BMW Company Car: 32 రంగులు మారే కారు మార్కెట్లోకి రానుందా..?

కారు అనగానే మనం షికారు వెళ్లేందుకు తారసపడతాము. అదే సొంతకారైతే ఆహుషారే వేరు. ప్రస్తుతం కారు లేని వారు ఎవరూ లేరు. దీనికి గల ప్రదాన కారణం.. లక్ష రూపాయలకే నానో కారును అందించడం వల్ల ప్రతిఒక్కరూ కార్లను విరివిగా కొనేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2023 | 10:07 AMLast Updated on: Feb 15, 2023 | 5:57 PM

Bmw Company Car2023

కారు అనగానే మనం షికారు వెళ్లేందుకు తారసపడతాము. అదే సొంతకారైతే ఆహుషారే వేరు. ప్రస్తుతం కారు లేని వారు ఎవరూ లేరు. దీనికి గల ప్రదాన కారణం.. లక్ష రూపాయలకే నానో కారును అందించడం వల్ల ప్రతిఒక్కరూ కార్లను విరివిగా కొనేశారు. అదే సంపన్న కుటుంబాల వారైతే మరింత ఖరీదైన, విలాసవంతమైన, అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన కారును కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. సాధారణంగా కార్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. అదే అన్ని రంగులు కలిసి ఒకే కారులో ఉంటే కాస్త వింతగానే ఉంటుంది. అదే 32 రంగులు మారేలా ఉంటే మరి ఆ భావనను వర్ణించలేం. వీటిని కొనేందుకు ఇప్పటికే చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ కంపెనీ దీనిని తీసుకొచ్చింది అనే విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత మీలో మొదలైంది అన్న విషయం నాకు అర్థమైంది. ప్రముఖ పేరొందిన బీఎండబ్ల్యూ సంస్థ రకరకాలా రంగులు మారే కార్లను పరిచయం చేసేందుకు మార్కెట్లోకి తీసుకురానుంది.

ఇంకా పరీక్షదశలోనే:
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సమాచారం ప్రకారం తెలుపు, నలుపు రంగులు అందుబాటులో ఉన్నట్లు బీఎండబ్ల్యూ మర్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తెలుపుతున్నారు. దీనిని తలదన్నేలా ఇటీవల జరిగిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఐఎక్స్ (iX) ఫ్లో లక్షణాల​తో కూడిన ఈ ఇంక్ (E ink), ఐ విజన్ డీ (I Vision Dee) అనే పేర్లతో రంగులు మర్చే కార్లను తీసుకురావడానికి సిద్దమైంది. తాజాగా ‘ఐ విజన్ డీ’ అనే కాన్సెప్ట్ కారును ఇందులో ప్రదర్శించారు. ఇది 32 రకరాలా రంగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. క్షణల్లో ఈ కాన్సెప్ట్ కారు రంగులు మార్చుకోగలదు. ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మక దశలోనే ఉంచామని.. మార్కెట్ లో వినియోగదారులకు అమ్మేందుకు ఇంకొద్దిగా సమయం పడుతుందని సంస్థ ప్రతనిధులు తెలిపారు. ఈ కారులోని సాంకేతికతను ఇంకా అంతర్గత పరీక్షదశలోనే ఉంచామని బీఎండబ్ల్యూ సంస్థ చెప్పుకొచ్చింది. వివిధ రకాలా వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంలో వీటి ప్యానెల్స్ పనితీరుపై క్షుణ్ణంగా పరిశోధనలు జరుగుతున్నట్లు ప్రకటించారు.

కారు ధర.. మార్కెట్ వివరాలు:
ఇక వీటిని కేవలం ప్రదర్శనలో ఉంచి ట్రైల్ చేసినంత మాత్రానికే అందరి చూపును తనవైపుకు మళ్లించగలిగింది. అదే ఇక రోడ్డుపైకి వచ్చి దీని పనితీరును కనబరిస్తే ఇక చెప్పేదేముంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన బీఎండబ్ల్యూ సంస్థ తన మార్కెట్ కాంపిటీషన్ ను మరింతగా విస్తరించుకుంటుంది. ఇన్ని వివరాలను తెలిపిన సంస్థ వీటి ధర విషయంలో మౌనం ప్రదర్శించింది. ఈ ప్రత్యేక ఆకర్షణతో నిలచే కార్లు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి అనే విషయంతో పాటూ ధరల విషయంలో కూడా గోప్యంగా ఉంది. వీటిపై స్పష్టత రావల్సి ఉంది. వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.

కారులో ఉపయోగించిన టెక్నాలజీ:
ఇలా వివిధ రకాలా రంగుల మారేందుకు సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చించి. కారుపై ఉన్న పెయింట్ తో రంగు మారదు. కారు మీద ఉండే (ర్యాప్) పైపూతతో ఇరాడ్ స్క్రీనింగ్ అనే సిస్టంతో కలర్స్ మారుతుంది. ఈ కార్ల సంస్ధ ప్రకటనలో తెలిపిన సమాచారం ప్రకారం ఈ ర్యాప్ అనేది మానవుని వెంట్రుకకన్నా చాలా సన్నగా ఉంటుంది. ఇది మిలియన్ల మిల్లీ మైక్రో క్యాప్సూల్స్ లను కలిగి ఉంటుంది. 2022లో కేవలం రెండు రంగులు మారే కారును పరిచయం చేసింది. 2023లో ఈ ఇంక్ (E ink) సాంకేతికతను సరైన విధంగా ఉపయోగించి దీని శక్తి ద్వారా చాలా రంగులను మార్చేందుకు ప్రయోగాలు చేస్తుంది. ఈ శక్తి కేవలం రంగులు మారే క్రమంలోనే వినియోగించబడుతుంది. మారిన రంగు స్థిరంగా ఉండేందుకు ఎలాంటి శక్తి వినియోగించకుండా ఉండేలా దీనిని రూపకల్పన చేస్తున్నారు.

ఇందులోని ఉపయోగాలు:
కారు కొనాలంటేనే మనకు కావల్సిన ఫీచర్లు ఉన్నాయా అని ఒకటికి పదిసార్లు చూస్తాం. ఇక ఉపయోగాల విషయమైతే తప్పనిసరి.అంతేకాకుండా దీనివల్ల ఉపయోగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో భానుడు ఆకర్షించే రంగులు కొన్ని ఉంటాయి. వీటిని అధిగమించి వేసవి తాపం నుంచి అప్పటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా ఈ ఛేంజింగ్ టెక్నాలజీని ఆన్ చేసుకోవచ్చు. తద్వారా అవసరమైన రంగులోకి కారును మార్చుకోవచ్చు. ఇలా రంగులు మార్చుకోవడం వల్ల సూర్య కిరణాలు ఎక్కువ ప్రభావితం కాకుండా ఉంటుంది. దీనివల్ల కారు త్వరగా వేడి ఎక్కదు. కారులోపల సహజంగానే చల్లగా ఉంటుంది. లోపల వేడెక్కిన కారును చల్లబరిచేందుకు ఏసీని ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచాలి. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ కలర్ ఛేంజింగ్ మూడ్ సహాయంతో ఎక్కవ ఇంధన వాడకం లేకుండా ఉండేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు.

 

 

T.V.SRIKAR