Canadian couple: మంటెత్తిన ముద్దుతో.. మేటైన రికార్డ్
ముద్దుపై ముద్దుపెట్టు.. అనగానే మనకు చందమామ సినిమాలోని పాట గుర్తుకు వస్తుంది. కానీ ఈ పాటను నిజం చేస్తూ ముద్దునే ముచ్చటగా ఆడి రికార్డులకు నిచ్చన వేశారు ఒక జంట.

Canadian couple, Mike Jamie Jack Guinness Book of World Record for kissing for 15 minutes after eating habanero pepper
కెనడాకు చెందిన మైక్, జామీ అనే జంట తమ ఘాటు ముద్దుతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం కల్పించుకున్నారు. హెబనెరో పెప్పర్ తిని దాదాపు 15 నిమిషాల 6.5 మిల్లీ సెకంన్లపాటూ చుంబనామృత భావనలో మునిగిపోయారు. హెబనెరో పెప్పర్ ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చిగా పేరుంది. అలాంటి ఎర్రటి మిర్చిని ఇద్దరూ తిని ఇలా పావుగంట సేపు చుంబనాముద్రలోకి వెళ్ళడం సాధారణమైన విషయం కాదు. అందుకే వీరిని అరుదైన రికార్డ్ వరించింది.
ఈ సందర్బంగా మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. మరి కొన్నిరోజుల్లో మైక్, జామీ జాక్ దంపతులు తమ 15వ మ్యారేజ్ యానివర్సరీలోకి అడుపెట్టబోతున్నారు. అందుకు గుర్తుగా ఏదైనా చేయాని సంకల్పించారు. దీని వెనుక కఠోరమైన శ్రమే ఉంది. ప్రపంచంలోనే ఘాటైన పెప్పర్ మిర్చిని తినడంలో మైక్ కి ఇదివరకే అనుభవం ఉంది. దీనిపై పలు రికార్డులు కూడా నమోదు చేశారు. తన జీవిత భాగస్వామి జామీ జాక్ కి కూడా ఈ రికార్డుల్లో భాగస్వామ్యం కల్పించాలనుకున్నారు. అందుకే గత నెలరోజులుగా ఈ ఘాటైన పెప్పర్ తినడంలో శిక్షణ అందించారు. తన భార్య ఈ శిక్షణలోనే కాదు రికార్డుల్లోనూ విజయాన్ని పొందిదని చెప్పాలి.
T.V.SRIKAR