CHINA POPULATION MOST DECREASED: చైనాలో వింతపాలసీ -పెళ్లికాకుండానే పిల్లలు కనవచ్చు..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2023 | 12:06 PMLast Updated on: Feb 02, 2023 | 1:28 PM

China Population Most Decreased చైనాలో వింతపాలసీ పెళ

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల్గిన దేశం చైనా.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చైనా జనాభా తగ్గుముఖం పడుతుంది. 2021లో చైనాలో పుట్టింది కేవలం 4.80లక్షల మంది మాత్రమే. జనాభా తగ్గుముఖం కార్మికశాఖపై కూడా పడుతోంది. ఈ క్రమంలో ఏకసంతాన విధానాన్ని రద్దు చేసి పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది డ్రాగన్ ప్రభుత్వం. అయినప్పటికీ పిల్లలను కనేందుకు చైనీయులు ఆసక్తి చూపడంలేదు. దీంతో మరో కీలక ప్రకటన చేసింది. పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు కనండి అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇంతలా పడిపోవడానికి ఇలాంటి వింత విధానాలను తీసుకురావడానికి గల కారణాలను తెలసుసుకునే ముందు చైనా జనాభా ముఖ చిత్రాన్ని పరిశీలించాలి. ముందుగా 1959-61 నాటి మహాకరువు తరువాత ఈ సంవత్సరం జనాభా తగ్గుముఖం పట్టింది. అయితే గత 2016లోనే ఏకసంతాన విధానానికి స్వస్తి చెప్పి ముగ్గురుబిడ్డలు ముద్దు విధానంతో ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయినా పెరుగుదల కనిపించడంలేదు. చైనాలో జనాభా తగ్గుదలకు కరోనా కఠిన లాక్ డౌన్ కారణమన్న వాదనా ఉంది. పిల్లలను కనేందుకు సుముఖత చూపకపోవడమే జనాభా తగ్గుదలకు ప్రదాన కారణం అని చెప్పాలి. ఇది చాలా సంవత్సరాలుగా తగ్గుతుంది. చైనా మెత్తం సంతానోత్పత్తిరేటు 1980 చివర్లో 2.6శాతంగా ఉంది. అప్పట్లో మరణాల రేటు 2.1కంటే చాలా ఎక్కువ. 1994నుంచి ఈ జననాల రేటు 1.6 మరణాల రేటు 1.7 మధ్య ఉంది. 2020లో 1.3కి 2021లో కేవలం 1.15కి పడిపోయింది. 2021నుంచి ప్రతిఏట సగటున 1.1శాతం చొప్పున చైనా జనాభా తగ్గుతుంది. ఈ లెక్క చొప్పున 2100 సంవత్సరం నాటికి కేవలం 58.7కోట్ల మంది మాత్రమే చైనాలో ఉంటారు. అంటే ప్రస్తుత జనాభాలో సగానికి పడిపోతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంచనా వేసింది. గడిచిన నాలుగు దశాబ్ధాల్లో చైనా జనాభా 66 కోట్లనుంచి 140 కోట్లకు పెరిగింది. 2020లో 141కోట్లా 21లక్షలా 21వేలుగా ఉన్న చైనా జనాభా 2021లో 141కోట్లా 26లక్షలుగా ఉందని చైనా జాతీయ గణాంకాల సంస్ధ వెల్లడించింది. చైనా గతఏడాది 141.21 కోట్ల నుంచి 141.26 కోట్లకు చేరింది. నాలుగు దశాబ్ధాలుగా చైనా జనాభా గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. 660 మిలియన్ల నుంచి 1.4 బిలియన్లకు చేరింది. నాలుగుదశాబ్ధాల అనంతరం మొట్టమొదటి సారిగా ఈ స్థాయిలో జనాభా తగ్గిపోవడం సంచలనంగా మారింది.

