Chandrayaan 3: యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టిన చంద్రయాన్-3.. లైవ్ స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డ్..!
లైవ్‌కు సంబంధించి ఇస్రో ఛానెల్ యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇస్రో యూట్యూబ్ ఛానెల్‌లో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను 3.6 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇంతకుముందు యూట్యూబ్ ఛానెల్ హైయ్యస్ట్ లైవ్ రికార్డ్ స్పానిష్ లైవ్ స్ట్రీమర్ అయిన ఇబయ్ (Ibai) పేరున ఉండేది.
Chandrayaan 3: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇండియానే కాదు.. అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. రష్యా లూనా 25 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో అమెరికాసహా అనేక దేశాలు చంద్రయాన్-3పై ఆసక్తి చూపాయి. దీంతో విదేశాల్లో కూడా చాలా మంది చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సాఫ్ట్ ల్యాండింగ్‌ను అన్ని రకాల మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే, లైవ్‌కు సంబంధించి ఇస్రో ఛానెల్ యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది.
ఇస్రో యూట్యూబ్ ఛానెల్‌లో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను 3.6 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇంతకుముందు యూట్యూబ్ ఛానెల్ హైయ్యస్ట్ లైవ్ రికార్డ్ స్పానిష్ లైవ్ స్ట్రీమర్ అయిన ఇబయ్ (Ibai) పేరున ఉండేది. ఈ ఛానెల్‌లో 3.4 మిలియన్ల లైవ్ స్ట్రీమింగ్ జరిగింది. దీన్ని తాజాగా ఇస్రో బ్రేక్ చేసింది. దేశప్రజలే కాకుండా.. విదేశీయులు కూడా ఈ ఛానెల్ వీక్షించారు. చాలా కాలం తర్వాత దూరదర్శన్ టీవీ ఛానెల్‌ను కూడా ఎక్కువ మంది వీక్షించారు. అత్యధికమంది దూరదర్శన్ ఛానెల్‌లో సాఫ్ట్ ల్యాండింగ్‌ను చూశారు. అలాగే ఈ ఛానెల్ యూట్యూబ్ పేజీని 750,822 మంది చూశారు. మరోవైపు చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకినప్పుడు ఫేస్ బుక్ లో 3.55 మిలియన్ల మంది లైవ్ స్ట్రీమింగ్ చూశారు.
వివిధ టీవీ ఛానెల్స్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు అత్యధిక సంఖ్యలో వీక్షించారు. ఓటీటీ, నేషనల్ జియోగ్రఫిక్ ఛానెళ్లతోపాటు యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కూడా యూజర్లు ఈ అద్భుత క్షణాలను వీక్షించారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు, ఇస్రోకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.