Chandrayaan 3: చంద్రయాన్-3.. షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్..
చంద్రయాన్ 3 వ్యోమనౌక షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ కానుంది. సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడిని తాకనుంది. సాయంత్రం 5 గంటల 47 నిమిషాల తర్వాత ల్యాండర్ తన పని తాను చేసుకుపోతుంది.
Chandrayaan 3: ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ వైపే.. కాదు కాదు చంద్రయాన్ వైపే చూస్తోంది. ఓ హాలీవుడ్ మూవీ కన్నా తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన చంద్రయాన్.. చంద్రుని చెంతకు చేరింది. చంద్రుడి మీద దిగడం, చంద్రుడి ఉపరితలాన్ని తాకడమే ఇప్పుడు బ్యాలెన్స్. ఆ క్షణం కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశమంతా ఒకే గొంతుక చేసుకొని.. చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని ప్రార్థిస్తోంది. అన్ని మతాలను, అన్ని కులాలను కలిపి చంద్రయాన్.. చంద్రున్ని అందుకునేందుకు సిద్ధం అవుతోంది.
ఇలాంటి సమయంలో ఇస్రో మరో కీలక న్యూస్ చెప్పింది. చంద్రయాన్ 3 వ్యోమనౌక షెడ్యూల్ కంటే ముందే ల్యాండింగ్ కానుంది. సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడిని తాకనుంది. సాయంత్రం 5 గంటల 47 నిమిషాల తర్వాత ల్యాండర్ తన పని తాను చేసుకుపోతుంది. అన్ని సెన్సర్లు ఫెయిలైనా, ల్యాండింగ్ అయ్యేలా ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపొందించారు ఇస్రో సైంటిస్టులు. చంద్రుడికి చేరువయిన దశలో ల్యాండర్ ఎవరి మాట వినదని.. 2 ఇంజిన్లు ఫెయిలైనా సజావుగా ల్యాండింగ్ అయ్యేలా ప్లాన్ చేశామని ఇస్రో చీఫ్ వెల్లడించారు. అల్‌గారిథమ్స్ బాగా పనిచేస్తే చాలు.. ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్లే అని ధీమాగా ఉన్నారు. చంద్రుడి మీద చంద్రయాన్ ల్యాండింగ్‌లో పూర్తిగా కంప్యూటర్లదే కీలక పాత్ర కాబోతోంది. శాస్త్రవేత్తలది కేవలం పరిశీలక పాత్ర మాత్రమే. 2019లో చంద్రయాన్ 2 ల్యాండర్ నిలువుగా దిగకపోవడం వల్లే కూలింది.
ఐతే ఇప్పుడు అలాంటి తప్పు జరగకుండా సైంటిస్టులు జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుడిపై ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా రోవర్లు మాత్రమే ల్యాండ్ అయ్యాయి. దీంతో చంద్రయాన్-3 వైపు ప్రపంచం మొత్తం చూస్తోంది. చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను సౌతాఫ్రికా నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా వీక్షించనున్నారు. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోబోతోంది. రష్యా లూనా 25 ఫెయిల్ కావడంతో.. చంద్రయాన్‌పై ఇతర దేశాల ఆసక్తి కనిపిస్తోంది. ప్రయోగం సక్సెస్ అయితే దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ నిలవనుంది. జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగించగా.. 41 రోజుల పాటు ప్రయాణం చేసిన చంద్రయాన్.. ఇప్పుడు చంద్రుని దగ్గరకు చేరుకుంది.