అయితే మిగతా దేశాల్లో మాత్రం సంతానోత్పత్తిలో పెరుగుదల కనిపించడం గమనార్హం. అస్ట్రేలియా, అమెరికాల్లో సంతానోత్పత్తి రేటు 1.6 కాగా జపాన్లో 1.3 గాఉంది. 2029 నాటికి తమదేశ జనాభా 144 కోట్లకు చేరుతుందని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2019లో అంచనా వేసింది. చైనాలో సామాజిక, ఆర్థిక కారణాల వల్ల ఎక్కువ మందిని కనేందుకు మహిళలు సుముఖత చూపడంలేదని ఈ అకాడమీ వెల్లడించింది. ముగ్గురు పిల్లలు కనాలన్న విధానం తెచ్చినప్పటికీ సంతానోత్పత్తి పెరగలేదు. దశాబ్ధలుగా చిన్న కుటుంబాలకు అలవాటు పడిన వారు పెద్ద కుటుంబాలుగా ఎదిగేందుకు ఆసక్తి చూపడం లేదు. చైనాలో జీవన వ్యయం పెరిగిపోయింది. వివాహ వయసు పెరగడంతో సంతానోత్పత్తి ఆలస్యమై పిల్లలను కనాలన్న కోరిక తగ్గిపోవడంతోందని ఇలా పలువురు పలు విశ్లేషణలు చేస్తున్నారు. అటు వీటన్నింటికీ మించి సంతాన సాఫల్యం కలిగిన మహిళల సంఖ్య కూడా చైనాలో బాగా తగ్గిపోయింది. అలాగే పని చేసుకొని బ్రతికే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో వృద్దుల సంఖ్య పెరిగిపోతోంది. 2100 నాటికి వృద్దుల సంఖ్య మరింత పెరుగుతుందని షాంఘై అకాడమీ హెచ్చరించింది. పనిచేసే వారి సంఖ్య 1.73కు పడిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దానికి తగ్గట్లుగా ఉత్పాదక వేగం పుంజుకోకుంటే ఆర్థికరంగం బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కార్మికుల సంఖ్య తగ్గిపోతే వ్యయం బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఉత్పాదక యూనిట్లు, కార్మిక వ్యయం చౌకగా ఉండే దేశాలకు తరలిపోయే అవకాశం ఉందని ఈ అకాడమీ విశ్లేషించింది. పెరిగిపోతున్న వృద్దుల ఆరోగ్యం, వైద్యం, సంరక్షణ సేవలకు అధిక ధనం వెచ్చించాల్సి వస్తుంది. 2020లో చైనాలో ఫెన్షన్ చెల్లింపులు ఆదేశ జిడిపిలో 4శాతంగా ఉండగా 2100కి ఇవి 20శాతానికి చేరే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ గణాంకాలన్నీ గమనిస్తే రాబోయే కొన్నేళ్లల్లో ఉత్పాదక పరిశ్రమలు భారత్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ప్రస్తుతం పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు కనండి అనే మరో కొత్తపాలసీకి శ్రీకారం చుట్టింది చైనా ప్రభుత్వం.

ఒకప్పుడు కేవలం వివాహిత జంటలే చట్టబద్ధంగా పిల్లలను కనేలా అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు పెళ్లి కాకపోయినా పర్వాలేదు చట్టబద్ధంగా పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. పెళ్లి కానీ వారు ఎవరైనా తమ కుటుంబాన్ని పెంచుకోవాలనుకుంటే ఓకే అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోవటంతో దాన్ని పెంచే క్రమంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. నైరుతీ ప్రావిన్స్‌లో సిచువాన్‌ ఐదో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం 60 ఏళ్ల కంటే పైబడినవారి పరంగా ఏడో స్థానంలో ఉంది. ఈ మధ్య కాలంలో వివాహాలు, జననాల రేటు పడిపోవడంతో ఈ నిబంధనలను తీసుకువచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనుంది చైనా ప్రభుత్వం.

వివాహిత జంటలే కాదు పిల్లలు కావాలనుకునే వారంతా అధికారుల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకుని కోరుకున్నంత మంది పిల్లలని కనవచ్చని స్పష్టం చేసింది. ఆరు దశాబ్దాలలో మొదటిసారి చైనా జనాభా తగ్గిపోయింది. దీన్ని చారిత్రాత్మక మలుపుగా చెప్తున్నారు అక్కడి అధికారులు. దీర్ఘకాలిక సమతుల్య జనాభాను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది సిచువాన్‌ ఆరోగ్య కమిషన్‌. జనాభాను పెంచేలా ప్రజలకు మరిన్ని ప్రోత్సహాకాలు అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వైద్య బిల్లులు కవర్‌ అయ్యేలా ప్రసూతి బీమా, ప్రసూతి సెలవుల సమయంలో జీతాన్ని అందించేలా వెసులబాటు వంటి ప్రోత్సహాకాలను అందింనున్నారు. ఇది ఒంటరిగా జీవించే మహిళలు, పురుషులకు కూడా వర్తిస్తుందని చెప్తోంది చైనా ప్రభుత్వం.
2022లో చైనాలో జనాభా పడిపోయింది. కిందటి సంవత్సరం కంటే చైనాలో జనాభా తగ్గిపోవడం 1961 తర్వాత ఇదేతొలిసారి. ప్రస్తుతం చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022ముగిసేనాటికి ఏకంగా 8,50,000 తగ్గింది. దీనికి కారణం జననాల కంటే మరణాలు ఎక్కువ అవ్వడం. 2022లో చైనాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. డ్రాగన్ దేశంలో 1976 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. 2022లో ప్రతి 1000 మందిలో మరణాల రేటు 7.18గా నమోదైంది.అదే 1976లో ఇది 7.37గా రికార్డ్ అయింది. 2022లో 1000 మంది మహిళలకు 6.77 జాతీయ జననాల రేటు రికార్డ్ అయింది. మరి 2021 విషయానికొస్తే ఇది 7.52గా ఉండేది. మరోవైపు మూడేళ్లుగా చైనాను కొవిడ్-19 అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వల్ల ఆ దేశంలో లక్షలాది మరణాలు సంభవించినట్టు కూడా సమాచారం బయటికి వస్తోంది. 2022కు గాను చైనాలో జీడీపీ వృద్ధి 3శాతంగా నమోదైంది. గత 50 సంవత్సరాల్లో ఆ దేశానికి ఇదే రెండో అత్వల్ప వృద్ధిరేటుగా చెప్పాలి. ఇటీవల జీరో కొవిడ్ పాలసీని ఎత్తేయటంతో ఈ మాత్రం వృద్ధినైనా చైనా సాధించగలిగింది.