2026, air taxis : 2026 నాటికి భారత దేశంలో ఎయిర్ ట్యాక్సీలు చక్కర్లు..
2026 నాటికి భారత దేశంలో ఎయిర్ ట్యాక్సీలు చక్కర్లు..

2026 లో ఆకాశంలో ఎయిర్ ట్యాక్సిల్లో ప్రజలు ప్రయాణాలు జరుపుకోవచ్చు.

వచ్చే ఏడాది చివరి నాటికి DGCA నుంచి సర్టిఫికెట్ పొందొచ్చని ఈ రెండు కంపెనీలు భావిస్తున్నాయి.

ఎయిర్ ట్యాక్సీలు ఈ పేరు కొంచం కొత్తగా ఉంది కాదు.. మరి వాటి సర్విసులు కూడా అంతే వింతగా ఉంటాయి.

భారత దేశంలో ఎయిర్ సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి.

2026 నాటికి భారత్ లో ఎలక్ట్రిక్.. ఎయిర్ ట్యాక్సీలు..

ఎయిర్ ట్యాక్సీలకు డీల్ చేసుకున్న ఆర్చర్ ఏవియేషన్, ఇంటర్ గ్లోబ్

దేశ వ్యాప్తంగా 2026 నాటికల్లా పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభం.

ఇందుకోసం ఆర్చర్ ఏవియేషన్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

ఎయిర్ ట్యాక్సీలతో ఢిల్లీలోని కనాట్ ప్లేస్ నుంచి హర్యానాలోని గురు గ్రామ్ కి 7 నిమిషాల్లో చేరుకోవచ్చు.

రోడ్డు మార్గంలో 27 కి.మీ దూరం ఉండే ఈ ప్రయాణానికి సాధారణంగా 60-90 నిమిషాలు పడుతుంది.

పట్టణ ప్రాంతాల్లో ఎయిర్ ట్యాక్సీలతో పాటు కార్గో, లాజిస్టిక్స్, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఎలక్ట్రిక్ విమానాలను వినియోగించే ఇరు సంస్థలు పరిశీలించనున్నట్లు ఇంటర్ గ్లోబ్ తెలిపింది.

ఇండిగో పేరిట ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ విమానయాన సర్వీసులు అందిస్తోంది.

ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (ఈవీ టీవీ ఎల్) విభాగంలో ఆర్చర్ ఏవియేషన్ కార్యకలాపాలు సాగిస్తోంది.

2026 లో ఎయిర్ ట్యాక్సీలు నడపనున్నట్లు ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది.

ఈ 200 విమానాల ధర దాదాపు ఒక బిలియన్ డాలర్లు లేదా 8,300 కోట్ల రూపాయలు.

40 నిమిషాల్లో పుల్ ఛార్జ్..

"ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్"లో 6 బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి.

ఇవి 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. ఒక నిమిషం ఛార్జ్ చేస్తే ఒక నిమిషం పాటు ఎగుగురుతుంది

"ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్"లో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ప్రయాణించగలరు.

దిల్లీ తర్వాత ముంబై, బెంగళూరులో కూడా ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం అవుతాయి.

దిల్లీ తర్వాత ముంబై, బెంగళూరులో కూడా ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం అవుతాయి.

FAA నుంచి అనుమతి పొందిన తర్వాత, భారతదేశ విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి.