ నెక్లెస్‌ను అయోధ్య ఆలయ కమిటీకి అందజేయనున్నారు. మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవానికి ఒక వారం ముందు, ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక కర్మలు జనవరి 16న ప్రారంభమవుతాయని ట్రస్ట్ బోర్డు నివేదించింది. అయోధ్యలో 4.40 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని జనవరి 24న శ్రీరాముని ప్రతిష్ఠాపన తర్వాత భక్తుల కోసం తెరవనున్నారు.