International Change Password Day : మీ పాస్ వర్డ్ ఇవాళైనా మార్చండి !
ఇవాళ అంతర్జాతీయ పాస్ వర్డ్స్ (International Password) మార్చే రోజు... అంటే ఇంటర్నేషనల్ ఛేంజ్ పాస్ వర్డ్ డే.. అదేంటి... అలాంటి డే కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్య పోతున్నారా... అవును... ఉంది ఖచ్చితంగా... చాలామంది తమ పాస్ వర్డ్స్ ని ఈజీగా గుర్తుంచుకోవడం కోసం... చాలా తేలికగా పెట్టుకుంటున్నారు.
ఇవాళ అంతర్జాతీయ పాస్ వర్డ్స్ (International Password) మార్చే రోజు… అంటే ఇంటర్నేషనల్ ఛేంజ్ పాస్ వర్డ్ డే.. అదేంటి… అలాంటి డే కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్య పోతున్నారా… అవును… ఉంది ఖచ్చితంగా… చాలామంది తమ పాస్ వర్డ్స్ ని ఈజీగా గుర్తుంచుకోవడం కోసం… చాలా తేలికగా పెట్టుకుంటున్నారు. దాంతో సైబర్ క్రిమినల్స్ కు అడ్డంగా దొరికిపోయి… లక్షలు, కోట్లల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ప్రైవేట్ మెయిల్స్, అకౌంట్స్ హ్యాక్ చేసి… బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు కేటుగాళ్ళు. అందుకే సైబర్ నిపుణులంతా కలసి ఈ పాస్ వర్డ్ డేని ప్రొజెక్ట్ చేస్తున్నారు.
చాలామంది ఈజీగా గుర్తుండటానికి… పాస్ వర్డ్ (OTP) ను సింపుల్ గా పెట్టేస్తారు. జీమెయిల్ దగ్గర నుంచి వివిధ పేమెంట్ యాప్స్, ఈ-కామర్స్ వెబ్ సైట్స్(E-commerce websites), యాప్స్(Apps)… ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలకు పాస్ వర్డ్స్ అవసరమవుతాయి. వీటికి ఎంత స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టుకుంటే అంత మన అకౌంట్ భద్రతంగా ఉంటుంది. కానీ 2023లో ఎక్కువ మంది ఉపయోగించిన 10 పాస్ వర్డ్స్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది.
ఇందులో: 123456, 123456789, qwerty, password, 12345, qwerty123, 1q2w3e, 12345678, 111111, 1234567890 ఇలాంటి ఈజగా ఉండే పాస్ వర్డ్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇంత ఈజీగా ఉంటే కనిపెట్టడం సైబర్ క్రిమినల్స్ పెద్ద కష్టం కావడం లేదు. వీటిల్లో ఏదో ఒకటి యూజ్ చేస్తూ… బ్యాంక్ అకౌంట్స్ ని ఖాళీ చేస్తున్నారు.
2021లో 43శాతం డేటా దొంగతనాలు జరిగాయి. వాటిల్లో 62శాతం పాస్ వర్డ్స్ దొంగిలించడం వల్ల జరిగినవే. అయితే… 15శాతం మాత్రం ఈజీ పాస్ వర్ట్స్ తో దొంగతనం చేశారు. అందుకే మీ పాస్ వర్డ్స్ అప్పుడప్పుడూ మారుస్తూ ఉండాలని సైబపర్ నిపుణులు చెబుతున్నారు.
మీ అకౌంట్స్ కి ఉపయోగించే పాస్ వర్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకోసం కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. ఉదాహరణకు మీకు ఎంతో ఇష్టమైన పాటలో మొదటి పదాన్ని మీ పాస్ వర్డ్ గా పెట్టుకోవచ్చు. దాన్ని సైబర్ క్రిమినల్స్ ఏ మాత్రం ట్రేస్ చేసే అవకాశం ఉండదు. పైగా మనకు కూడా తొందరగా గుర్తుంటుంది. అలాగే ఒక్కో అకౌంట్ కి ఒక్కో పాస్ వర్డ్ పెట్టుకోవడం కూడా మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఒకటి లీక్ అయితే… మీ అన్ని అకౌంట్స్ ని సైబర్ క్రిమినల్స్ ఈజీగా ఓపెన్ చేసుకుంటారు.
ఈ మధ్యకాలంలో చాలా సంస్థలు ఒకటి కంటే మించి సేఫ్టీ లేయర్స్ ను సూచిస్తున్నాయి. అలాంటి సిస్టమ్ కూడా ఎంచుకోవచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాస్ వర్డ్ కూడా షేర్ చేయొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. అది ఏ విధంగా అయినా లీకయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సో… ఇంటర్నేషనల్ ఛేంజ్ పాస్ వర్డ్ డే… నాడు అయినా మీ అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్పుకోండి.