INDIA TRAVEL: వసంత కాలం.. ఈ సీజన్‌లో ఇండియాలో చూడదగ్గ ప్రదేశాలివే..
భూతల స్వర్గంగా పిలిచే కాశ్మీర్ ఎప్పుడూ పర్యాటకుల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాశ్మీర్‌లో నవంబర్, డిసెంబర్ నుంచే మంచు కురవడం మొదలవుతుంది. ఇక వసంత కాలంలో అక్కడి తోటలు పచ్చదనాన్ని పర్చుకుంటాయి.
INDIA TRAVEL: దేశంలో మార్చి, ఏప్రిల్ నెలల్ని వసంత కాలంగా పరిగణిస్తారు. ఈ కాలంలో చెట్లు పచ్చదనం సంతరించుకుంటాయి. కొన్ని ప్రాంతాలు ఈ సీజన్‌లోనే అందంగా కనిపిస్తాయి. అలాంటి ప్రదేశాలకు మార్చి, నెలల్లో వెళ్తే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మరి.. మీరు కూడా ఈ సీజన్‌లో ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారా..? అయితే ఆ ప్రదేశాలివే.
కాశ్మీర్..
భూతల స్వర్గంగా పిలిచే కాశ్మీర్ ఎప్పుడూ పర్యాటకుల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాశ్మీర్‌లో నవంబర్, డిసెంబర్ నుంచే మంచు కురవడం మొదలవుతుంది. ఇక వసంత కాలంలో అక్కడి తోటలు పచ్చదనాన్ని పర్చుకుంటాయి. పూల తోటలు.. రంగురంగుల పూలతో వికసిస్తాయి. ముఖ్యంగా టులిప్ పూలు వికసించేది ఈ సీజన్‌లోనే. శ్రీనగర్‌లోని టులిప్ గార్డెన్ విజిట్ చేయాలంటే మార్చి, ఏప్రిల్ నెలలే బెస్ట్. ఇక్కడి ఇందిరా గాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్‌లో సందర్శకులు ఈ పూల సొగసును ఆస్వాదించొచ్చు.
Shanmukh Jaswanth: అమ్మాయిని బెదిరించి అన్న.. గంజాయి తాగుతూ తమ్ముడు.. ఇలా దొరికేశారు..!
మున్నార్, కేరళ
కేరళలో ఎక్కువగా ఆకర్షించే వాటిలో టీ ఎస్టేట్స్ ప్రత్యేకమైనవి. మున్నార్‌లో మార్చి, ఏప్రిల్ నెలల్లో టీ తోటలు ఏపుగా పెరిగి, కొండలన్నీ పూర్తిగా పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉంటాయి. 19 నుంచి 35 డిగ్రీల వేడి మాత్రమే ఉంటుంది. చల్లని వాతావరణం, చుట్టూ పచ్చదనంతో నిండిన టీ తోటల మధ్య తిరుగుతూ ఉంటే ఆ హాయి వర్ణనాతీతం అనిపిస్తుంది. ఈ సీజన్‌లో ట్రావెల్ చేయాలనుకుటే మున్నార్ బెస్ట్ ఛాయిస్.
షిల్లాంగ్, మేఘాలయ
స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచే షిల్లాంగ్.. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు. స్కాట్లాండ్ దేశంలోని అందాల్ని ఇక్కడే చూడొచ్చనేది టూరిస్టులు చెప్పే మాట. షిల్లాంగ్‌లో కయాకింగ్ చేస్తూ, సరస్సుల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఆర్కిడ్ పూల్ ఈ సీజన్‌లోనే వికసిస్తాయి. చుట్టూ పూల తోటలు, సరస్సులు, పడవ ప్రయాణం వంటివి సందర్శకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. షిల్లాంగ్ సందర్శించేందుకు ఈ సీజన్ బెస్ట్.
Poonam Kaur: వాడొక బ్రోకర్.. త్రివిక్రమ్‌పై విరుచుకుపడిన పూనమ్..
కూర్గ్, కర్ణాటక
దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. కర్ణాకటలోని కూర్గ్ (కొడగు) మన దేశంలోని పర్యాటకులకు స్కాట్లాండ్ అందాలను పరిచయం చేస్తుంది. ఇక్కడ కూడా కాఫీ తోటలు, కొండలు పచ్చదనంతో కనువిందు చేస్తాయి. చుట్టూ పర్వతాలు ఒక రకమైన సువాసన వెదజల్లుతాయి. ఇక్కడ వికసించే పూలు పర్వతాల అందాల్ని రెట్టింపు చేస్తాయి.
గుల్‌మార్గ్, కాశ్మీర్
కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్.. మరో అందమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఏప్రిల్ నుంచి జూన్ వరకు పర్యాటకులు ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమయంలో నెమ్మదిగా మంచు కరిగిపోతుంది. ఎత్తైన చెట్లు, పర్వతాలపై పేరుకుపోయిన మంచు.. మధురానుభూతిని అందిస్తాయి.