Chandrayaan-3: చంద్రుడిపై ఆటలాడుతున్న ప్రగ్యాన్‌ రోవర్‌.. మరో వీడియో రిలీజ్‌ చేసిన ఇస్రో..

14 రోజుల్లోనే చాలా పరిశోధనలు చేయాల్సి ఉండటంతో ప్రతీ నిమిషాన్ని చాలా పొదుపుగా వాడుకుంటోంది రోవర్‌. జాబిల్లి ఉపరితలంపై అటూ ఇటూ తిరుగుతూ తన అన్వేషణలు కొనసాగిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2023 | 04:20 PMLast Updated on: Aug 31, 2023 | 4:20 PM

Chandrayaan 3 Lander Camera Captures Pragyan Rover Playfully Rotating And Sent To Isro

Chandrayaan-3: చంద్రుడిపై ప్రగ్యాన్‌ రోవర్‌ పరిశోధనలు కొనసాగుతున్నాయి. రోవర్‌ పంపించే ప్రతీ ఇన్ఫర్మేషన్‌ను ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. 14 రోజుల్లోనే చాలా పరిశోధనలు చేయాల్సి ఉండటంతో ప్రతీ నిమిషాన్ని చాలా పొదుపుగా వాడుకుంటోంది రోవర్‌.

జాబిల్లి ఉపరితలంపై అటూ ఇటూ తిరుగుతూ తన అన్వేషణలు కొనసాగిస్తోంది. తాను సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ల్యాండర్‌కు పంపుతూ ఇస్రో సెంటర్‌కు కమ్యూనికేషన్‌లో ఉంటోంది. కొన్ని దారుల్లో బండరాళ్లు, గుంతలు ఉండటంతో కొత్త దారులను అన్వేషిస్తూ ప్రయాణం కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ట్విటర్లో పోస్ట్‌ చేసింది. సరైన మార్గాన్ని ఎంచుకునేందుకు చిన్న పిల్లాడిలా రోవర్‌ అటూ ఇటూ తిరుగుతున్న ఓ వీడియోను షేర్‌ చేసింది.

తల్లి అప్యాయంగా చూస్తుంటే చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్టు ఉంది కదూ అంటూ సరదాగా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇస్రో చెప్పినట్టుగానే రోవర్‌ చేస్తున్న మూమెంట్స్‌ అచ్చు చిన్న పిల్లాడిలాగే ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చాలా అడోరబుల్‌గా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.