బీర్లు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా
కిడ్నీలో రాళ్లు పోవాలంటే బీర్లు బాగా తాగాలని చాలా మంది అనుకుంటారు. ఎక్కువగా యూరిన్ వస్తుంది కాబట్టి దాంతో రాళ్లు వెళ్లిపోతాయనేది చాలా మంది నమ్మకం. కానీ ఇందులో ఒక్కశాతం కూడా నిజం లేదంటున్నారు పరిశోధకులు.
కిడ్నీలో రాళ్లు పోవాలంటే బీర్లు బాగా తాగాలని చాలా మంది అనుకుంటారు. ఎక్కువగా యూరిన్ వస్తుంది కాబట్టి దాంతో రాళ్లు వెళ్లిపోతాయనేది చాలా మంది నమ్మకం. కానీ ఇందులో ఒక్కశాతం కూడా నిజం లేదంటున్నారు పరిశోధకులు. మ్యాక్స్ హెల్త్ కేర్ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. బీర్లు తాగితే రాళ్లు పోవడం సంగతి పక్కన పెడితే.. కొత్తగా రాళ్లు తయారవుతాయని చెప్తున్నారు. బీర్లలో ఉండే ఆక్సలేట్‌లు, ప్యూరిన్‌లు కిడ్నీల్లో రాళ్లను అభివృద్ధి చేస్తాయట. చాలా మంది బీర్లు తాగిలే బాడీలో నీటి శాతం పెరుగుతుంది అనుకుంటారు. కానీ ఇది తప్పని చెప్తున్నారు డాక్టర్లు. బీర్లు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి బాడీ డీహైడ్రేట్ అవుతుందట. దీని కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్లు.